
intinti gruhalakshmi 10 december 2021 full episode
Intinti Gruhalakshmi 10 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 డిసెంబర్, 2021, శుక్రవారం 499 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ అద్వైత కృష్ణ.. డాక్టర్ జగదీశ్ కు ఫోన్ చేస్తాడు. రిపోర్ట్స్ విషయంలో తనకు హెల్ప్ కావాలంటాడు. రిపోర్ట్స్ ను చూసి ఒకసారి పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చెప్పమంటాడు. ఆ డాక్టర్ ఏదో చెబుతాడు. ఓకే జగదీశ్.. అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కృష్ణ. కట్ చేస్తే.. తులసితో అందరూ నిజం చెప్పేస్తారు. నీకు చెబితే నువ్వు ఎక్కడ బాధపడుతావని మేం చెప్పలేదు అంటుంది అనసూయ. తర్వాత అందరూ కలిసిపోతారు. అందరూ కలిసి సరదాగా గడుపుతారు. ఇంతలో నన్ను క్షమించు తులసి అంటుంది తులసి. నేను నిన్ను క్షమించు అన్నది నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టినందుకు కాదు.. నువ్వు తులసివి అని మరిచిపోయినందుకు.. అంటుంది. తులసి వ్యక్తిత్వం ఎప్పుడూ మారదు అంటుంది అనసూయ.
intinti gruhalakshmi 10 december 2021 full episode
అబద్ధం చెప్పినందుకు సారీ.. అందరూ చెబుతారు. దీంతో తులసి సరే సరే అంటుంది. ఆ తర్వాత అందరూ నవ్వుతుంటారు. చూశారా అత్తయ్య ఇవి.. నిజమైన నవ్వులు అంటే అంటుంది తులసి. ఇక నుంచి పూర్తి సంతోషంగా నేను జీవిస్తాను అంటుంది. మేము కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోము అంటుంది అనసూయ. నువ్వు ట్రీట్ మెంట్ కూడా సరిగ్గా తీసుకోవాలి అంటాడు ప్రేమ్. తీసుకుంటాను కానీ.. నా ఆయుష్షు ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు. నా చిట్టి తల్లి పెళ్లి చూడాలి. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలి.. అంటుంది తులసి. ఇంతలో గార్డెన్ కు వచ్చి అందరూ ఫుట్ బాల్ ఆడుతుంటారు. అందరూ మళ్లీ కలిసిపోయి సరదాగా గేమ్స్ ఆడుతుండటం చూసి షాక్ అవుతుంది లాస్య. ఓర్చుకోలేకపోతుంది.
ఇంతలో అద్వైత కృష్ణ అక్కడికి వస్తాడు. అందరూ సరదాగా ఆడుకోవడం చూసి సంతోషిస్తాడు. నందును చూసి సూపర్ అంటాడు. బాగా ఆడుకుంటున్నారు అంటాడు అద్వైత కృష్ణ. ఇంతలో తులసి.. లాస్యను చూస్తుంది. లాస్య బాధపడటం చూస్తుంది. ఇంతలో అనసూయ వచ్చి.. తులసి ఈరోజు అన్ని ఆటల్లో నువ్వే గెలిచావు.. రేపు జీవితంలో కూడా నువ్వే గెలుస్తావు అంటుంది. తప్పకుండా అత్తయ్య.. ఖచ్చితంగా నేను గెలిచి మిమ్మల్ని గెలిపిస్తాను అంటుంది తులసి.
మరోవైపు.. నందు.. మంచినీళ్లు తాగడానికి వెళ్తాడు. ఇంతలో తులసి వచ్చి మీరు ఉండాల్సింది నా దగ్గర కాదు. లాస్య పక్కన.. అంటుంది తులసి. అదేం కాదులే.. కాసేపు ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే సమస్యేమీ లేదు అంటాడు. కానీ.. తులసి వినదు. తనకు నీ అవసరం ఉంది అంటే.. ఏం కాదు.. నువ్వు పదా అని తులసిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు.
దీంతో లాస్యకు చాలా కోపం వేస్తుంది. నన్ను ప్రేమించానంటాడు.. కానీ.. తులసి మీద జాలి చూపిస్తాడు.. అంటూ అనుకొని అక్కడి నుంచి వెళ్లబోతుంటుంది. ఇంతలో అద్వైత కృష్ణ రాబోతాడు. ఇద్దరూ ఢీకొంటారు. ఐయామ్ సారీ అంటాడు అద్వైత కృష్ణ.
హాయ్.. మీరు ఎవరు అంటాడు. నేను డాక్టర్ అద్వైత కృష్ణ అంటాడు. తెలుసు నాకు. తులసికి ట్రీట్ మెంట్ చేసేది మీరే కదా అంటుంది.. అవును అంటాడు. ఇంతకీ మీరు ఎవరు అంటాడు. నేను నందుకు.. అంటూ ఏదో చెప్పబోగా.. ఓహో.. నందు ప్రేమించిన అమ్మాయి మీరేనా అంటాడు కృష్ణ.
మరోవైపు నందు ఒంటరిగా కూర్చొని తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతడికి టీ తీసుకురాబోతుండగా తులసికి కళ్లు తిరుగుతాయి. కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. కొంచెం తగ్గగానే.. వచ్చి టీ తీసుకోండి అంటుంది. థాంక్స్ తులసి.. దూరంగా ఉన్నా గుర్తుపెట్టుకొని తీసుకొచ్చావు అంటాడు.
తులసి.. నీతో కొంచెం సేపు మాట్లాడాలి. నీ జీవితంలో జరిగిన ఎక్కువ నష్టానికి కారణం నేనే. బాధగా ఉందా అంటాడు నందు. మీ మీద కోపం తెచ్చుకోవడం వల్ల మనసుకు బాధ కలగడం తప్పితే ఇంకా ఒరిగేదేం లేదు.. అంటుంది. దీంతో ఇక నుంచి నేను నీ తోడుగా ఉంటాను తులసి.. అని మాటిస్తాడు నందు.
కానీ.. తులసి మాత్రం ఒప్పుకోదు. మీరు నాకు తోడుగా ఉంటారా.. నా పక్కనే ఉంటారా.. అంటుంది. భర్తగా నాకు విడాకులు ఇచ్చారు కదా. ఇప్పుడు ఏ హోదాతో నా పక్కనే ఉంటా అంటున్నారు అంటుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.