Intinti Gruhalakshmi 15 Dec Today Episode : తులసిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టి నందును వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్న లాస్య ప్లాన్ వర్కవుట్ అయిందా?

Intinti Gruhalakshmi 15 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 డిసెంబర్ 2021, బుధవారం 503 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్లు నీ గురించి ఆలోచించే వాళ్లే తప్పితే నా గురించి ఎవరికీ సానుభూతి లేదు. నా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. కనీసం నన్ను ప్రేమించిన వాడు కూడా నా బాధను పట్టించుకోవడం లేదు.. అని తులసితో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది లాస్య. అది అహంకారం.. యుద్ధం చేయి.. తల ఎత్తి మాట్లాడు.. అంటుంది తులసి. ఏంటి.. ఇక్కడ నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదా? నువ్వు ఇష్టం లేకపోతే.. వీళ్లంతా నీ చుట్టు ఎందుకు చేరుతారు. నీకు ఏమైందో అని ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటుంది తులసి. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ.. నందు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అంటుంది లాస్య.

intinti gruhalakshmi 15 december 2021 full episode

దీంతో నేను చెప్పదలుచుకుంది ఇంతకుముందే చెప్పాను కదా. నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ… తులసి ఆరోగ్యం కుదుటపడగానే చేసుకుంటాను. ఇది అందరి ముందు చెబుతున్నాను అంటాడు నందు. ఆ తర్వాత తులసి.. తన మేనేజర్ కు ఫోన్ చేస్తుంది. డెలివరీ సరిగ్గా జరగడం లేదు ఎందుకు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి.. అని ఫోన్ చేసి చెబుతుంది తులసి. తను ఫోన్ లో మాట్లాడటం చూసి అది డెడికేషన్ అంటే అంటుంది లాస్య. ఏ పని ఎలా చేస్తే పూర్తవుతుందో.. ఎవరు ఏ పని చేస్తే పూర్తవుతుందో ఇక్కడి నుంచే చక్కగా గైడ్ చేస్తున్నావు అంటుంది లాస్య. చేసే పని మీద నీకు చాలా క్లారిటీ ఉంటుంది తులసి అంటుంది. ఇంత గొప్పగా ఆలోచించే కెపాసిటీ ఉన్న నీకు.. నువ్వు ఏం చేస్తే నందు నన్ను త్వరగా పెళ్లి చేసుకుంటాడో తెలియదా? అని అంటుంది లాస్య. లేక తెలిసినా తెలియనట్టు నాకెందుకులే అని ఊరుకుంటున్నావా అంటుంది లాస్య.

నాకు నటించాల్సిన అవసరం లేదు. నటించడం తెలియదు అంటుంది తులసి. అదేంటో తులసి.. నువ్వు నాకు అర్థం కావు. నందును నన్ను పెళ్లి చేసుకోవాలంటూ అందరి ముందు నిలదీస్తావు. ఆ తర్వాత ఆయనకు సేవలు చేస్తావు. ఓవైపు నాతో మంచిగా ఉంటూనే నీ మంచిని చూసుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తుంది.. అంటుంది లాస్య.

నేను నీకోసం నీతిగా ఉండను. నాకోసం ఉంటాను. నీకోసం నేను మంచిగా నటించలేను. మంచితనం నా రక్తంలోనే ఉంది. అయినా నీ నందు నీతో పెళ్లికి ఒప్పుకోవడానికి నాకేంటి సంబంధం. నాకేంటి ఈ బాధ. ప్రస్తుతం నాకున్న ఈ పరిస్థితుల్లో నీ గురించి నేనెందుకు ఆలోచించాలి అంటుంది తులసి.

ఎందుకంటే.. ప్రతిసారి నీ గురించే ఆలోచించి.. నందు మా పెళ్లిని వాయిదా వేస్తున్నాడు.. అంటుంది లాస్య. మా పెళ్లి విషయంలో నందు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటే.. నువ్వు ఒక పని చేయాల్సిందే అంటుంది. ఏంటది అంటే నువ్వు నందు కళ్ల ముందు కనిపించకూడదు అంటుంది లాస్య. నువ్వు నందు కళ్ల ముందు ఉన్నంత కాలం ఇలాగే ఇన్ ఫ్లూయెన్స్ అవుతూనే ఉంటాడు.. అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 15 Dec Today Episode : తులసిని రెచ్చగొట్టిన లాస్య.. నందుకు దూరంగా వెళ్లిపో అన్న లాస్య

మా పెళ్లి జరగాలంటే.. నువ్వు ఇచ్చిన మాటలో నిజాయితీ ఉంటే.. నందుకు దూరంగా వెళ్లిపో.. అంటుంది లాస్య. నీముందు నిజాయితీని చూపించుకోవాల్సిన అవసరం లేదు.. అంటుంది తులసి. లాస్య కావాలని తులసిని రెచ్చగొడుతుంది. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు.

నీ జీవితం ఒక దారిలోకి రావడం కోసం నేను నువ్వు అడిగినట్టు చేస్తాను. తులసి మాటిచ్చిందంటే వెనక్కి తగ్గదు అంటుంది తులసి. నాకు కావాల్సింది అదే తులసి అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. దీంతో తులసి.. తన ఫ్యామిలీ గురించి నందు గురించి ఆలోచించి వెక్కి వెక్కి ఏడుస్తుంది.

మరోవైపు తులసి ఆత్మే తనను ప్రశ్నిస్తుంది. తప్పు చేశావేమో తులసి. విడాకులు తీసుకొని ఆయన తప్పు చేశాడు. ఇప్పుడు తప్పు తెలుసుకొని దగ్గరవుదామనుకుంటున్నాడు. మరి నువ్వెందుకు ఆ తప్పును ఒప్పుకోకూడదు.. అంటుంది తన అంతరాత్మ.

నాది కానిది ఎప్పుడూ నా దగ్గర నిలబడదు. నాది అయింది ఎంత అనుకున్నా ఉండదు అని అంటుంది తులసి. నువ్వు నష్టపోతున్నావేమో తులసి అంటుంది. లాస్య మాయలో పడి నువ్వు మోసపోతున్నావేమో అంటుంది అంతరాత్మ. నా ఓపికను పరీక్షించకు… ప్లీజ్. నేను వైవాహిక జీవితంలో ఓడిపోయాను కానీ.. జీవితంలో కాదు అని చెబుతుంది తులసి.

లాస్య ప్లాన్ వర్కవుట్ అవుతుంది. లాస్య చెప్పినట్టుగానే.. తులసి తన బట్టలు సర్దుకుంటుంది. తన పెళ్లి డైరీ అప్పుడే కనిపిస్తుంది. తన పెళ్లి ఫోటోలు చూసి కోపం తెచ్చుకొని పెళ్లిఫోటోలను చెత్తబుట్టలో విసిరేస్తుంది తులసి. దీంతో చెత్తబుట్టలో ఉన్న ఆ డైరీని తీసుకున్న లాస్య.. ఆ ఫోటోలను తీసి మంటల్లో వేస్తుంది.

మరోవైపు ఇంట్లో వాళ్లంతా సరదాగా గడుపుతుంటారు. ఇంతలో తులసి బ్యాగు సర్దుకొని వస్తుంది. చూసి షాక్ అవుతారు. ఏమ్మా ఎక్కడికి బయలుదేరావు అంటాడు ప్రేమ్. నిన్నే అమ్మా అడిగేది ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు కానీ.. తులసి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇంతలోనే నందు వస్తాడు.

ఎక్కడికి బయలుదేరావు తులసి. అడిగేది నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు నందు. ఎవ్వరి అవసరం లేని చోటుకు అంటుంది తులసి. ఎవ్వరూ నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేని చోటుకు అంటుంది. నీకు ఏమైంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలియదా? అంటాడు నందు.

నా జబ్బుతో మీరొక్కరినే కాదు.. ఇంకొక్కరిని కూడా బాధపెడుతున్నారు. అసలు నా జబ్బు గురించి మీరెందుకు ఆలోచించాలి. నాకు ట్రీట్ మెంట్ ఎన్ని ఏళ్లు ఆగితే అన్ని ఏళ్లు మీరు అలాగే లాస్యను పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నా జబ్బు గురించి ఆలోచించడానికి మీరెవరు.. అని ప్రశ్నిస్తుంద తులసి.

వాళ్ల పెళ్లి వాళ్లిద్దరి సమస్య కదా తులసి అని అంటాడు పరందామయ్య. లాస్య కన్నీళ్లకు కారణం నేను అవ్వలేను అంటుంది తులసి. తులసి వెళ్లిపోబోతుంటే.. అందరూ ఆపుతారు. నేను ఇక్కడ ఉండాలంటే లాస్యను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోండి అంటుంది. దీంతో లాస్యను వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో లాస్య సంతోషపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

7 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

8 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

9 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

11 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

12 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

13 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

14 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

15 hours ago