Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఇప్పటి బిగ్ బాస్ కి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఇంట్లో అందరు కలిసి చూడదగిన షోగా మనముందుకు వచ్చిన బిగ్ బాస్ రియాల్టీ షో ప్రస్తుతం బూతుల షోగా మారిపోయింది. హౌస్ లో కంటెస్టెంట్లు రెచ్చిపోతున్నారు. బండబూతులతో తిట్టుకుంటూ పచ్చిగా మాట్లాడుతున్నారు. డబుల్ మీనింగ్ మాటలతో ఫ్యామిలీతో కలిసి చూడాలంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది ఈ షో. హగ్ లు కిస్ లతో రోత పుట్టిస్తున్నారు. హౌస్ లో ఎంజాయ్ చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు.బిగ్ బాస్ సీజన్ 5 లో శన్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంతు చేష్టలతో షో నుంచి బయటకు వచ్చాకా ఇరువురి లవర్స్ బ్రేకప్ చెప్పేసారు.
ఇది పరిపోదన్నట్టు 24 నాన్ స్టాప్ పేరుతో ఇక ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు అనేలా షోని ప్రసారం చేస్తున్నారు. ఎన్నో సంఘాలు సంస్థలు వ్యతిరేకించినప్పటికీ బిగ్ బాస్ బూతుల షోను ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో నిర్వాహకులకు దిమ్మతిరిగింది.ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా బండబూతులతో, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ వంటి చెత్త షోలు యువతను ప్పుదోవపట్టిస్తున్నాయని, ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా శుక్రవారం జగదీశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అత్యవసర విచారణ జరపాలని కోరారు.హైకోర్టు స్పందిస్తూ మంచి వ్యాజ్యం దాఖలు చేశారు. బిగ్‌బాస్ లాంటి చెత్త షోల వల్ల ఎంతో మంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అసభ్యత, అశ్లీలతను పెంచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై వచ్చేనెల 2న విచారణ జరుపుతామని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బిగ్ బాస్ షో ప్రసారం పై సోమవారం ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
This website uses cookies.