intinti gruhalakshmi 12 january 2023 full episode
Intinti Gruhalakshmi 12 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జనవరి 2023, గురువారం ఎపిసోడ్ 840 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి భోజనం వండి తీసుకొస్తా అనే సరికి.. డైనింగ్ టేబుల్ మీద వెయిట్ చేస్తుంటారు పరందామయ్య, అనసూయ. ఇంతలో లాస్య.. కూరగాయలు కొసుకొని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తినండి అంటుంది లాస్య. ఇవన్నీ భోజనం చేశాక తింటాను కానీ.. ఇవన్నీ భోజనమే అంటే నావల్ల కాదు అంటాడు పరందామయ్య. దీంతో తినాలి మామయ్య తప్పదు అంటుంది లాస్య. ఇవన్నీ డైటింగ్ చేసే మీ లాంటి వాళ్లకు. మాకు కాదు. రేపో మాపో చనిపోవాల్సిన వాళ్లం. ఉన్నన్ని రోజులు నచ్చింది తింటాం అంటారు పరందామయ్య, అనసూయ. అయినా కూడా వినదు లాస్య. ఇవన్నీ మాకు వద్దు. మేం తినం అంటే అది మీ కర్మ. తులసికి కంప్లయిట్ చేసుకున్నా నేనేం భయపడను అంటుంది లాస్య.
intinti gruhalakshmi 12 january 2023 full episode
మరోవైపు తులసి కోసం వెయిట్ చేస్తుంటాడు సామ్రాట్. ఇంతలో తులసి వస్తుంది. పిలుస్తున్నా కూడా చూడకుండా లోపలికి వెళ్తుంటుంది. ఏమండోయ్ తులసి గారు అని పిలిచాక అప్పుడు చూస్తుంది తులసి. మనిషి ఇక్కడ మనసెక్కడో.. ఏంటి సంగతి. పిలిచినా వినిపించుకోకుండా వెళ్లిపోతున్నారు ఏం అంటే.. సారీ అండి అంటుంది తులసి. బాగానే ఉన్నాను అంటుంది తులసి. మనసు ఆనందంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నా ఫ్రెండ్ ఇలా డల్ గా ఉండటం నాకు ఇష్టం లేదు అంటాడు సామ్రాట్. అందుకే మిమ్మల్ని ఒక బర్త్ డే పార్టీకి తీసుకెళ్తున్నాను అంటాడు నందు. తులసి వద్దు అన్నా కూడా వినకుండా పార్టీకి తీసుకెళ్తాడు నందు.
కట్ చేస్తే పార్టీకి కారులో వస్తారు నందు, తులసి. బర్త్ డే ఎవరిది అంటే మా ఫ్రెండ్ వాళ్ల బాబుది. నిజానికి నాకు కూడా వర్క్ ఉంది కానీ.. మీతో పాటు సరదాగా బయటికి వద్దామని ఈ పార్టీకి తీసుకొచ్చా అంటాడు సామ్రాట్.
ఇంతలో తన ఫ్రెండ్ ను పరిచయం చేస్తాడు తులసికి. ఈవిడ తెలుసు. తులసి గారు అంటాడు. డైనమిక్ పర్సనాలిటీ అంటాడు. ఆ తర్వాత పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు పరందామయ్య, అనసూయ ఇద్దరూ బయటికి వెళ్తారు. ఇంతలో పక్కనే బర్త్ డే పార్టీ జరుగుతుంటే ఘుమఘుమ వాసన వస్తుంటుంది.
ఆకలి అవుతోంది వెళ్లి తిందాం పదా అంటాడు పరందామయ్య. దీంతో ముక్కు ముఖం తెలియని వాళ్ల పార్టీకి వెళ్లి తినడం ఎందుకు అంటుంది అనసూయ. కానీ.. పరందామయ్య బలవంతంగా అనసూయను తీసుకొని లోపలికి వెళ్లి ఇద్దరూ కలిసి ప్లేట్స్ తీసుకొని ఫుడ్ పెట్టుకుంటారు.
ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి వాళ్లను పట్టుకుంటాడు. ఎవరు మీరు అని అడుగుతాడు. దీంతో గెస్టులం అంటాడు పరందామయ్య. మరి గెస్టులు అయితే డైరెక్ట్ గా ఇక్కడికి రారు. అక్కడికి వెళ్లి అక్షింతలు వేసి వెళ్తారు అంటాడు.
మేము తినలేదు కదా. ప్లేట్ అక్కడ పెట్టి వెళ్తాం అంటారు. కానీ.. సెక్యూరిటీ గార్డ్ రచ్చ రచ్చ చేస్తాడు. పార్టీ ఓనర్ వస్తాడు. వాళ్లను చూసి పెద్దోళ్లు కదా.. ఏం కాదు తిని వెళ్లండి అంటాడు. సామ్రాట్, తులసి చూసి అక్కడికి వచ్చి ఏంటి ఇదంతా అంటుంది తులసి.
దీంతో ఏంటి మేడమ్ వీళ్లు మీ వాళ్లా. సమాజంలో ఆడవాళ్లకు మీరు రోల్ మోడల్ అనుకున్నాను కానీ.. ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. మీ సొంత వాళ్లకు తిండి పెట్టకుండా ఇలా రోడ్డు మీద వదిలేస్తారా? వాళ్లు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచి ఉంటారు. రోడ్డు మీద ఇలాగేనా వదిలేయడం అంటాడు అతడు.
బాబు మా తులసిని ఏం అనకండి. ఇక్కడికి రావడం నాదే తప్పు. మా ఆవిడ చెబుతూనే ఉంది. వినిపించుకోలేదు. అనవసరంగా వచ్చి వాళ్ల పరువు కూడా తీశాను అంటుంది తులసి. నన్ను క్షమించు అమ్మ. చేయకూడని తప్పు చేశాను. ఇంతకంటే నేను ఏం చెప్పలేను అంటాడు పరందామయ్య.
తప్పు నీది కాదు పెద్దాయన. మీరు కన్న పిల్లలది.. అంటాడు. దీంతో స్టాప్ అని చెప్పి వాళ్లను తీసుకొని వెళ్తాడు సామ్రాట్. కట్ చేస్తే ఇంటికి వెళ్లిన తర్వాత పరందామయ్య, అనసూయ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇలాగే చూస్తూ ఉంటే ఆ లాస్య నా కుటుంబాన్ని బతకనివ్వదు. ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది. దీంతో సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది తులసి. అలసిపోయాను సామ్రాట్ గారు అంటుంది తులసి.
దీంతో ఒక్క విషయంలో నిర్ణయం తీసుకున్నాను కానీ.. అది తప్పో ఒప్పో తెలియడం లేదు. అందుకే మీ సలహా కోసం వచ్చాను అంటుంది తులసి. మీరు తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదు తులసి గారు అంటాడు.
దీంతో ఏం చెప్పండి అంటే.. నేను తిరిగి మా ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నాను అంటుంది తులసి. అంటే మీరు ఎందుకోసం అయితే మీరు ఇల్లు వదిలి వచ్చారో ఆ లక్ష్యం నెరవేరిందా? అంటాడు సామ్రాట్.
ఎదగాలన్నది నా ఆశ కానీ అందుకోసం మా వాళ్ల సంతోషాన్ని బలిపెట్టలేను కదా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.