Actress Priya : సీరియల్ యాక్టర్ ప్రియ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందంటే?
Actress Priya : ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకునేందుకు వచ్చిన యాక్టర్స్‌లో కొందరు తమ కలను నేరవేర్చుకుంటే మరికొందరు అవకాశాల వెనుక పరిగెడుతూనే ఉంటారు.తీరా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పుణ్యకాలం గడిచిపోతుంది. వయస్సు మీదపడటంతో చేసేది ఏమీ లేక కొందరు బుల్లితెర వైపు అడుగులు వేస్తుంటారు. రాని అవకాశం వెనుక పరిగెత్తేది బదులు వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారిలో సీరియల్ నటి ప్రియ ఒకరు.
Actress Priya : సినిమా కంటే సీరియల్ బెటర్ అనుకుని..
సీరియల్ నటి మామిళ్ల శైలజా ప్రియ అంటే తెలియని వారుండరు.ఈమె కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా చాలా సినిమాలు చేసింది. ఒకప్పుడు సీరియల్స్‌లో స్టార్ యాక్టర్‌గా ఎదిగి బుల్లితెర క్వీన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అయితే, నిజానికి ప్రియ సినిమాల్లో నటించాలని అనుకున్నదట. చదువుకునే రోజుల్లోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించగా.. చివరకు సీరియల్‌లో నటించే అవకాశం వచ్చిందట..
ప్రియ సొంతూరు ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల.. ప్రస్తుతం ఆమె వయస్సు 42ఏళ్లు.20 మే 1978లో జన్మించిన ప్రియా చిన్నతనం నుంచే చాలా అందంగా ఉండేది. ఆమె తండ్రి మామిళ్ళ వెంకటేశ్వరరావు, అమ్మ మామిళ్ల కుసుమ కుమారి ఆమె చిన్నప్పుడే హైదరాబాద్‌కు వలస వచ్చారు.దీంతో ప్రియ చదువు మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది.అనంతరం సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా చివరకు ‘ప్రియసఖి’ అనే సీరియల్ అవకాశం రావడంతో నటించింది.
అది మంచి విజయం సాధించడంతో ప్రియకు అదృష్టం వరించింది. సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, మిసెస్ శారద, జ్వాల వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సీరియల్స్‌లో చేస్తూనే సినిమాలు కూడా చేసేది. ఇప్పటివరకు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అన్నయ్య, జయం మనదేరా,ఢమరుకం, కత్తి కాంతారావు, మిర్చి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో నటించింది. 2002లో ఎంవీఎస్ కిషోర్‌ను శైలజా ప్రియా పెళ్లి చేసుకుంది. వీరికి నిశ్చయ్ అనే బాబు కూడా ఉన్నాడు.నేటికి కూడా ప్రియ అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేస్తూ బిజీబిజీగా జీవితాన్ని గడుపుతోంది.