Home » Entertainment » Heroine Rambha Car Accident
Entertainment

Heroine Rambha : బ్రేకింగ్.. యాక్సిడెంట్ కి గురైన హీరోయిన్ రంభ..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: November 1, 2022, 11:44 am
Advertisement

Heroine Rambha : హీరోయిన్ రంభ అందరికీ సుపరిచితురాలే. తెలుగులో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో హిట్లర్, బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా సినిమాలతో మంచి క్రేజీ సంపాదించి తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. దక్షిణాదితోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవటం జరిగింది. 2010లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయింది.

Advertisement

ఆ తర్వాత భర్తతో కలిసి విదేశాలలో రంభ జీవనం కొనసాగిస్తూ ఉంది. అయితే విదేశాల్లో ఉన్న రంభ యాక్సిడెంట్ కి గురికావడం జరిగింది. కెనడాలోని టొరెంటోలో పాఠశాల నుండి పిల్లలను తీసుకొస్తూ ఉండగా ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురుకు గాయాలయ్యాయి.

Heroine Rambha Car Accident

Advertisement

జరిగిన ఈ పెను ప్రమాదంలో రంబా క్షేమంగా ఉన్నాగాని ఆమె కూతురు సాషా తీవ్రంగా గాయపడటం జరిగింది. దీంతో కూతురు సాషాకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రంభ తాను ఘోర ప్రమాదం నుండి తప్పించుకోవడం జరిగిందని.. కూతురు త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్ధనలు చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి