Heroine Raasi : అప్పటి హీరోయిన్ రాశి లవ్ స్టోరీ మీకు తెలుసా ? సరిగ్గా 15 రోజుల్లో కానిచ్చేసింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine Raasi : అప్పటి హీరోయిన్ రాశి లవ్ స్టోరీ మీకు తెలుసా ? సరిగ్గా 15 రోజుల్లో కానిచ్చేసింది !

 Authored By prabhas | The Telugu News | Updated on :26 February 2023,1:05 pm

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్లలో ఒకరు రాశి. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన రాశి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. శ్రీకాంత్ నటించిన ‘ ప్రేయసి రావే ‘ సినిమాతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు నిజం సినిమాలో విలన్ అవతారం ఎత్తి తనేంటో నిరూపించుకున్నారు. అయితే రాశి ఎవరికి తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Rashi Khanna love story

Heroine Rashi love story

కేవలం 15 రోజుల్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడింది. రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు ‘ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకు రాశి భర్త శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ రోజు సాంగ్ షూట్ చేస్తుండగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసన్ కేవలం రాశిని చూడాలన్న కుతుహాలంతో ఆమె దగ్గరికి వెళ్లి సీన్ వివరిస్తున్నాడట. దీంతో పక్కనే ఉన్న డైరెక్టర్ ఇప్పుడు సాంగ్ షూట్ చేస్తుంటే నువ్వు డైలాగు ఎందుకు చెప్తున్నావ్ అని ప్రశ్నించాడట.

ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్, రాశి, గుర్లిన్ చోప్రా నటిస్తున్నారు. ఆరోజు రాశి బ్లూ శారీలో ఉందని శ్రీనివాసన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ టైంలో శ్రీనివాసన్ రాశిని నమస్తే మేడం అని వినయంగా పలకరించేవాడట. రాశికి కూడా ఆయన పట్ల మంచి అభిప్రాయం ఏర్పడడం, ప్రతిరోజు తనకు డైలాగ్ సీన్లు వివరిస్తున్నప్పుడు అతడిపై ప్రేమ పెంచుకొని కేవలం 15 రోజుల్లోనే ప్రేమిస్తున్నానని ఆమె స్వయంగా చెప్పేసే వరకు వెళ్లిందట. 15 రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కాను అంత త్వరగా ప్రేమలో పడినప్పటికీ మా బంధం ఎంతో గొప్పది అని రాశి ఎప్పుడు చెబుతూ ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది