
intinti gruhalakshmi 23 july 2022 full episode
Intinti Gruhalakshmi 01 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 01 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 673 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఫోన్ చేయగానే ఎత్తి అలాగే ఉంచుతుంది లాస్య. తులసి గురించి పిచ్చి పిచ్చిగా నందు మాట్లాడుతుంటే అన్నీ వింటుంది తులసి. అది ఒక ఇడియట్ అంటాడు నందు. మరి మంచి వ్యక్తి ఎవరు అంటే.. నా బెటర్ హాఫ్.. నా బంగారం లాస్య అంటాడు నందు. దీంతో లాస్య షాక్ అవుతుంది. ఒట్టేసి చెబుతున్నా లాస్య.. ఇది నా మనసులో మాట అంటాడు. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం లాస్య అంటాడు. నేల మీద కూలబడిన నన్ను మళ్లీ ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది లాస్య అంటాడు. దీంతో ఊరుకోండి.. నేనేం చేశాను అంటుంది లాస్య. మళ్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే దానికి కారణం లాస్యే అంటాడు. ఇలా మాట ఇచ్చింది.. అలా 20 లక్షలు తీసుకొచ్చి నా ముందు పోసింది. గ్రేట్ పర్సనాలిటీ అంది. నందు.. ఈడబ్బు నీది ఏం చేసుకుంటావో చేసుకో అంది అంటాడు నందు.
intinti gruhalakshmi 01 july 2022 full episode
ఇంత గొప్ప భార్య ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. నేను చాలెంజ్ చేసి చెబుతున్నా అంటాడు నందు. ఇవన్నీ ఫోన్ లో వింటుంది తులసి. నీ మొగుడేంటి తాగి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుంది భాగ్య. నువ్వు ఏదో ఒకటి వాగకు అని చెప్పి ఫోన్ తీసుకొని బయటికి వచ్చి తులసితో మాట్లాడుతుంది లాస్య. నువ్వు ఏం పొరపాటు చేశావో నీ అంతరాత్మకు తెలుసు లాస్య అంటుంది తులసి. నీతో తీరిగ్గా మాట్లాడటానికి నాకు టైమ్ లేదు. ఇంట్లో గెస్టులు ఉన్నారు అంటుంది లాస్య. దీంతో ఎందుకు అంతలా ఫోన్ కట్ చేసేందుకు ఆరాటపడుతున్నావు అంటుంది తులసి. నువ్వు తప్పు చేశావని నాకు తెలిసిపోయిందని భయపడుతున్నావా అంటుంది తులసి. దీంతో విషయం ఏంటో సూటిగా చెప్పు అంటుంది లాస్య. దీంతో నువ్వు భయపడుతున్నావన్న విషయం నీ మాటల్లోనే తెలిసిపోతోంది లాస్య అంటుంది తులసి.
మరోవైపు నా లాస్య ఎక్కడ అంటూ తన దగ్గరికి వస్తాడు నందు. ఏంది లాస్య ఇది.. సంతోషంలో పార్టీ చేసుకుంటుంటే ఇలా వదిలేసి ఫోన్ మాట్లాడుతున్నావేంటి.. టూమచ్ గెస్టులు వెయిట్ చేస్తున్నారు అంటాడు. దీంతో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నా. వస్తా నువ్వు వెళ్లు అంటుంది లాస్య.
అప్పటికీ ఫోన్ లో లైన్ లోనే ఉంటుంది తులసి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అడగ్గానే నీకు 20 లక్షలు ఇచ్చారు అంటుంది తులసి. నీ ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతుంది లాస్య. దీంతో నేనేమీ చేతులు ముడుచుకొని కూర్చోను. జనాలకు కూడా తెలిసే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
దీంతో తులసికి నేనే 20 లక్షలు తీసుకున్నట్టు తెలిసిపోయిందా ఏంటి అని భయపడుతుంది లాస్య. మరోవైపు లాస్యకు ఫోన్ చేశారా అని అడుగుతుంది అంకిత. దీంతో తనే తప్పు చేసినట్టు నాకు అనిపిస్తోంది అంటుంది తులసి. నా అకౌంట్ లో 20 లక్షలు మాయం అవడం.. మరోవైపు నందు 20 లక్షలతో బిజినెస్ మొదలు పెట్టడం రెండూ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి అంటుంది తులసి.
నీ డబ్బులతో నీకు తెలియకుండా డాడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటి.. ఇప్పుడే డాడ్ ను అడుగుతాను అంటుంది దివ్య. దీంతో వద్దు ఆగమ్మా అంటుంది తులసి. అసలు ఆ 20 లక్షలు నావి అనే విషయం మీ డాడీకి తెలుసో లేదో అంటుంది తులసి.
మనం ప్రతి నిమిషాన్ని సరిగ్గా వాడుకొని లాస్య చుట్టు ఉచ్చు బిగిద్దాం అని దివ్య, అంకితకు చెబుతుంది తులసి. నా దగ్గర ఒక ప్లాన్ ఉందని తన ప్లాన్ ను వాళ్లకు వివరిస్తుంది తులసి. మరోవైపు భాగ్యను ఉసిగొల్పి తులసి ఇంటికి పంపిస్తుంది లాస్య. ముందు ముసలోళ్లను పడేయాలని అనుకుంటుంది భాగ్య.
అత్తయ్య గారు.. మామయ్య గారు నన్ను దీవించండి అంటుంది భాగ్య. అత్తింటి మీద కోడలికి ఎప్పటికీ హక్కు ఉంటుంది. రాకుండా ఎవ్వరూ ఆపలేరు అంటుంది భాగ్య. నువ్వు ఊరికే రావు.. అవసరం ఉంటేనే వస్తావు అంటుంది అనసూయ. పాపం.. రాకరాక వచ్చింది. మీరు ఇలా నిలదీయడం ఏం బాగలేదు మామయ్య అంటుంది తులసి.
దీంతో థాంక్స్ తులసి అక్క. నువ్వు అయినా నా మనసును అర్థం చేసుకున్నావు అంటుంది భాగ్య. ఎలాగైనా ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటుంది భాగ్య. వీళ్లను ఎలా కాకపట్టాలి అని అనుకుంటుంది భాగ్య. రెండు రోజులే ఉండాలి కాబట్టి ఓకే అని అంటుంది అనసూయ.
దీంతో వాళ్లతో పాటే కూర్చొని భోం చేస్తూ ఉంటుంది భాగ్య. ఇంతలో అంకిత తన ప్లాన్ ను అమలు చేస్తుంటుంది. అంకిత.. తులసికి ఫోన్ చేస్తుంది. ఇంతలో మామ్ అతడే ఫోన్ చేస్తున్నాడు అంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.