DJ Tillu 2 Movie : సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైన డిజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. అంతకుముందు పలు సినిమాలు చేసిన గాని ఈ సినిమాతో హీరో సిద్దు జొన్నలగడ్డ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఎటువంటి అంచనాలు ఆర్భాటాలు లేకుండా చాలా చిన్న సినిమాగా బాక్సాఫీస్ బరిలో దిగిన డీజే టిల్లు అతిపెద్ద విజయం సాధించింది. సిద్ధూ నటన సినిమాకి వన్ మాన్ షోగా నిలిచింది. హీరోయిన్ నేహా శెట్టి కూడా తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి ఈ సినిమాకి సీక్వెల్.. వస్తుండటం సంచలనం రేపింది. “డీజే టిల్లు 2” టైటిల్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ నాగ వంశీ ప్రకటించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే “డీజే టిల్లు 2” ప్రాజెక్ట్ కి ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. మేటర్ లోకి వెళ్తే డీజే టిల్లు మొదటి భాగంలో హీరోయిన్ నేహా శెట్టి పాత్ర.. సినిమాకి ఎంతో ప్రాధాన్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఆమె నటించడం లేదు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ముందుగానే ప్రకటించడం జరిగింది. దీంతో “డీజే టిల్లు 2” లో హీరోయిన్ ఎవరనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆ సమయంలో శ్రీ లీల పేరు వినిపించింది. కానీ కొన్ని అన్నివార్యాల కారణాలవల్ల ఆమె ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేయడం జరిగిందట. ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ సెలెక్ట్ అయినట్లు మీడియాలో వార్తలు వినిపించాయి.
అంతేకాదు త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనె ఏమైందో ఏమో తెలియదు గానీ అనుపమ కూడా “డీజే టిల్లు 2” ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగిందంట. కారణం చూస్తే సినిమాలో మితిమీరిన రొమాన్స్ సన్నివేశాలు హద్దులు దాటేటట్టు ఉండటంతో… స్క్రిప్ట్ మొత్తం విని హీరోయిన్ లు..దండం పెట్టేసి ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో అనుపమ తన సోషల్ మీడియాలో పరోక్షంగా “డీజే టిల్లు 2” గురించి పోస్ట్ పెట్టడం జరిగిందట. “ఒకచోట ఎగ్జిట్ అయితే మరొకచోట ఎంట్రీ ఉంటుంది” అంటూ కౌంటర్లు వేయడం జరిగిందట. ఇది పరోక్షంగా “డీజే టిల్లు 2” గురించి కామెంట్లు చేసినట్లు సోషల్ మీడియాలో నెటిజెన్ లు రియాక్ట్ అవుతున్నారు.
HMPV Virus : “భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కొత్తది కాదు,” అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి J.P.…
LPG Gas : కొత్త సంవత్సరంలోకి అడుగిన సందర్భంగా జనవరి 1, 2025 నుండి భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన…
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ సినిమా కు…
Cycling : ప్రస్తుత కాలంలో మానవాళి జీవితంలో ఒత్తిడితోను బిజీ అయిపోతున్నారు, అలాగే శారీరక శ్రమ ఏమాత్రం లేదు. కూర్చున్న…
Rohit Sharma : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న తర్వాత టీమిండియా తో పాటు కెప్టెన్ Rohit Sharma…
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు శ్రీ తేజను నటుడు అల్లు అర్జున్ మంగళవారం…
Sankranti Movies : ప్రతి శుక్రవారం థియేటర్ లో సినిమాలు.. OTTలో వెబ్ సీరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఐతే…
Gajakesari Yoga : జ్యోతిష్య శాస్త్రం Gajakesari Yoga ప్రకారం నవగ్రహాలు మనుషులు తమ జీవితంలో చేసిన కర్మ ఫలాలను,…
This website uses cookies.