Hyper Aadi : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి అందరికీీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు , జనసేన టీడీపీ బీజేపీ అభిమానులు భారీ ఎత్తున విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల ఏలియన్స్ ఎలక్ట్రోరల్ విక్టరీ పేరుతో భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు పలువురు సినీ ప్రముఖులతో పాటు చాలామంది ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా విచ్చేసి సభ ముఖంగా తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై పంచులు కురిపించారు.
అయితే ఈవెంట్లో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ…నా పేరు హైపర్ ఆది నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక ఈ మాటను ఎన్ని సంవత్సరాలు అయినా సరే నేను చెప్పుకుంటానంటూ ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారాలలో చాలా కష్టపడ్డామని కష్టానికి తగిన ఫలితం దక్కిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అనే సినిమా దాదాపు 140 రోజులు ఆడిందని అందుకే ఇప్పుడు మనం ఈ సక్సెస్ మీటింగ్ జరుపుకుంటున్నామని హైపర్ ఆది తెలియజేశారు. ఈ సక్సెస్ మీటింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 10 సంవత్సరాలపాటుు ఎంతో కష్టపడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ అరుదైన గౌరవం దక్కిందని తెలిపారు. ఒకప్పుడు ఎక్కడ జనసేన సభలు నిర్వహించిన కింద అభిమానులు సీఎం అని అరుస్తుంటే చాలామంది ముందు మీ వాడిని ఎమ్మెల్యే గా గెలవమని ఎగతాళి చేసేవారని , అలాంటివాడే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలలో నిలబడి 21 సీట్లు గెలిచాడని , రెండు ఎంపీ స్థానాలలో నిలబడి వాటిని కూడా గెలిచాడని అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గాబాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారని తెలియజేశాడు.
ఆరోజు ఎవడైతే అతనిని తక్కువ చేసి చూసాడు దానికి సమాధానం ఇంతకంటే గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదని మొరిగే కుక్కలు అన్నీ కూడా ఇప్పుడు తోక ముడుచుకున్నాయంటూ ఆది తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు పుస్తకాలలో రాజుల గురించి వారి పరిపాలన గురించి ,చదివేవాళ్ళం , ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని , పవన్ కళ్యాణ్ గారిది అలాంటి చరిత్ర అంటూ తెలిపారు. ఎన్నో ఆటంకాలను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఇక్కడ వరకు వచ్చిన ఆయనకు మేమెప్పుడూ అండగా నిలబడతామంటూ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల తో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.