Janasena : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటో చెప్పేసిన నేషనల్ మీడియా సర్వే.. వణికిపోతున్న ఇతర పార్టీలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janasena : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటో చెప్పేసిన నేషనల్ మీడియా సర్వే.. వణికిపోతున్న ఇతర పార్టీలు

 Authored By kranthi | The Telugu News | Updated on :11 November 2022,11:00 am

Janasena : 2014 లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. అప్పుడు చాలామంది ఈయన పార్టీ ఎందుకు పెట్టారు అంటూ విమర్శించారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు కానీ.. టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసింది. కానీ.. ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది. దీంతో ఇక జనసేన పని అయిపోయినట్టే అని అందరూ అన్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వేయలేదు. తన టార్గెట్ ను 2024 కు సెట్ చేసుకున్నారు. కానీ.. చాలామంది విమర్శకులు అసలు జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా రాదంటూ ఎద్దేవా చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు.. పార్టీ గెలవాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది.

గతంతో పోల్చితే ఇప్పుడు చాలా ఆదరణ లభించడమే కాదు.. పార్టీకి ఓటు బ్యాంకు కూడా పెరిగిందట. రోజురోజుకూ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందట. టీడీపీ పార్టీ కంటే కూడా జనసేనకు ఆదరణ లభిస్తుండటంతో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ చక్రం తిప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతే కాదు.. వైసీపీ ప్రభుత్వానికి ఎదురు వెళ్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చురగొంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క సీటే గెలుచుకున్నా మొత్తంగా చూసుకుంటే 23 లక్షల ఓట్లు పోలయ్యాయి. 7 శాతం ఓటు బ్యాంకు లభించింది. అయినా కూడా ఏమాత్రం చింతించకుండా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లారు. ఇప్పుడు తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకున్నారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కొన్ని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. జాతీయ మీడియా సంస్థల సర్వేలో ఏం తెలిసిందంటే..

janasena party vote bank increased in ap as per survey

janasena party vote bank increased in ap as per survey

Janasena : జాతీయ మీడియా సర్వేలో జనసేన పార్టీ గురించి సంచలన నిజాలు బయటికి

గత మూడు సంవత్సరాలలో జనసేనకు ఓటు బ్యాంకు భారీగా పెరిగిందట. ప్రస్తుతం పార్టీకి 13 శాతం ఓటు బ్యాంకు ఉందట. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన బస్సు యాత్రను ప్రారంభించాల్సి ఉంది. కానీ.. కొన్ని కారణాల వల్ల బస్సు యాత్రను ప్రారంభించలేదు. ఒకవేళ బస్సు యాత్రను స్టార్ట్ చేసి ఉంటే 13 శాతం నుంచి 20 శాతానికి ఓటు బ్యాంకు పెరిగి ఉండేదంటూ సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ పార్టీలోకి ముఖ్యమైన నేతలు వస్తే ఓటు బ్యాంకు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ వైపు తిరగడం కాదు.. ఏపీలోనే బలమైన ప్రాంతీయ పార్టీగా జనసేన ఎదిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరి.. జనసేన పార్టీ.. ఏ పార్టీకి ముప్పు కానుంది.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత మేరకు ఉండనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది