indigo airlines surprise gift to anchor anasuya
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనేంటో.. తన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. యాంకర్ అనసూయ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఎవరైనా నెటిజన్లు తనపై కామెంట్స్ చేస్తే అనసూయ తట్టుకోలేదు. వెంటనే రియాక్ట్ అవుతుంది. అలా.. రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలిచే అనసూయ తాజాగా వేరే విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అనసూయ రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లిందట. అక్కడ ఇండిగో విమానం కోసం ఎదురు చూస్తూ ఉంది.
indigo airlines surprise gift to anchor anasuya
ఆ సమయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ విషయంలో తను తీవ్ర అసంతృప్తికి లోనయిందట. అసంతృప్తికి లోనయి అలాగే ఊరుకుంటే ఇప్పుడు మనం ఈ విషయం గురించి మాట్లాడుకునే వాళ్లమే కాదు. ఇండిగో సిబ్బందిపై తాను ఎందుకు అసహనం వ్యక్తం చేశానో అంటూ ఓ ట్వీట్ కూడా చేసేసింది అనసూయ. ఇండిగో ఎయిర్ లైన్స్ పై తీవ్రస్థాయిలో కోపంతో ఉన్నానంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఇండిగో సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశాను అంటూ ట్వీట్ చేయడం, ఇండిగో సర్వీస్ అంటేనే తనకు ఇష్టం లేదు అన్నట్టుగా వ్యవహరించడంతో వెంటనే ఎయిర్ లైన్స్ నిర్వాహకులు తన ట్వీట్ కు స్పందించారు.
indigo airlines surprise gift to anchor anasuya
తన ట్వీట్ కు రిప్లయి ఇచ్చారు. త్వరలోనే మిమ్మల్ని తిరిగి స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో మీకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం.. రాజమండ్రి విమానాశ్రయంలో మా బృందాన్ని కలిసినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లయి ఇచ్చి అనసూయ ఇంటికి ఇండిగో సిబ్బంది ఒక గిఫ్ట్ ను కూడా పంపించారు. అది సర్ ప్రైజింగ్ ప్యాక్. వాళ్లు పంపించిన సర్ ప్రైజ్ గిఫ్ట్ కు ఫిదా అయిన అనసూయ.. నిన్న తొందరపడి ఏదో మాటలు అనేశాను. రాజమండ్రి విమానాశ్రయంలో నన్ను రిసీవ్ చేసుకున్న తీరుకు ధన్యవాదాలు అంటూ మళ్లీ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు ఆమెపై సీరియస్ అవుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్నీ.. గిఫ్ట్ పంపించగానే కూల్ అయ్యావా అంటూ తనను ట్రోల్స్ చేస్తున్నారు.
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
This website uses cookies.