BalaKrishna : బాల‌కృష్ణపై మీమ్స్.. ఆయ‌న ఫీల‌వుతాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BalaKrishna : బాల‌కృష్ణపై మీమ్స్.. ఆయ‌న ఫీల‌వుతాడో తెలుసా?

BalaKrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఎంత ఓపెన్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షోతో అద‌ర‌గొట్టాడు. గెస్ట్‌లుగా వ‌చ్చిన సెల‌బ్స్‌తో ఆయ‌న చేసిన సంద‌డి ఓ రేంజ్‌లో ఉంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో బాలయ్య హోస్టింగ్ చూసిన తర్వాత మరే ఇతర టాలీవుడ్ హీరోలు కూడా ఇంత ఎంటర్‌టైనింగ్‌గా హోస్టింగ్ చేయలేరేమో అనిపించింది ప్రేక్షకులకు. అందుకేనేమో అన్‌స్టాపబుల్ షో ఖాతాలో రికార్డుల మీద రికార్డులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఐఎమ్‌డీబీ రేటింగ్స్ విషయంలో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 February 2022,2:00 pm

BalaKrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఎంత ఓపెన్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షోతో అద‌ర‌గొట్టాడు. గెస్ట్‌లుగా వ‌చ్చిన సెల‌బ్స్‌తో ఆయ‌న చేసిన సంద‌డి ఓ రేంజ్‌లో ఉంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో బాలయ్య హోస్టింగ్ చూసిన తర్వాత మరే ఇతర టాలీవుడ్ హీరోలు కూడా ఇంత ఎంటర్‌టైనింగ్‌గా హోస్టింగ్ చేయలేరేమో అనిపించింది ప్రేక్షకులకు. అందుకేనేమో అన్‌స్టాపబుల్ షో ఖాతాలో రికార్డుల మీద రికార్డులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఐఎమ్‌డీబీ రేటింగ్స్ విషయంలో ఇండియాలోనే టాప్‌లో ఉంది అన్‌స్టాపబుల్. మ‌రోవైపు అన్‌స్టాపబుల్ షో 40 కోట్ల నిమిషాలు స్ట్రీమ్ అయినట్లు ఆహా తెలిపింది. హీరోగానే కాదు..

హోస్ట్‌గా కూడా రికార్డులను తిరగరాయగలడు అని ప్రూవ్ చేసుకున్నారు.రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ తొలి సీజ‌న్ పూర్తైంది. త్వరలోనే సెకండ్‌ సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూలై నుంచి సెకండ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆహా బాలకృష్ణను రాపిడ్‌ ఫైర్‌లా అడిగిన కొన్ని ప్రశ్నలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.‘నెవర్‌ హావ్‌ ఐ నెవర్‌’ (నేను ఎప్పుడు చేయనిది) షోలో భాగంగా ‘మీపై వచ్చే మీమ్స్‌ గురించి ఎప్పుడైనా నవ్వుకున్నారా.?’

how BalaKrishna feels with memes

how BalaKrishna feels with memes

BalaKrishna : బాలయ్య హంగామా..

అన్న ప్రశ్నకు ‘నవ్వుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. కరోనా వచ్చిన సమయంలో లెజెండ్‌ సినిమాలోని డైలాగ్‌తో చేసిన మీమ్స్‌ చూసినప్పుడు నవ్వుకున్నాను అని తెలిపారు. ఇక ఎప్పుడైనా కాలేజికి బంక్‌ కొట్టారా అన్న ప్రశ్నకు ‘బంక్‌ కొట్టని వారు ఎవరు ఉంటారు చెప్పండి’ అంటూ బదులిచ్చారు. ఇలా పలు సరదా ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. మరి బాలయ్య బాబు చెప్పిన ఇంకొన్ని ఫన్నీ విశేషాలు చూసి ఎంజాయ్ చేయండి. బాల‌య్య త్వ‌ర‌లో గోపిచంద్ మలినేని ద‌ర్శక‌త్వంలో సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది