Home » Entertainment » Krishna Bhagavaan Satires On Hyper Aadi And Ram Prasad In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : దొంగ నా కొడుకులు.. ఆది, రాం ప్రసాద్ పరువుతీసిన కృష్ణ భగవాన్

Authored By
aruna
The Telugu News | Updated on: August 4, 2022 2:23 pm
Advertisement

Hyper Aadi : కమెడియన్ కృష్ణ భగవాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన విలన్‌గా చేసినా.. ఆ తరువాత తనలోని కామెడీ టైమింగ్‌తో ది బెస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు. అంతే కాకుండా ఆయనకు రచనల్లోనూ పట్టుంది. కథలు, మాటలు కూడా రాస్తుంటాడు. అలా ఎన్నో సినిమాలకు ఆయన పని చేశాడు. ఈ మధ్య తెరపై కనిపించడం కాస్త తగ్గించాడు. అయితే ఇప్పుడిప్పుడు మళ్లీ స్క్రీన్ మీదకు వస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ మీదకు కృష్ణ భగవాన్ రానున్నాడు. ఆ మధ్య బుల్లితెరపైనా సందడి చేశాడు. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ తిరిగాడు. ఇప్పుడు మళ్లీ శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి వచ్చాడు.

Advertisement

తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో కృష్ణ భగవాన్ ఒక్కొక్కరినీ తెగ ఆడేసుకున్నాడు. కౌంటర్లతో నోర్మూయించాడు. ఇక ఆది, రాం ప్రసాద్‌లనైతే దారుణంగా పరువుతీశాడు. ఈ ఆదివారం కొత్త థీంతో ముందుకు వచ్చింది శ్రీదేవీ డ్రామా కంపెనీ. అయితే ఇందులో కృష్ణ భగవాన్ మెయిన్ లీడ్ అయినట్టు కనిపిస్తోంది. కృష్ణ భగవాన్ ఎంట్రీతోనే అదరగొట్టేశాడు. లోపల ఏం చేస్తున్నావ్ రా? అని పని మనిషి అయిన భాస్కర్‌ను పిలుస్తాడు కృష్ణ భగవాన్. లోపల మీరు చేయలేని పనులన్నీ నేను చేస్తున్నాను అయ్యగారు అని అంటాడు భాస్కర్. అంటే అమ్మ గారితో.. అని కృష్ణ భగవాన్ ఆగిపోతాడు. అయ్యయ్యో అయ్యగారు..

Krishna Bhagavaan Satires on Hyper Aadi And ram Prasad In Sridevi Drama Company

Advertisement

అది కాదండి అని కంగారు పడతాడు భాస్కర్. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. ఇక ఆ తరువాత అసలు థీమ్ చెబుతాడు. చిన్న తనంలో నా కొడుకు, కూతురు తప్పి పోయారు.. వాళ్లు తిరిగి వస్తే నా ఆస్తి అంతా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ చెబుతాడు. దీంతో ఆ ఆస్తి కోసం అందరూ ముందుకు వస్తారు. నేను అంటే నేను అని కృష్ణ భగవాన్ వద్దకు వస్తారు. ఇదే క్రమంలో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా వాగ్వాదానికి దిగుతారు. తప్పి పోయింది నా కొడుకు.. దొంగ నా కొడుకులు కాదు అని కౌంటర్ వేస్తాడు. దీంతో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ నోర్మూసుకుని వెళ్తారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి