Star Heroes : కోలివుడ్‌లో స్టార్ హీరోలుగా అవతరించిన ఈ క్యూట్ చిల్డ్రన్స్.. వీరిప్పుడు ఎలా ఉన్నారంటే?

Authored By mallesh | The Telugu News | Published on: September 9, 2022, 12:00 pm

Star Heroes : స్టార్ హీరోలకు సంబంధించిన చిన్నప్పటి పిక్స్ ఒక్కోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.అందులోని నటుడు ఎవరో గుర్తించలేక ఫ్యాన్స్ తికమక పడుతుంటారు. తీరా తమ అభిమాన నటుడు అని తెలుసుకుని ఫుల్ ఖుషీ అవుతుంటారు. తాజాగా తమిళ నాట సూపర్ హీరోస్‌గా గుర్తింపు పొందిన సోదరుల చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ వాటిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Star Heroes : ప్రియమైన అన్నకు తమ్ముడి విషెస్..

ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ వీరిద్దరూ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. వీరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మాములుగా ఉండదు. మోత మోగిపోవాల్సిందే.అయితే, వీరిద్దరూ తెలుగు హీరోలు కాకపోయినా చాలా చక్కగా తెలుగు మాట్లాడగలరు.వీరి తెలుగు అభిమానుల ఫాలోయింగ్ కూడా బానే ఉంది. ఈ బ్రదర్స్ మరెవరో కాదు. తమిళ స్టార్స్ సూర్య, కార్తీ. దక్షిణాది సినీ పరిశ్రమలోనే వీరి రేంజ్ ఇప్పుడు వేరేలా ఉంది.అన్నదమ్ములు ఇద్దరు విడివిడిగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేశారు. వీరికి వేర్వేరుగా ఫ్యాన్ బేస్ చాలా గట్టిగానే ఉంది.

how are these cute children who became star heroes in kollywood

how are these cute children who became star heroes in kollywood

అయితే, సూర్య ఇండస్ట్రీలో అడుగు పెట్టి సెప్టెంబర్ 6వ తేదితో ఏకంగా 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ) కంప్లీట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడు కార్తీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నా అన్నయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తన కష్టంతో అపజయాలకు కుంగి పోకుండా విజయాల బాటలో నడిచాడు. నటన అంటే ప్రాణం ఇచ్చే తన అన్నయ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ కార్తీ విష్ చేశాడు. నటుడిగానే కాకుండా ఎంతో మంది పిల్లల జీవితాలను తీర్చదిద్దిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడాడు. ప్రస్తుతం కార్తీ చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

how are these cute children who became star heroes in kollywood

how are these cute children who became star heroes in kollywood

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp