intinti gruhalakshmi 3 november 2021 full episode
Intinti Gruahalakshmi 1 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 465 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను ఓదార్చి కాలేజీకి ఫోన్ చేసి ఫీజు కడతా.. అని చెప్పి ధైర్యం చెబుతుంది తులసి. అంకిత.. మరోసారి అభిపై సీరియస్ అవుతుంది. ప్రాజెక్టు బాధ్యత మొత్తం ఆంటి తన మీద వేసుకుంది. ప్రాజెక్టు వర్క్ ఆగిపోయినట్టే. మామయ్య ఇక నుంచి ఆఫీసుకు వెళ్లనని చెప్పారు. ఆఫీసులో అంకుల్ ను ఆంటి హేళన చేసి మాట్లాడిందట. దీంతో పెనాల్టీ ఆంటి కట్టలేదు. ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. అందుకే మనం ఓ పని చేద్దాం. ఈ ఇల్లు, సంసారం మునిగిపోయే పడవ. ఇక్కడ ఇంకా మనం ఉండలేం. వెంటనే వెళ్లిపోదాం. మన దాని మనం చూసుకుందాం అని అంకిత అంటే.. అభి అస్సలు ఒప్పుకోడు. ఇవన్నీ తులసి వింటుంది. బాధపడుతుంది.
intinti gruhalakshmi 1 november 2021 full episode
నా ఫ్యామిలీ మొత్తం ముక్కలయిపోతోందని భయపడుతుంది తులసి. ఏడుస్తుంది. మరోవైపు నందు తెగ ఆలోచిస్తుంటాడు. ఇంతలో లాస్య వచ్చి.. గ్రేట్ నందు.. గ్రేట్ అంటూ పొగుడుతుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి నాన్నా అంటాడు. నీతో నాకు ఏం మాట్లాడేది లేదు.. అంటాడు నందు. నేను మాట్లాడను అంటాడు నందు. తను నా భార్య కాదు.. నీకు అమ్మ మాత్రమే అంటాడు. అమ్మను బాధపెట్టకండి నాన్న అంటాడు ప్రేమ్. దీంతో తనను నేను బాధపడటం కాదు.. తనే నన్ను బాధపెడుతోంది.. అంటాడు నందు.
తెల్లారగానే ఆఫీసుకు రెడీ అవుతుంది తులసి. నందు కూడా రెడీ అవడాన్ని చూసి ఏమండీ ఆఫీసుకా అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నువ్వు కలలు కంటే సరిపోతుందా? నేను ఇప్పటికే చెప్పాను.. నాకు, ఆఫీసుకు సంబంధం లేదు అని. నాదారి నాది.. నీ దారి నీది.. అని అంటాడు నందు. నా లక్ష్యం ఒక్కటే.. గడువులోపల ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడటం.. అంతేనండి అంటుంది తులసి.
intinti gruhalakshmi 1 november 2021 full episode
మరోవైపు శృతితో నందు అమ్మ గొడవ పెట్టుకుంటుంది. దీంతో నాకోసం మీరు గొడవ పెట్టుకోకండి అంటుంది తులసి. జీకేను కలవడానికి నందు వస్తాడు. నందును చూసి జీకే షాక్ అవుతాడు. ఎలా ఉన్నారు బావ గారు అంటాడు నందు. దీంతో ఎవరు ఎవరికి బావ గారు.. ఎలా బావ గారు అయ్యారు అని అంటాడు. ఎందుకు వచ్చారు అంటాడు జీకే. నేను బిజినెస్ పనిమీద మాట్లాడటానికి వచ్చాను అంటాడు నందు. ముందు విషయం చెప్పండి అంటాడు. నా కంపెనీని నిలబెట్టడానికి మీనుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. పెట్టుబడి పెట్టండి.. ప్రాఫిట్స్ తీసుకోండి అంటాడు నందు. కానీ.. జీకే వినడు. అస్సలు వినడు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.