Samarasimha Reddy Movie : ఆ సీన్ ఉంద‌ని స‌మ‌ర‌సింహా రెడ్డి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవ‌రో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samarasimha Reddy Movie : ఆ సీన్ ఉంద‌ని స‌మ‌ర‌సింహా రెడ్డి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవ‌రో తెలుసా..?

Samarasimha Reddy Movie: బాల‌య్య బాబు కెరీర్ లో స‌మ‌ర‌సింహారెడ్డి ఇండ‌స్ట్రీ హిట్ అన్న విష‌యం అందిరికీ తెలిసిందే.. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బీ. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా సిమ్ర‌న్, అంజ‌లి జావేరి హీరోయిన్స్ గా న‌టించారు. మ‌ణిశ‌ర్వ సంగీతం అందించిన ఈసినిమా సంక్రాంతికి విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్ రాయ‌గా.. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. సినిమాలోని పాట‌లు సూప‌ర్ హిట్ గా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 August 2022,2:20 pm

Samarasimha Reddy Movie: బాల‌య్య బాబు కెరీర్ లో స‌మ‌ర‌సింహారెడ్డి ఇండ‌స్ట్రీ హిట్ అన్న విష‌యం అందిరికీ తెలిసిందే.. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బీ. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా సిమ్ర‌న్, అంజ‌లి జావేరి హీరోయిన్స్ గా న‌టించారు. మ‌ణిశ‌ర్వ సంగీతం అందించిన ఈసినిమా సంక్రాంతికి విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్ రాయ‌గా.. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. సినిమాలోని పాట‌లు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ తర్వాత బాల‌య్య బాబు మాస్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ కావ‌డంతో 1999లో ఇండ‌స్ట్రీని ఊర్రుత‌లూగించింది.. ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది.

ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా బీ.గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు.అయితే ఆరు కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ అనూహ్యంగా 16 కోట్లు రాబట్టింది. 122 కేంద్రాలలో 50 రోజులు, 32 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ మూవీ 29 కేంద్రాలలో 175 రోజులు, 3థియేటర్లలో 227 రోజులు ఆడింది. అయితే ఈ మూవీ కోసం ముందుగా రాశి, సంఘవి, అంజలా జవేరిలని హీరోయిన్లుగా అనుకున్నార‌ట‌. కాగా సిందూరపువ్వు తమిళ మూవీ మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి సమరసింహారెడ్డి సినిమా కథ విజయేంద్ర ప్రసాద్ రాసుకోగా, అయన దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహాతో రాయలసీమ ఫ్యాక్షన్ ని జత చేశార‌ట‌. అయితే ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి,

heroine missed Samarasimha Reddy movie because of that scene

heroine missed Samarasimha Reddy movie because of that scene

గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింద‌ట‌. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశార‌ట‌. దీంతో ఆ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నార‌ట‌. ఇక సినిమాలో ఆ సీన్ ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. అయితే సినిమాలో మొద‌ట అనుకున్న హీరోయిన్ నో చెప్ప‌డంతో మ‌రో హీరోయిన్ ని సెలెక్ట్ చేశార‌ట‌. అది ఎవ‌రంటే.. రాశి ఈ సినిమాలోని సీతాకోకచిలుక సన్నివేశానికి నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ సెలెక్ట్ చేశారట.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది