Intinti Gruhalakshmi 11 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 553 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి నా డబ్బులు తీసుకో అని ఇస్తే తులసి తీసుకోదు. పలానా పని చేసి తీసుకొచ్చాను అని చెబితేనే ఆ డబ్బులు తీసుకుంటాను అని చెబుతుంది తులసి. మరోవైపు అభికి సపోర్ట్ గా ఉన్న లాస్యకు నందు కౌంటర్ ఇస్తాడు. అభి మా బిడ్డ. వాడి బాగోగులు మా బాధ్యత అని చెబుతాడు నందు. తులసి.. ఇదిగో నేను ఇవ్వాల్సిన డబ్బు అని చెప్పి తన చేతుల్లో పెడతాడు నందు. దీంతో లాస్యకు చాలా కోపం వస్తుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. మరోవైపు అభికి తీవ్రంగా కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తులసి వస్తుంది. అభి అంటుంది. ఏంటి మామ్ డబ్బుల కోసం వచ్చావా అంటాడు అభి. లేదు అంటుంది.
నువ్వు దాచుకున్న నిజం కోసం వచ్చాను అంటుంది తులసి. ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఇదే. నేను నచ్చకపోతే నాతో మాట్లాడకు అమ్మా. నా ముఖం చూడకు అమ్మా. నా శాలరీ మొత్తం ఖర్చు పెట్టేశా. ఇప్పుడు అప్పు తీసుకొచ్చా అంటాడు. ఇలా నిజాలు దాచి పెట్టి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటుంది తులసి. మాధవి దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఏం చేశావు. ఎందుకురా ఇలా తయారయ్యావు. నీ జీవితం నాశనం అవుతుంది అని భయంగా ఉంది. కళ్లు మూసి తెరిచేలోపు అందనంత ఎత్తుకు ఎదగాలన్న ఆరాటంలో తప్పు చేస్తున్నావురా. ఎప్పటికి తెలుసుకుంటావురా అంటుంది తులసి. నువ్వు ఏం చెప్పినా ఇక నుంచి నేను నమ్మను. నువ్వు ఏం చేసినా నేను చూస్తూ ఊరుకోను. జాగ్రత్త.. అని హెచ్చరించి వెళ్తంది తులసి.
మరోవైపు అంకిత రెడీ అవుతుంటుంది. అప్పుడే అభి వస్తాడు. డబ్బును అక్కడ విసిరిపారేస్తాడు. నీకోపం ఎవరి మీద అభి. నువ్వు సంపాదించే డబ్బు మీదనా.. నిన్ను ప్రశ్నించిన ఆంటీ మీదనా అంటుంది అంకిత. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్న విషయం ఇప్పటికీ ఒప్పుకోవా అని ప్రశ్నిస్తుంది అంకిత.
నలుగురిలో నన్ను నిలబెట్టి అవమానిస్తున్నారు.. ద్వేషిస్తున్నారు అంటాడు అభి. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు నన్ను ఎదగనివ్వడం లేదు. నా తరుపున మీ ఆంటీని నిలదీయాల్సింది పోయి.. ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నావు అని అడుగుతాడు అభి.
అలా ఇద్దరూ కాసేపు గొడవ పెట్టుకొని దూరం దూరంగా పడుకుంటారు. నేను అనుకున్నది మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను. అప్పుడు నన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు అని అనుకుంటాడు అభి. మరోవైపు నందు.. లాప్ టాప్ లో ఏదో వర్క్ చేస్తుంటాడు. అప్పుడే లాస్య వస్తుంది.
ఎంతసేపు నీ గొడవ నీదేనా. ఇంట్లో జరిగే గొడవలు పట్టవా అని అడుగుతుంది లాస్య. అవతల తులసి నోటికి హద్దు లేకుండా పోతోంది. పొగరుగా మాట్లాడుతోంది అని లాస్య చెబుతుంది. నిన్ను ఏమైనా అన్నదా అంటాడు నందు. తను చెప్పినట్టు మనం ఎందుకు వినాలి అంటుంది లాస్య.
తను ఇప్పుడు మన ఇంట్లో డ్రైవర్ సీటులో ఉంది. తనే ఈ ఫ్యామిలీని ముందుకు నడిపిస్తోంది అంటాడు నందు. డ్రైవింగ్ సీటులో నువ్వు కూర్చో అంటుంది లాస్య. ఇవాళ అభిని అన్నది. రేపు నిన్ను నిలదీస్తుంది అని నందును రెచ్చగొడుతుంది. నిన్ను నిలదీసినా చేతగాడి వాడిలా ఉంటావా అని అడుగుతుంది లాస్య. ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటాడు నందు.
ఉదయాన్నే ఇంటికి శశికల వస్తుంది. గుర్తుపట్టావా అమ్మి అని అడుగుతుంది తులసిని. అప్పు తీసుకున్న వాళ్లు అప్పు ఇచ్చిన వాళ్లను మరిచిపోతారు. కానీ.. అప్పు ఇచ్చిన వాళ్లు మాత్రం అప్పు తీసుకున్నవాళ్లను చచ్చినట్టు గుర్తు పెట్టుకుంటారు. అది అప్పు ఇచ్చినవాళ్లకు దేవుడిచ్చిన శాపం అంటుంది శశికల.
నా అప్పు తీర్చడానికి మూడు నెలల గడువు అడిగారు. సంవత్సరం గడిచింది.. ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదు అంటుంది శశికల. ఇంతలో లాస్య కలగజేసుకొని ఆఫీసు టైమ్ అవుతోంది వెళ్దాం పదా. మనకు ఈ గొడవతో సంబంధం లేదు అని నందుతో అంటుంది. దీంతో లాస్య నువ్వు కాసేపు ఊరుకుంటావా అని నందు తనపై సీరియస్ అవుతాడు.
మొత్తం ఎంత కట్టాలి అని అడుగుతుంది తులసి. వడ్డీతో సహా మొత్తం 80 లక్షలు అని చెబుతుంది శశికల. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం. తీసుకున్నది 20 లక్షలే కదా అంటుంది లాస్య. తీసుకున్నప్పుడేమో అన్నింటికీ తల ఊపుతారు. ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో ఇలాంటి కథలే మాట్లాడుతారు అని చెబుతుంది.
ఎంత వడ్డీ అయినా కూడా 20 లక్షలకు నాలుగు ఇంతలు ఎక్కువ అవుతుందా అని అడుగుతుంది తులసి. నందు కూడా అదే అడుగుతాడు. మీరు ఇలాంటివి చేస్తారని నాకు తెలుసు. అందుకే అప్పు తీసుకునే ముందు నువ్వు వైట్ పేపర్ల మీద సంతకాలు చేశావు కదా.. వాటి మీద నువ్వు 80 లక్షలు తీసుకున్నావని రాసుకుంటాను అని బెదిరిస్తుంది శశికల.
అసలు నువ్వు వైట్ పేపర్ మీద ఎందుకు సైన్ చేశావు మమ్మీ అని సీరియస్ అవుతాడు అభి. లాస్య కూడా అదే అడుగుతుంది. ఆరోజు అభి చేసిన తప్పుకు అభిని తప్పించడం కోసం 20 లక్షలను శశికల దగ్గర అప్పుగా తీసుకొని కడుతుంది తులసి.
నందును శశికల నమ్మకపోవడంతో ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకుంటుంది తులసి. వారం రోజుల్లో డబ్బు మొత్తం చెల్లించాలని లేకపోతే ఇంటి ముందు నా బోర్డు ఉంటుంది అని హెచ్చరిస్తుంది శశికల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.