
Rajinikanth shares his feeking about ticketless train journey
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. . కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నా, కోట్లాది మంది అభిమానించినా చాలా సింపుల్‌గా ఉండడం రజినీకాంత్ స్పెషాలిటీ. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం రజనీకాంత్‌ది. నటనలో ఆయనదో స్టైల్.. క్రేజ్‌లో ఆయనకు తిరుగేలేదు. స్టైల్‌కు ఆయనొక ఐకాన్. కానీ బయట మాత్రం చాలా హుందాగా, తానొక సామాన్యుడు మాదిరిగానే ఉంటాడు. అందరు ఆయనను ముద్దుగా తలైవా అని, సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. కండెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ నటుడిగా, మంచి మనిషిగాను ఇప్పుడు కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నారు. రజనీకాంత్ ఈ స్థాయికి చేరుకోవడం వెనక ఎంతో కష్టం ఉంది. తన జర్నీలో ప్రారంభ దశలో జరిగిన కొన్ని విషయాలను ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేదు,కానీ అభిమానులతో వేదికలపై పంచుకున్నాడు. ఒకసారి తాను మద్రాస్ ఎలా వచ్చింది. వచ్చే సమయంలో తనకు ఎదురైన సమస్య ఏంటి అనేది చెప్పుకొచ్చారు.
అప్పుడు చెన్నై సెంట్రల్‌లోని రైల్వే స్టేషన్ టిక్కెట్ కలెక్టర్‌ని, సాయంగా నిలబడ్డ రైల్వే కూలీల గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు. “నేను నటుడిని కావాలనుకున్నప్పుడు నా స్నేహితుడు నన్ను మద్రాసు వెళ్లడానికి టిక్కెట్ కొని రైలు ఎక్కించాడు. కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రైలు పొద్దున చెన్నైస్టేషన్‌కు చేరింది. బయటకు వస్తున్నాను. టిక్కెట్ కలెక్టర్ అందరి దగ్గర టిక్కెట్స్ చెక్ చేస్తున్నాడు. అందరి మాదిరిగా నన్ను కూడా అడిగాడు. అప్పుడు నా టిక్కెట్ చూసుకున్నాను. ఆ సమయంలో నాకు తెలిసింది ఏంటంటే.. ఎవడో నా పర్సు కొట్టేశాడని, అందులో రైలు టిక్కెట్ కూడా ఉంది. టిక్కెట్ కలెక్టర్‌కు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆయన పక్కనే సైలెంట్‌గా నిలుచున్నాను. ప్రయాణీలకుందరి టిక్కెట్స్ చెక్ చేసిన తర్వాత.. అందరూ వెళ్లిపోయాక ఆయన నా వైపు చూశారు. అప్పుడు నేను మాట్లాడుతూ.. ‘సార్..నేను నిజంగానే టిక్కెట్ కొన్నాను. కానీ ఎవరో నా పర్సు కొట్టేశారు.. నన్నను నమ్మండి సార్’ అని టిక్కెట్ కలెక్టర్‌తో చెప్పారు. ముందు ఆయన నా మాట వినకుండా జరిమానా కట్టాలి అన్నాడు, లేదంటే జైలుకెళ్లాల్సిందేనని అని హెచ్చరించారు.
Rajinikanth shares his feeking about ticketless train journey
ఏం చేయాలో తెలియక ఆయన్ని బతిమాలాడసాగాను. అక్కడే ఉన్న రైల్వే కూలీలు కొందరు నా పరిస్థితి చూశారు. వారికి జాలి కలిగి నా దగ్గరకు వచ్చి… ‘సార్.. ఆ పిల్లాడు చెప్పేది వింటుంటే అబద్దం చెప్పలేదనిపిస్తుందండి’ అని కూలీలు అన్నారు. కానీ టిక్కెట్ కలెక్టర్ వినలేదు. చివరకు వాళ్లు ఏమనుకున్నారో ఏమో కానీ.. ‘ సార్.. పోనివ్వండి.. ఫైన్ ఎంతయ్యిందో చెప్పండి. ఆ పిల్లాడి బదులుగా మేమే కట్టేస్టాం అని చెప్పారు. ఆ మాటలు వినగానే ఆ టిక్కెట్ కలెక్టర్ ఏమనుకున్నారో ఏమో కానీ ‘సరే! నేను నిన్ను నమ్ముతున్నాను.. వెళ్లుస అని అన్నారు. అప్పుడు ఆయనకు, రైల్వే కూలీలకు దణ్ణం పెట్టి ముందుకు కదిలాను. వాళ్లు నన్ను చూస్తున్నారు. నేను అడుగులు వేస్తూ బయటకు వచ్చాను. నేను ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేను. అలా తమిళ ప్రజలు నన్ను ఆరోజునే నమ్మారు. వారి ప్రేమ, ఆప్యాయతను నాపై చూపించారు. అందుకే నేనీస్థాయిలో ఉన్నాను” అంటూ తన జీవితంలో జరిగిన సంఘటనను ఓ సందర్భంలో రజనీకాంత్ పంచుకున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.