intinti gruhalakshmi 06 may 2022 full episode
Intinti Gruhalakshmi 6 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 625 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాసేపు పరందామయ్య, అనసూయ ఇద్దరూ సరసాలు ఆడుకుంటారు. చాయ్ విషయంలో ఇద్దరికీ గొడవ వస్తుంది. ఇంతలో దివ్య వచ్చి వాళ్ల టీలో చెక్కర వేస్తుంది. మరోవైపు తులసి తల్లి సరస్వతి.. తులసిని కలుస్తుంది. ఇన్ని రోజులు నా మనసులోకి తొంగి చూసుకోలేదు. అందుకే తల్లి సంతోషానికి దూరమయ్యాను అంటుంది తులసి. నేనేమి పోగొట్టుకున్నానో ఆలస్యంగా తెలుసుకున్నాను అంటుంది.
అందుకే వెతుక్కుంటూ వచ్చావా అని అడుగుతుంది సరస్వతి. దీంతో అవును అంటుంది తులసి.నన్ను గుండెలకు హత్తుకోవాలని ఆశపడ్డ నా తల్లి గురించి నేను ఏనాడూ ఆలోచించలేదు అంటుంది తులసి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నా ఆయుష్షు పెంచితే బాగుండు అని అనిపిస్తోంది అంటుంది సరస్వతి. కష్టం వచ్చినప్పుడే కాదు.. కష్టం తీరిపోయాక కూడా ఆ ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అని అంటుంది సరస్వతి. తులసి.. తన కోసం లడ్డులు తీసుకొస్తుంది. కానీ.. తనకు షుగర్ అనే విషయం కూడా మరిచిపోతుంది. అయితే ఏంటి.. ఈ లడ్డును చూసి షుగర్ ను మరిచిపో అంటుంది తులసి. తనకు లడ్డు తినిపిస్తుంది.
intinti gruhalakshmi 06 may 2022 full episode
Intinti Gruhalakshmi 6 May Today Episode : నందును చూసి భయపడ్డ లాస్య కొడుకు
మరోవైపు లాస్య తన కొడుకును ఇంటికి తీసుకొస్తుంది. నందును చూసి తన కొడుకు భయపడతాడు. నందు దగ్గరికి తీసుకోవాలనుకున్నా తను రాడు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. ఏంట్రా పరాయివాడిని చూసినట్టు దూరంగా నిలబడి చూస్తున్నావు. మీ డాడీనే కదా. దగ్గరికి వెళ్లు.. పలకరించు అంటుంది. దీంతో బాగున్నారా అంకుల్ అంటాడు. అంకుల్ ఏంట్రా.. డాడీ అని పిలువు అంటుంది లాస్య.
లాస్య.. వాడు నాకు ఇంకా అలవాటు కావాలి.. నా మనసు ఒప్పుకోవాలి అంటాడు నందు. దీంతో నన్ను ఒప్పుకున్నప్పుడు వాడిని ఎందుకు ఒప్పుకోవు అంటుంది లాస్య. దీంతో పోనీలే అమ్మ..
కొన్ని రోజులు అలవాటు కానీయ్యు అంటాడు తన కొడుకు.ఆ తర్వాత మదర్స్ డే సెలబ్రేషన్స్ కోసం మదర్ థెరిస్సా ఫౌండేషన్ వాళ్లు ఫుడ్ ఆర్డర్ మనకే ఇచ్చారు అని చెబుతాడు నందు. దీంతో నేను వస్తాను అంటాడు పిల్లాడు. నేను కూడా వస్తాను అంటుంది లాస్య. మరోవైపు ప్రవళిక తులసికి ఫోన్ చేసి మదర్ థెరిస్సా ఫౌండేషన్ గురించి చెబుతుంది.దీంతో తులసి ఫౌండేషన్ కు వెళ్తుంది. అక్కడ నందు, లాస్య, తన కొడుకును చూస్తుంది తులసి. ఇంతలో లాస్య కొడుకు తులసిని చూసి ఆంటి ఆంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లక్కీ అంటూ అతడిని దగ్గరికి తీసుకుంటుంది తులసి. దీంతో లాస్యకు కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
This website uses cookies.