Samarasimha Reddy Movie: బాలయ్య బాబు కెరీర్ లో సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అన్న విషయం అందిరికీ తెలిసిందే.. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బీ. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కగా సిమ్రన్, అంజలి జావేరి హీరోయిన్స్ గా నటించారు. మణిశర్వ సంగీతం అందించిన ఈసినిమా సంక్రాంతికి విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాయగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. సినిమాలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ తర్వాత బాలయ్య బాబు మాస్ డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో 1999లో ఇండస్ట్రీని ఊర్రుతలూగించింది.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా బీ.గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు.అయితే ఆరు కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ అనూహ్యంగా 16 కోట్లు రాబట్టింది. 122 కేంద్రాలలో 50 రోజులు, 32 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ మూవీ 29 కేంద్రాలలో 175 రోజులు, 3థియేటర్లలో 227 రోజులు ఆడింది. అయితే ఈ మూవీ కోసం ముందుగా రాశి, సంఘవి, అంజలా జవేరిలని హీరోయిన్లుగా అనుకున్నారట. కాగా సిందూరపువ్వు తమిళ మూవీ మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి సమరసింహారెడ్డి సినిమా కథ విజయేంద్ర ప్రసాద్ రాసుకోగా, అయన దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహాతో రాయలసీమ ఫ్యాక్షన్ ని జత చేశారట. అయితే ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి,
గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడిందట. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశారట. దీంతో ఆ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నారట. ఇక సినిమాలో ఆ సీన్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ నో చెప్పడంతో మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేశారట. అది ఎవరంటే.. రాశి ఈ సినిమాలోని సీతాకోకచిలుక సన్నివేశానికి నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ సెలెక్ట్ చేశారట.
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.