Intinti Gruahalakshmi 1 Nov Today Episode : జీకేను కలిసిన నందు.. నన్ను మోసం చేసి నా ఇంటికే వస్తావా.. అని జీకే.. నందును ఏం చేశాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruahalakshmi 1 Nov Today Episode : జీకేను కలిసిన నందు.. నన్ను మోసం చేసి నా ఇంటికే వస్తావా.. అని జీకే.. నందును ఏం చేశాడు?

 Authored By gatla | The Telugu News | Updated on :1 November 2021,11:20 am

Intinti Gruahalakshmi 1 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 465 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను ఓదార్చి కాలేజీకి ఫోన్ చేసి ఫీజు కడతా.. అని చెప్పి ధైర్యం చెబుతుంది తులసి. అంకిత.. మరోసారి అభిపై సీరియస్ అవుతుంది. ప్రాజెక్టు బాధ్యత మొత్తం ఆంటి తన మీద వేసుకుంది. ప్రాజెక్టు వర్క్ ఆగిపోయినట్టే. మామయ్య ఇక నుంచి ఆఫీసుకు వెళ్లనని చెప్పారు. ఆఫీసులో అంకుల్ ను ఆంటి హేళన చేసి మాట్లాడిందట. దీంతో పెనాల్టీ ఆంటి కట్టలేదు. ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. అందుకే మనం ఓ పని చేద్దాం. ఈ ఇల్లు, సంసారం మునిగిపోయే పడవ. ఇక్కడ ఇంకా మనం ఉండలేం. వెంటనే వెళ్లిపోదాం. మన దాని మనం చూసుకుందాం అని అంకిత అంటే.. అభి అస్సలు ఒప్పుకోడు. ఇవన్నీ తులసి వింటుంది. బాధపడుతుంది.

intinti gruhalakshmi 1 november 2021 full episode

intinti gruhalakshmi 1 november 2021 full episode

నా ఫ్యామిలీ మొత్తం ముక్కలయిపోతోందని భయపడుతుంది తులసి. ఏడుస్తుంది. మరోవైపు నందు తెగ ఆలోచిస్తుంటాడు. ఇంతలో లాస్య వచ్చి.. గ్రేట్ నందు.. గ్రేట్ అంటూ పొగుడుతుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి నాన్నా అంటాడు. నీతో నాకు ఏం మాట్లాడేది లేదు.. అంటాడు నందు. నేను మాట్లాడను అంటాడు నందు. తను నా భార్య కాదు.. నీకు అమ్మ మాత్రమే అంటాడు. అమ్మను బాధపెట్టకండి నాన్న అంటాడు ప్రేమ్. దీంతో తనను నేను బాధపడటం కాదు.. తనే నన్ను బాధపెడుతోంది.. అంటాడు నందు.

Intinti Gruahalakshmi 1 Nov Today Episode : మరోసారి నేను ఆఫీసుకు రాను అని తెగేసి చెప్పిన నందు

తెల్లారగానే ఆఫీసుకు రెడీ అవుతుంది తులసి. నందు కూడా రెడీ అవడాన్ని చూసి ఏమండీ ఆఫీసుకా అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నువ్వు కలలు కంటే సరిపోతుందా? నేను ఇప్పటికే చెప్పాను.. నాకు, ఆఫీసుకు  సంబంధం లేదు అని. నాదారి నాది.. నీ దారి నీది.. అని అంటాడు నందు. నా లక్ష్యం ఒక్కటే.. గడువులోపల ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడటం.. అంతేనండి అంటుంది తులసి.

intinti gruhalakshmi 1 november 2021 full episode

intinti gruhalakshmi 1 november 2021 full episode

మరోవైపు శృతితో నందు అమ్మ గొడవ పెట్టుకుంటుంది. దీంతో నాకోసం మీరు గొడవ పెట్టుకోకండి అంటుంది తులసి. జీకేను కలవడానికి నందు వస్తాడు. నందును చూసి జీకే షాక్ అవుతాడు. ఎలా ఉన్నారు బావ గారు అంటాడు నందు. దీంతో ఎవరు ఎవరికి బావ గారు.. ఎలా బావ గారు అయ్యారు అని అంటాడు. ఎందుకు వచ్చారు అంటాడు జీకే. నేను బిజినెస్ పనిమీద మాట్లాడటానికి వచ్చాను అంటాడు నందు. ముందు విషయం చెప్పండి అంటాడు. నా కంపెనీని నిలబెట్టడానికి మీనుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. పెట్టుబడి పెట్టండి.. ప్రాఫిట్స్ తీసుకోండి అంటాడు నందు. కానీ.. జీకే వినడు. అస్సలు వినడు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది