Samantha: సమంతపై తీవ్రంగా పెరుగుతున్న ఒత్తిడి..ఇక నోరు విప్పక తప్పదంటున్న ఫ్యాన్స్

Authored By vamana sai | The Telugu News | Published on: September 22, 2021, 7:00 am

Samantha: అక్కినేని కోడలు సమంత.. సమంత – నాగ చైతన్య..సమంత – నాగ చైతన్యలు విడిపోతున్నారా..ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. నెట్టింట ఎక్కడ చూసినా ఇదే విషయం అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు విషయం మాత్రం తేలడం లేదు. సమంత ఎప్పుడైతే తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ‘అక్కినేని’ అనే పదాన్ని తీసేసిన్దో అప్పటినుంచి రక రకాల పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. సమంత – చైతన్యల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఈ కారణంగానే ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నట్టు వార్తలు మొదలయ్యాయి. కానీ, ఈ వార్తలపై ఇద్దరు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనర్హం.

increasing stress on samantha-about naga chaitanya

increasing stress on samantha-about naga chaitanya

అయితే ప్రస్తుతం సమంత వైపు నుంచి జరుగుతున్న అంశాలన్నీ ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఒంటరిగా టూర్స్ వేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు సందేహాలకి దారితీస్తున్నాయి. ఇటీవల తిరుమలలో సమంత వ్యవహరించిన తీరు, విడాకుల ఇష్యూపై రియాక్ట్ కావాలని అడిగిన జర్నలిస్టుని ‘బుద్దుందా..’ అని అనడం సంచలనం అయింది. ఇక నాగ చైతన్య కూడా ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్స్‌లో మీడియా వాళ్ళు తన పర్సనల్ విషయాలు అడగకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా పీఆర్ టీమ్‌కి చెప్పారని టాక్ వినిపిస్తోంది.

Samantha: సమంత సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాలని కోరుకుంటున్నారు.

దాంతో అక్కినేని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఉన్నట్టుండి సమంత- నాగ చైతన్య ఇష్యూ అందరిలోనూ ఆసక్తికరమైన చర్చలకి తావిచ్చింది. రోజురోజుకూ దీనిపై చర్చలు తీవ్రమవుతున్నాయి. కానీ ఇరువురు దీనిపై రియాక్ట్ అవడం లేదు. సినీ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి కన్‌ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులన్నిటీని చూసి అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అందుకే ఇప్పటికైనా సమంత సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహిత వర్గాలు కూడా ఒత్తిడి తెస్తున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెర దించుతారో.

 

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp