Hyper Aadi : జనసేన కోసం హైపర్ ఆది ఎంత విరాళం ఇచ్చాడో తెలిస్తే అవాక్కవుతారు..!!
Hyper Aadi : ఒకప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం లేక చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న హైపర్ ఆది ఇప్పుడు తెలుగు బుల్లి తెరపై ఒక స్టార్ అనే విషయం తెలిసిందే. ఆయన రెమ్యూనరేషన్ భారీగా ఉంది. అంతే కాకుండా ఆయన స్టేజ్ షోలు చేస్తే లక్షల్లో పారితోషికాలు ఇచ్చేందుకు కార్యక్రమం నిర్వహకులు సిద్ధంగా ఉంటారు. ఆ మధ్య జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయినా కూడా ఇంకా పలు కార్యక్రమాల్లో హైపర్ ఆది సందడి చేస్తూనే ఉన్నాడు.
Hyper Aadi give a huge donation for Janasena
మరో వైపు వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక్క రోజుకు గాను హైపర్ ఆది ఏకంగా మూడు నుండి ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. లక్షల్లో సంపాదిస్తున్న హైపర్ ఆది ఇటీవల జనసేన పార్టీ కోసం భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఎంత విరాళం ఇచ్చాడు అనేది అధికారికంగా ప్రకటన రాలేదు కానీ కచ్చితంగా హైపర్ ఆది భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడు
Hyper Aadi give a huge donation for Janasena
అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే సీట్ కోసం ముందస్తుగానే ఇలా భారీగా పార్టీకి విరాళం ఇచ్చాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై క్లారిటీ రావడానికి మరి కొన్నాళ్లు పడుతుంది. ఆ మధ్య జనసేన పార్టీ మీటింగ్ లో హైపర్ ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
