Home » Entertainment » Hyper Aadi Counters On Dhee Poorna
Entertainment

Hyper Aadi : పూర్ణ పరువుపాయే.. ఢీ షోలోని చేష్టలపై హైపర్ ఆది కౌంటర్లు!!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 20, 2021, 7:26 pm
Advertisement

Hyper Aadi ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ఢీ షోలో ఇప్పుడు డ్యాన్సులు తప్పా మిగతా వన్నీ కూడా ఉంటాయి. ఇక పూర్ణ, ప్రియమణి చేసే ఎక్స్ ట్రాలు, వారి జడ్జ్ మెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక పూర్ణ పెట్టే ముద్దులు, ఇచ్చే హగ్గులు, చేసే ప్రపోజల్స్ అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా పూర్ణ, ప్రియమణిల మీద ట్రోల్స్ జరుగుతుంటాయి. తాజాగా ఆది కూడా వారిని ఆడుకుంటూ ఓ స్కిట్ వేశాడు.

Advertisement

Hyper Aadi Counters On Dhee Poorna

Hyper Aadi పూర్ణ పరువుపాయే.. ఢీ షోలోని చేష్టలపై హైపర్ ఆది కౌంటర్లు

హైపర్ ఆది నిన్నటి జబర్దస్త్ షోలో వేసిన స్కిట్‌లో అందరినీ ఆడుకున్నాడు. రోజా, అనసూయ, మనో, పూర్ణ, ప్రియమణి, సుధీర్, రష్మీ, దీపిక పిల్లి ఇలా అందరి మీదా కౌంటర్లు వేశాడు. ఇక ఆది తన మీద తాను కూడా ఓ కౌంటర్ వేసుకున్నాడు. అయితే ఈ అందరిలోకెల్లా పూర్ణను మాత్రం దారుణంగా ఆడుకున్నాడు.

Advertisement

 

Hyper Aadi Counters On Dhee Poorna

Advertisement

ఆమె పరువు తీసేశాడు. ఢీ సెట్‌లో ఆమె ఎలా ఉంటుందో.. జడ్జ్ మెంట్ ఎలా ఇస్తుందో చెబుతూ కౌంటర్లు వేశాడు. పూర్ణకు అంతగా తెలుగు రాదన్న సంగతి తెలిసిందే.అదే విషయాన్ని సెటైరికల్‌గా చెప్పేశాడు. పూర్ణ క్యారెక్టర్ వేసినట్టుగా ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. పిట్లా కాయ కూర తీసుకురండి అని పూర్ణ అన్నట్టుగా.. అది పిట్ల కాయ కాదు..పొట్ల కాయ అని ఆది చెబుతుంటాడు. ఇక ఫుడ్ ఎక్కడ తింటారు అని పూర్ణను అడగడం.. నా సీట్ పక్కన పెట్టేయండి.. పర్ఫామెన్స్ చూస్తు తింటాను అన్నట్టుగా చూపించాడు.

Hyper Aadi Counters On Dhee Poorna

అంటే పూర్ణ నిజంగానే సెట్‌లోనే అలానే చేస్తుందని చెప్పకనే చెప్పేశాడు. జిత్తు మాస్టర్ నువ్వు తుప్పు.. అని పూర్ణ అన్నట్టుగా.. అది తుప్పు కాదు తోపు అని ఆది సరి చేయడం ఇలా పలు రకాలుగా పూర్ణను ఇమిటేట్ చేసి పరువుతీసేశాడు ఆది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి