Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దూకుడుకు ఆచార్య బ్రేక్ వేసిందా..అంటే ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మరో మాట కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన సినిమాల మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమాకు ఎంత కరోనా ప్యాండమిక్ పరిస్థితులు ..మూడు వేవ్స్ వచ్చినా ఆర్ఆర్ఆర్ కంటే గొప్ప గ్రాఫిక్స్ ఏమీ లేని సినిమా. రొటీన్ కథే. ఇందులో ఉన్న భారీ సెట్ అంటే టెంపుల్ సెట్. దాన్ని కూడా హైదరాబాద్ కోకాపేట్‌లో నిర్మించారు. ఇలాంటి సెట్స్ మరో నాలుగు నిర్మించినా కూడా ఓవరాల్‌గా ఏడాది సెట్స్ నిర్మించడానికి..మూడు నెలలు టాకీ పార్ట్ రెండు నెలలు ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కోసం కేటాయించినా నాలుగేళ్ళు పట్టదు.
కాబట్టి, ముందుగా ఆచార్య సినిమా డిలే అవడానికి ప్రధాన కారణం మేకర్స్ ప్లాన్ తారుమారవడమే. ఇక ఆచార్య సినిమా మీద ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల ప్రభావం కూడా బాగా పడింది. ఆ సినిమాల వల్ల ఆచార్య మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే అసలు ఆచార్య సినిమా కథలో విషయం లేక పోవడం కొరటాల మార్క్ కనిపించకపోవడం ప్రతీ ఒక్కరినీ ఎంతగానో నిరాశపరిచింది. అంతేకాదు, ఈ సినిమా కథ, కథనాన్ని మెగాస్టార్ మార్చేశారేమో అని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా..ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ అని ఒప్పుకోవాల్సిందే.
ఇప్పుడిదే మెగాస్టార్ నటిస్తున్న సినిమాల మీద గట్టి ప్రభావం చూపించింది. ఆయన నుంచి అనుకున్న సినిమాలు ఇదే ఏడాది చివరి వరకు మరో రెండు రిలీజ్ చేసేలా సన్నాహాలు చేశారు. వాటిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఈ డిసెంబర్ వరకు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయాలని చిరు ప్లాన్ చేశారు. కానీ, ఆచార్య సినిమా ఫ్లాప్ ఇప్పుడు అన్నయ్య ఆలోచనలను మార్చేసిందని ఒక్క గాడ్ ఫాదర్ సినిమా తప్ప మిగతావేవీ ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని చెప్పుకుంటు న్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గాడ్ ఫాదర్ సినిమాతో భారీ హిట్ కొట్టాలని..ఆ తర్వాతే మిగతా సినిమాల రిలీజ్ గురించి ఆలోచించాలని డిసైడయ్యారట. ఒక్క సినిమా ఫ్లాప్ ప్రభావం ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన కెరీర్ మీద గట్టి ప్రభావం చూపుతుందనడానికి తాజా ఉదాహరణ ఆచార్య.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.