Samantha: ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు.. సమంత కామెంట్స్ వైరల్

Authored By vamana sai | The Telugu News | Updated on : 21 September 2021, 8:50 am

Samantha: కొన్ని సందర్భాలలో ఊహించనివి జరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి పరిణామాలు ఈ మధ్య సమంత విషయంలో జరుగుతూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలకి తావిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తరచూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ స్పందించడం లేదు. అలా అని ఇద్దరు కలిసి కనిపించడం లేదు. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ లాంటి వారు వచ్చారు. కానీ సమంత రాలేదు. దాంతో అందరూ రక రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

I didnot expect this would happen says samantha

I didnot expect this would happen says samantha

ఇటీవల తిరుపతి, శ్రీ కాళహస్తీ దేవాలయాలను సందర్శించినప్పుడు కూడా సమంత సింగిల్‌గానే కనిపించింది. చైతూ గురించి అడిగి..రూమర్స్ వస్తున్నాయి మేడం అంటే రిపోర్టర్స్ మీద గుడికి వచ్చి..బుద్దుందా అంటూ ఫైర్ అవడం కూడా వైరల్‌గా మారింది. అయితే సమంత ఎందుకిలా ఫైర్ అయిందనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏదేమైనా సమంత – నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ మాత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ కూడా. ఈ నేపథ్యంలో సమంత ఎవరిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పొట్టినా ముందు చైతన్యను ఉద్దేశించి పెట్టిందని మాట్లాడుకుంటున్నారు.

 

I didnot expect this would happen says samantha

I didnot expect this would happen says samantha

Samantha: ఈ అవార్డ్ సమంత బదులు నాని తీసుకున్నాడు.

తాజాగా సమంత చేసిన మరో పోస్ట్ కూడా ఇలానే అనుకుంటూ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్‌కి దాదాపు సౌత్ ఇండస్ట్రీలోని సినీ తారలంతా హాజరయ్యారు. కానీ సమంత మాత్రం కనిపించలేదు. చక్కగా చెన్నైలో ఉంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోంది. కాగా ఆమె నటించిన ‘ఓ బేబీ’ సినిమాకు గానూ సమంతకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఈ అవార్డ్ సమంత బదులు నాని తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఓ పోస్ట్ ద్వారా తెలిపింది సమంత. ‘థ్యాంక్యూ నాని.. నా బదులు ఈ అవార్డును తీసుకున్నావ్.. కానీ ఉత్తమ నటి అవార్డును నువ్ తీసుకుంటావ్ అని.. ఎప్పుడైనా ఇలా జరుగుతుందని నువ్ ఆలోచించావా?’ అని స్మైల్‌తో కూడిన ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

 

 

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp