Intinti Gruhalakshmi 10 March Today Episode : కొత్త జీవితాన్ని ప్రారంభించిన ప్రేమ్, శృతి.. పస్తులు ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న దివ్య.. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 10 March Today Episode :  ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 576 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఎప్పటికీ ఇలాగే పస్తులు ఉంటాను. ఎవ్వరూ నాదగ్గరికి రావద్దు.. బతిమిలాడొద్దు. నేను ఎవ్వరి మాటా వినను అంటుంది దివ్య. దీంతో తులసికి కంగారు పెరుగుతుంది. దివ్య అర్థం చేసుకో. కొన్ని రోజుల పాటు ప్రేమ్ అన్నయ్యను మరిచిపో అంటుంది తులసి. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పమ్మా.. అంటుంది. వాడు తప్పు చేశాను.. శిక్ష అనుభవిస్తున్నాడు అంటుంది తులసి. కన్న కొడుకును ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం శిక్ష కాదు.. శాడిజం.. అంటుంది దివ్య. నిన్ను ఎంతగానో ప్రేమించే అన్నయ్యనే ఇంట్లో నుంచి పంపించావు.. కోపం వస్తే నన్ను కూడా ఇంట్లో నుంచి ఎందుకు పంపించవు అంటుంది దివ్య.

Advertisement

intinti gruhalakshmi 10 march 2022 full episode

అభి కూడా తప్పులు చేశాడు. వాడిని శిక్షించానా చెప్పు. కష్టపడి రక్షించుకున్నానా లేదా అంటుంది తులసి. నేను ఏం చేసినా వాడి మంచి కోసమే అమ్మా. వాడు కళ్ల ముందు లేకపోతే నేను ఉండగలనా.. భరిస్తున్నాను అంటుంది తులసి. ప్రేమ్ బాగు పడాలని నేను తీసుకున్న ఈ నిర్ణయం నన్ను ఇంత చెడ్డదాన్ని చేస్తుందని నేను అనుకోలేదు అని అనుకుంటుంది తులసి. ఇదంతా నీ స్వార్థం కోసమే చేస్తున్నావు కదా అని అడుగుతుంది దివ్య. దీంతో అవును.. నా స్వార్థం కోసమే చేస్తున్నా అంటుంది తులసి. నువ్వు ఏమైనా అనుకో.. ఇంతకుమించి నీ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పలేను.. మన మాటలు మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి.. అని అంటుంది తులసి.

Advertisement

ప్రేమ్ విషయంలో నువ్వు కల్పించుకోకు అని దివ్యతో అంటుంది తులసి. కానీ.. దివ్య మాత్రం వినదు. నేను ప్రేమ్ అన్నయ్య కోసం నేను దీక్ష చేస్తాను అంటుంది దివ్య. దీంతో మొండి వేషాలు వేయకు.. అన్నం తిను.. అంటూ ప్లేట్ తీసుకొచ్చి అన్నం తనకు తినిపించబోతుంది. దీంతో ప్లేట్ తీసి విసిరేస్తుంది దివ్య. నీకు కడుపు మాడితే నువ్వే అన్నం తింటావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

మరోవైపు ప్రేమ్, శృతి ఇద్దరూ ఖాళీగా ఉన్న రూమ్ ను చూస్తారు. దాంట్లో చెత్త ఎక్కువగా ఉండటంతో ఇంటిని క్లీన్ చేయడం ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి ఈ ఇల్లే మన వైకుంఠం అంటాడు ప్రేమ్. ఈ ఇల్లు సముద్రం కాదు.. ఈ రోజు నుంచి మన సంసారం ఒక సముద్రం అంటుంది శృతి.

నిన్ను పెద్దింటి నుంచి తీసుకొచ్చి పూరింట్లో తీసుకొచ్చాను. అన్ని సంతోషాలకు దూరం చేశాను అంటాడు ప్రేమ్. దీంతో భార్యకు కావాల్సింది పెద్ద మేడ కాదు.. భర్త నీడ.. అని అంటుంది శృతి. నీ చిటికెన వేలు పట్టుకొని ఏడు అడుగులు నడిచినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను ప్రేమ్ అంటుంది శృతి.

Intinti Gruhalakshmi 10 March Today Episode : రెంట్ కు తీసుకున్న రూమ్ లోకి వచ్చేసిన ప్రేమ్, శృతి

మనసులో బాధను పెట్టుబడిగా పెట్టి జీవితాన్ని నిర్మించుకుందాం అంటుంది శృతి. ఇప్పుడు నా మనసు ఆకాశంలో ఎగిరే గాలిపటంలా ఉంది అంటాడు ప్రేమ్. ఇంతలో అభి.. ప్రేమ్ కు ఫోన్ చేస్తాడు. దీంతో శృతి ఎత్తి మాట్లాడు అంటుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.

ఎక్కడున్నావురా ప్రేమ్. నిన్ను చూడాలని ఉంది అంటాడు అభి. దీంతో అమ్మ బాగుందా అని అడుగుతాడు ప్రేమ్. ఆ తర్వాత శృతితో అంకిత మాట్లాడుతుంది. తర్వాత మనం ఎక్కడున్నది మన వాళ్లకు పొరపాటున కూడా తెలియకూడదు అని చెబుతాడు ప్రేమ్.

వీళ్లకు తెలిస్తే వీళ్లు వచ్చి వెళ్తే అమ్మకు ప్రాబ్లమ్ అవుతుంది అంటాడు ప్రేమ్. మరోవైపు వాళ్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థం అవుతోంది.. అని అభితో అంటుంది అంకిత. మనం ప్రేమ్ తో మాట్లాడినట్టు ఆంటికి తెలియకూడదు అంటుంది అంకిత.. దీంతో సరే అంటాడు అభి.

మరోవైపు కారులో నందు, లాస్య వెళ్తుంటారు. నాకు ఈ మనుషుల వ్యక్తిత్వం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు లాస్య అంటాడు నందు. ఆ ప్రేమ్ గాడు నా కాలర్ పట్టుకున్నాడు. దీంతో ఆ తులసి వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది.

అమ్మ  మాత్రం ప్రేమ్ ఎక్కడికి వెళ్లాడో పట్టించుకోవా అని అడుగుతుంది అని అంటాడు నందు. అందుకే.. ఈ ఇంట్లో మనకు విలువ లేనప్పుడు ఉండటం ఎందుకు. ఇల్లు మారిపోదాం అంటుంది లాస్య. బయటికెళ్లి మన బతుకు మనం బతుకుదాం అంటుంది లాస్య.

అమ్మ, నాన్న.. తులసిని వదిలి రాలేరు. ఇప్పుడు నేను అమ్మానాన్నను పట్టించుకోకపోతే అందరూ నన్నే వేలెత్తి చూపిస్తారు అంటాడు నందు. మరోవైపు ఇంట్లో అందరూ ఎవరికి వారే ఏడుస్తూ కూర్చుంటారు. దివ్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది.

ప్రేమ్ అన్నయ్య మామ్.. ఇది వరకు మామ్ కాదు. నిజంగానే మారిపోయింది. నీ గురించి.. నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మామ్ మనసు రాయిలా మారిపోయింది అని అనుకుంటుంది దివ్య. మనసు రాయి చేసుకుంటే కానీ నిన్ను వదిలి ఉండలేకపోతున్నానురా అని అనుకుంటుంది తులసి.

నా మీద ఉన్న కోపమే నీకు బలంలా మారాలి అని అనుకుంటుంది తులసి. అమ్మ.. అంకిత అని పిలుస్తుంది. నాకొక సాయం చేస్తావా? ఎంత బతిమిలాడినా, బెదిరించినా దివ్య భోం చేయడం లేదు. నా ముఖం చూస్తేనే కోపగించుకుంటోంది.. అంటుంది తులసి.

మరోవైపు ప్రేమ్ వస్తేనే అన్నం తింటా అని అంటుంది అని నందు.. తులసితో అంటాడు. దీంతో ప్రేమ్ తిరిగి వస్తే వాడితో గొడవ పెట్టుకోను అని మాటిస్తారా అని నందును అడుగుతుంది తులసి. దీంతో సరే మాటిస్తాను అని అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Railway Jobs : యువతకు బంపర్ ఆఫర్ .. రాత పరీక్ష లేదు .. ఇంటర్వ్యూ లేదు .. రైల్వేలో 5,349 ఉద్యోగాలు

Railway Jobs  : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన Indian Railways కి…

24 minutes ago

Vallabhaneni Vamsi : ఊహించని బ్రేకింగ్.. టీడీపీ లోకి వల్లభనేని వంశీ..?

Vallabhaneni Vamsi  : కృష్ణా జిల్లా Krishna district రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ తీరు హాట్ టాపిక్ గా…

1 hour ago

Loan : గుడ్‌న్యూస్‌.. ఎలాంటి హామీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్ .. వివరాలివే .. !

Bank Loans: స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆశించే యువత, చిన్న వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేంద్ర…

2 hours ago

Ys Jagan : హిందువులను రెచ్చగొడుతున్న జగన్ ?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవుడు మరియు భక్తి అంశాలు ఇప్పుడు చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నాయకులు…

3 hours ago

Bharathi Cement : భారతీ సిమెంట్స్ భాగోతం బయటకి లాగుతున్న టీడీపీ..?

Bharathi Cement : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan  అధికారంలో ఉన్నప్పుడు తన సొంత కంపెనీ భారతీ…

4 hours ago

Ram Mohan Naidu : బిగ్ బ్రేకింగ్.. రామ్ మోహన్ నాయుడు కి పదవీ గండం..?

Ram Mohan Naidu : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రామ్ మోహన్ నాయుడు…

5 hours ago

Rythu Bharosa : రైతు భరోసా నిధుల పై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..!

Rythu Bharosa  : తెలంగాణలోని లక్షలాది మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' పెట్టుబడి సాయం పంపిణీకి…

6 hours ago

Love Marriage : బ్రేకింగ్ న్యూస్‌.. ప్రేమ పెళ్లి చేసుకునే వారికీ బిగ్ షాక్.. ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Love Marriage :  ప్రభుత్వం government ప్రేమ వివాహాలు మరియు రిజిస్టర్డ్ మ్యారేజ్ love marriage registration నిబంధనల్లో పెను…

7 hours ago

Female Farmer : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళారైతును పెళ్లి చేసుకుంటే రూ.10 లక్షలు..!

Female Farmer  : దేశానికి వెన్నెముక వంటి రైతు నేడు సామాజికంగా ఒక విభిన్నమైన సవాలును ఎదుర్కొంటున్నాడు. అందరి ఆకలి…

8 hours ago

Good News to Farmers : రైతుల‌కు డ‌బుల్ ద‌మాఖా.. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుద‌ల‌కు ముహుర్తం ఫిక్స్‌..!

Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదిరిపోయే…

9 hours ago

Donald Trump 10% Global Tariff : తగ్గేదేలే.. సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్కచేయని ట్రంప్.. మరో 10% టారిఫ్ పెంపు…!

Donald Trump 10% Global Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన నిర్ణయం…

10 hours ago

Gold Silver Rates 21 Feb 2026 Today : పెళ్లిళ్ల సమయంలో మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Silver Rates 21 Feb 2026 Today : గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు మళ్లీ…

11 hours ago