Heroines Injuries at Sets
Heroines : ఈ మధ్య కాలంలో నటీనటులు తరచు గాయాల బారిన పడుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. విశాల్ లాంటి వారు అయితే తరచు గాయపడుతున్నారు. ఇక హీరోలే కాదు హీరోయిన్స్ సైతం యాక్షన్ సీన్స్‌లో ప్రమాదాల బారిన పడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి షూటింగ్ లో గాయపడింది. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ లో శిల్పాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఓబెరాయ్, ఇషా తన్వర్ తదితరులు నటిస్తున్నారు. అయితే, షూటింగ్ లో శిల్పా శెట్టి కాలు విరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తనే స్వయంగా వెల్లడించింది. ఆసుపత్రిలో వీల్ చెయిర్ లో కూర్చుని ఉన్న ఫొటోను కూడా శిల్పా షేర్ చేసింది.
“వాళ్లు రోల్, కెమెరా, యాక్షన్ అన్నారు… అంతే… నా కాలు విరిగిపోయింది. తప్పదు, బాధ వచ్చినప్పుడు బాధపడాల్సిందే. గాయం కారణంగా 6 వారాల పాటు షూటింగ్ కు దూరం కావాల్సి వస్తోంది. అయితే మరింతగా పుంజుకుని తిరిగి వస్తాను. నాకోసం మీరు ప్రార్థిస్తారు కదూ! ప్రార్థనలు ఎప్పుడూ ఫలిస్తాయి” అంటూ శిల్పాశెట్టి ఇన్ స్టాగ్రామ్ లో వివరించింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కుతున్న భోలా మూవీ సెట్‌లో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న టైమ్‌లో ప్రమాదం జరగడంతో నటి టబు కు తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది.
Heroines Injuries at Sets
ట్రక్కు అద్దాలు పగిలి.. ట్రక్కు లోపల టబుకు గుచ్చుకుంది. దీంతో ఆమె కుడి కన్నుపై గాయమైనట్లు సమాచారం. దీంతో వెంటనే ఆమెకు సెట్స్‌లో ఉన్న డాక్టర్‌తో ట్రీట్మెంట్ చేయించారు. అయితే ఆ గాయానికి ఎలాంటి కుట్లు అవసరం లేదని వైద్యులు చెప్పారు. అదృష్టం బాగుంది కాబట్టి కంటికి ఎక్కడా కుచ్చుకోలేదు. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు టబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కూలీ నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హీరోయిన్.. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు తదితర సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించింది.
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
This website uses cookies.