Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి రీసెంట్‌గా తన 67వ బర్త్ డే జరుపుకున్నాడు. ఆయనకు చాలా మంది ప్రముఖులు విషెస్ తెలియజేశారు. మంచు ఫ్యామిలీలో కేవలం మంచు లక్ష్మీ విషెస్ చెప్పింది. నందమూరి ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా విషెస్ చెప్పలేదు. అయితే టాలీవుడ్ దర్శక నిర్మాతలు, యంగ్ హీరోలు, హీరోయిన్లంతా కూడా చిరుకు విషెస్ చెప్పారు. చిరు బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లు, గాడ్ ఫాదర్ టీజర్ ఇలా అన్నీ కూడా మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాయి. ఇక మెగా అభిమానులు నెక్ట్స్ పవన్ కళ్యాణ్ బర్త్ డే మీద దృష్టి పెట్టేసినట్టున్నారు.
అయితే చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు సైతం చేసిన సంగతి తెలిసిందే. విలన్ గా మెప్పించిన చిరు ఆ తరవాత హీరో పాత్రలు అందుకున్నారు. హీరోగా తన డ్యాన్స్ నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. వరుస విజయాలను అందుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. ఇదిలా ఉండగా చిరు హీరోగా ఎదుగుతున్న తీరు ఆయన క్రమ శిక్షణ చూసి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం చేశారు. కానీ చిరు ఓ తప్పు చేసుంటే అసలు అల్లు వారి ఫ్యామిలీకి అల్లుడు అయ్యిండే వాడు కాదట. అదేంటంటే చిరంజీవి గురించి అల్లు అరవింద్‌ని ఎంక్వైరీ చేయమని చెప్పాడట.
దాంతో అల్లు అరవింద్ చిరుతో పనిచేసిన పలువురు నటీనటులను దర్శకనిర్మాతలను ఆరా తీయగా ప్రతిఒక్కరూ మెగాస్టార్ గురించి గొప్పగా చెప్పారట. అదే విషయాన్ని అల్లు అరవింద్ తన తండ్రికి వివరించారట.ఆ తర్వాత అల్లు రామలింగయ్య ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి ట్రైన్ లో ప్రయాణించారట. ఆ రోజున అల్లు రామలింగయ్య వైన్ గ్లాస్ తీసుకుని చిరంజీవిని తాగమని చెప్పారట. కానీ చిరు మాత్రం తనకు అలవాటు లేదని చెప్పారట. దాంతో అల్లు రామలింగయ్య అప్పుడే చిరు తన అల్లుడు అని ఫిక్స్ అయ్యారట. అల్లు రామలింగయ్య ఇచ్చిన వైన్ గ్లాస్ తాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.