intinti gruhalakshmi 12 august 2022 full episode
Intinti Gruhalakshmi 12 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఆగస్టు 2022, శుక్రవారం ఎపిసోడ్ 709 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు నాకు కూడా టికెట్ బుక్ చేయి. నేను కూడా వస్తాను అంటుంది లాస్య. దీంతో సామ్రాట్ గారు ఏమైనా అనుకుంటారేమో అని అంటాడు నందు. ఏం కాదు.. పెళ్లాం కాని పెళ్లం తులసిని ఆయన తీసుకెళ్లగా.. నేను నీతో రావడంలో తప్పేముంది అంటుంది లాస్య. మరోవైపు సామ్రాట్, తులసి ఎయిర్ పోర్ట్ లో కూర్చొంటారు. ఫైల్ తీసుకొని నందును నెక్స్ట్ ఫ్లయిట్ కు రమ్మన్నాను. కానీ.. మన ఫ్లయిటే 2 గంటలు లేట్ అయింది అంటాడు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వచ్చాం కదా పదా ఏదైనా తిని వద్దాం అంటాడు సామ్రాట్. దీంతో అవసరం లేదు. నేను పులిహోర తీసుకొచ్చాను అంటుంది. పులిహోరనా అని నవ్వుతాడు. తర్వాత వాసన ఘుమఘుమలాడటంతో సామ్రాట్ వెంటనే ఆ పులిహోరను తినేస్తాడు.
intinti gruhalakshmi 12 august 2022 full episode
వావ్… అంటూ మొత్తం తినేస్తాడు సామ్రాట్. కడుపు నిండిపోయింది అంటాడు. అయ్యో మొత్తం తినేశానా? మీకు ఏం పెట్టలేదా అంటాడు సామ్రాట్. దీంతో మీకు గుర్తు లేదా అంటుంది తులసి. సారీ అండి మొత్తం తినేశా అంటాడు సామ్రాట్. దీంతో పర్వాలేదు.. నేను విమానంలో తింటాను అంటుంది తులసి. మరోవైపు అభి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. ఆ బట్టలను చిందరవందర చేస్తుంది అంకిత. హాస్పిటల్ కు వెళ్లాలి.. షర్ట్ నలిగిపోయింది. చూడు.. ఇప్పుడు ఎలా హాస్పిటల్ కు వెళ్లాలి అంటాడు అభి. దీంతో షర్ట్ నలిగితేనే ఇంతలా బాధపడుతున్నావు. నువ్వు ఆంటి మీద ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు అంటుంది అంకిత. నేను నీకోసం వచ్చాను అంకిత. నువ్వు హర్ట్ అయితే సారీ అంకిత అంటాడు అభి.
కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత. మరోవైపు క్యాబ్ లో నందు, లాస్య ఎయిర్ పోర్ట్ కు వస్తారు. లోపలికి వెళ్తారు. అక్కడ తులసి, సామ్రాట్ ఇద్దరు ఒకేచోట కూర్చోవడాన్ని చూస్తారు. ఇంతలో నందు, లాస్యను చూస్తారు తులసి, సామ్రాట్. ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు. వన్ ప్లస్ వన్ ఆఫర్ లా నందును రమ్మంటే నేను కూడా వచ్చానా అంటుంది లాస్య.
నిజానికి నేను నందును మెచ్చుకోవాలనుకుంటున్నాను. చాలామంది భార్యలను భర్తలు టూర్స్ కు తీసుకెళ్లరు. కానీ.. నందు మాత్రం అలా కాకుండా మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చాడు అంటాడు సామ్రాట్. మీరు ఏమంటారు తులసి గారు అంటాడు సామ్రాట్.
దీంతో ఆయన్ను పొగిడేంత నా దగ్గర విషయం లేదు అంటుంది తులసి. మరోవైపు మీకు టికెట్స్ దొరికాయా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో మీ విమానంలోనే దొరికాయి అని అంటాడు నందు. తర్వాత ప్రయాణికులంతా విమానం ఎక్కుతారు.
నా సీటు ఎక్కడ అంటుంది తులసి.దీంతో అదిగే ఆ విండో సైడ్ అంటాడు. అయ్యో ఈ సీటు డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అంటుంది. ఏం కాదు.. ఇది బిజినెస్ క్లాస్ అంటాడు సామ్రాట్. మీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం అంత విచ్చలవిడిగా ఖర్చు పెడతారా అంటుంది తులసి.
దీంతో ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అంటాడు సామ్రాట్. ఇంతలో అందరూ కూర్చొంటారు. ఇంతలో బత్తాయి బాలరాజు అంటాడు. అది నా సీటు అంటాడు బాలరాజు. ఇది ఎర్రబస్సు కాదమ్మ.. ఎయిర్ బస్సు.. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు అంటాడు బాలరాజు.
మరోవైపు విమానం స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే అంకిత, పరందామయ్య, దివ్య, అనసూయ, అభి అందరూ అన్నం తింటూ ఉంటారు. ఆ వంటలు వండింది అంకిత. దీంతో ఎవ్వరికీ ఆ వంటలు నచ్చవు. దీంతో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాదు. వంట బాగోలేదు అని చెబితే హర్డ్ అవుతుందని అనుకుంటాడు అభి.
నిజానికి ఫుడ్ బాగోలేదు అంటాడు అభి. దీంతో వాడికి అంతా వాడి డాడీ పోలిక అంటాడు పరందామయ్య. దీంతో అభి చిరాకు పడతాడు. ఆ తర్వాత బత్తాయి బాలరాజు సామ్రాట్, తులసిని చూసి మీరిద్దరూ భార్యభర్తలు అంటాడు. దీంతో నందుకు కోపం వస్తుంది. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
This website uses cookies.