Superstar Krishna : “వెళ్లి విజయనిర్మలనే చేస్కో కానీ ఒక కండిషన్” కృష్ణ రెండో పెళ్లి టైంలో మహేష్ తల్లి ఇందిరా దేవి మాటలు !

 Authored By prabhas | The Telugu News | Updated on :16 November 2022,3:00 pm

Superstar Krishna : టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. పోయిన సంవత్సరం కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు తాజాగా కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కూడా అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావు. ఇందిరా దేవి చనిపోయిన కొన్ని రోజులకే కృష్ణ కూడా మరణించారు. ఇప్పుడు వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కృష్ణ భార్య అనగానే అందరికీ విజయనిర్మలనే తెలుసు. కృష్ణ మొదట ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత తనతో పాటు సినిమాలో నటిస్తున్న విజయనిర్మలను వివాహం చేసుకున్నాడు. కృష్ణ విజయనిర్మల ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇందిరా దేవి ఏమీ అనలేదు. అయితే కృష్ణతో విడాకులు తీసుకోకుండా పిల్లల బాధ్యతను చూసుకోవడం జరిగింది. కృష్ణ విజయనిర్మలతో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించారు. సినిమాలలో నటిస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కృష్ణ విజయనిర్మలను ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇందిరా దేవికి చెప్పగా ఆమె మాట్లాడకుండా అలాగే ఉండిపోయారట. కృష్ణ మాట గౌరవించి ఎలాంటి గొడవ చేయకుండా మౌనమే అర్ధాంగికారం అన్నట్లుగా ఉండిపోయారట.

Indira Devi give big condition to Superstar Krishna and Vijaya nirmala marriage

Indira Devi give big condition to Superstar Krishna and Vijaya nirmala marriage

కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఇందిరాదేవి ఆయనతో విడాకులు తీసుకోలేదు. అంతేకాకుండా తన కుటుంబాన్ని చూసుకుంటూ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇక ఏ సినిమా ఫంక్షన్ అయినా కృష్ణ విజయనిర్మల కలిసి వచ్చేవారు. అంతేకాకుండా ఇందిరాదేవి విజయనిర్మలతో మాట్లాడే వారు కూడా. ఫంక్షన్లలో ఇద్దరు కలుసుకునేవారు. ఇక కృష్ణకు విజయనిర్మల వెన్నెముక అని తెలుసుకొని ఒప్పుకున్నారు. అయితే కృష్ణ విజయనిర్మలతో పిల్లలని కనడానికి మాత్రం నో చెప్పారు. ఆ కండిషన్ తోనే పెళ్లి చేసుకున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి