Hyper Aadi : అనసూయ మీద కౌంటర్.. శరీరాకృతి మీద హైపర్ ఆది కామెంట్.. వైరల్ వీడియో!
Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ షోలో వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కువగా కంటెస్టెంట్ల మీద, జబర్దస్త్ జడ్జ్‌ల మీద, యాంకర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా అనసూయను ఎక్కువగా కౌంటర్లతో ఆడేసుకుంటాడు. ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక ఆది తన ప్రతీ స్కిట్టులో అనసూయను ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా జబర్దస్త్ షో ప్రోమోను వదిలారు.

Hyper Aadi Satires On Anasuya Height
వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమోలో ఆది వేసిన స్కిట్ బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. రెట్రో కాన్సెప్ట్‌లతో ఆది వచ్చినట్టున్నారు. ఆదితో పాటు మనో కూడా ఈ స్కిట్లో ఎంట్రీ ఇచ్చారు. 80వ దశకంలోని గెటప్‌లతో స్కిట్లో దుమ్ములేపేశారు. ఇందులోనే ఆది అనసూయ హైట్ మీద కామెంట్ చేశారు. అందరూ కాలేజ్‌కి వెళ్లే కుర్రాళ్లగా వచ్చారు. కాలేజ్‌లోని అమ్మాయిలను ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తూ వచ్చే గ్యాంగ్‌లా స్కిట్ వేశారు.
Hyper Aadi : అనసూయ మీద కౌంటర్.. శరీరాకృతి మీద హైపర్ ఆది కామెంట్
కాలేజ్‌కు వచ్చిన అమ్మాయిగా అనసూయ ఎంట్రీ ఇవ్వడంతో ఆది ఓ ప్రశ్న వేశాడు. లైఫ్‌లో మీ గోల్ ఏంటి? అని అడిగేశాడు. బాగా చదివి ఇంకా ఎత్తుకు ఎదగాలి అని అన్నాడు. ఇంకా ఎత్తు ఎదిగి ఏం చేస్తావ్.. కాలేజ్ గోడలకు పెయింట్ వేస్తావా? అంటూ అనసూయ పరువుదీసేశాడు ఆది. అదే సమయంలో అనసూయ హైట్‌ను ఎడిటర్లు అమాంతం పెంచేశారు ప్రోమోలో. మొత్తానికి అనసూయ Anasuya హైట్, వెయిట్, అందం గురించి ఆది సందు దొరికినప్పుడల్లా కామెంట్లు చేస్తూనే ఉంటారు.
