Jr NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. దీంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికీ విదేశాల్లో ఉన్న అభిమానులు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు జపాన్, చైనా లాంటి దేశంలో వివరీతమైన క్రేజ్ ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న లక్షలాదిమంది తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ ను బాగా ఆరాధిస్తూ ఉంటారు.
వీటన్నింటికీ మించి ఎన్టీఆర్ కు హాలీవుడ్లో కూడా రేంజ్ పెరుగుతుంది. పలువురు హాలీవుడ్ ఫిలిం మేకర్సత ఎన్నోసార్లు ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జేమ్స్ గన్ గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. హాలీవుడ్లో జేమ్స్ గన్ కు డైరెక్టర్ గా మంచి పాపులారిటీ ఉంది.
అయితే ఆయన ఇప్పుడు ఇండియా నుంచి గార్డియన్స్ యూనివర్స్ గా ఎవరినైనా పరిచయం చేస్తారా అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ అని చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అడవి మృగాలతో జంప్ చేసిన హీరో అతడు అంటూ ప్రశంసించాడు. దీంతో అసలైన గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అని ప్రూవ్ అయిపోయింది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు గ్లోబల్ స్టార్లుగా మారారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.