intinti gruhalakshmi 15 july 2022 full episode
Intinti Gruhalakshmi 15 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 685 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని ఆటోలో ఊరంతా తిప్పిస్తుంది హనీ. కావాలని తన ఇల్లు గురించి చెప్పకుండా ఊరంతా తప్పి ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది. దీంతో తనకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. ఇంతలో ప్రేమ్ తనకు ఫోన్ చేస్తాడు. అమ్మా ఎక్కడున్నావు అని అడుగుతాడు. దీంతో నేను బయటికి వచ్చాను అంటుంది. దీంతో ఇంటికి వచ్చాక నేనే నీ దగ్గరికి వస్తా అంటాడు. ఇంతలో పాప కనిపించదు. దీంతో ఎక్కడికి వెళ్లింది అని అనుకునే లోపు పాప ఎక్కడికో పోతుంది. దీంతో పాప ఎక్కడికి వెళ్లింది అని చూస్తుంది. అక్కడే బెలూన్స్ దగ్గర ఆడుకుంటూ ఉంటుంది పాప. ఆ తర్వాత సీసీ కెమెరాలో పాపను ఎత్తుకెళ్లిన వాళ్లను పట్టుకున్నాం అని పోలీసులు సామ్రాట్ కు చెబుతారు. అందులో తులసి, పాప ఉన్న ఫోటోను చూస్తాడు సామ్రాట్. వెంటనే తను ఎవరో పట్టుకోండి. తను ఇంటి మీద అటాక్ చేయండి అంటాడు సామ్రాట్.
intinti gruhalakshmi 15 july 2022 full episode
దీంతో వెంటనే తులసి ఇంటికి వెళ్తారు పోలీసులు. ఇల్లును సెర్చ్ చేస్తారు. కానీ.. అక్కడ తులసి ఉండదు. దీంతో వెంటనే సామ్రాట్ కు ఫోన్ చేస్తాడు. దీంతో కిడ్నాపర్ అక్కడ లేడు. పాప కూడా లేదు. పాపను ఎత్తుకొచ్చిన ఇంట్లో వాళ్ల అత్తా మామ ఉన్నారు అని చెబుతాడు పోలీస్. దీంతో వాళ్లను ఎత్తుకొచ్చేయండి అంటాడు సామ్రాట్. దీంతో వాళ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు పోలీసులు. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో జరిగిన విషయం అంకిత, దివ్య చెబుతారు. దీంతో నేను వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్తాను. నువ్వు అమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు అని అంటాడు ప్రేమ్.
మరోవైపు హనీ.. తులసిని ఊరంతా తిప్పుతుంది కానీ.. తన ఇల్లు మాత్రం చెప్పదు. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. అంకిత ఫోన్ చేస్తుంది. అసలు విషయం చెబుతుంది. పరందామయ్య, అనసూయను పోలీసులు పట్టుకెళ్లారు అంటుంది. దీంతో భయపడుతుంది తులసి. మీ ఇల్లు ఎక్కడో సరిగ్గా గుర్తు చేసుకో అని హనీని అడుగుతుంది.
దీంతో సరదాగా ఊరంతా తిరగాలని కావాలని మా ఇంటి అడ్రస్ చెప్పలేదు. ఇప్పుడు చెబుతానులే అంటుంది కానీ.. నన్ను ఊరంతా తిప్పినట్టు మా డాడీకి చెప్పొద్దు. నాకు ప్రామీస్ చేయండి అంటుంది. దీంతో సరే అంటుంది తులసి. మరోవైపు పోలీస్ స్టేషన్ కు కోపంతో వస్తాడు సామ్రాట్.
ఏమంటున్నారు ఆ ముసలివాళ్లు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో వాళ్లు ఏం చెప్పడం లేదు. మాకు ఏం తెలియదు అని అంటున్నారు అని పోలీస్ చెబుతాడు. ఇంతలో తులసి పోలీస్ స్టేషన్ కే డైరెక్ట్ గా పాపను తీసుకొని వస్తుంది. అక్కడ పాపను చూసి సామ్రాట్ షాక్ అవుతాడు.
తన పాపను చూసి దగ్గరికి పిలుస్తాడు. తన పాపను ఎత్తుకుంటాడు. మీ పాప మీ దగ్గరికి చేరింది కదా. ఇక మా వాళ్లను వదిలేయమని చెబుతారా అని అడుగుతుంది తులసి. దీంతో హనీ నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్తు అంటుంది హనీ. విషయం తెలుసుకోకుండా మీరు మా వాళ్లను జైలులో పెట్టించారు అంటుంది తులసి.
దీంతో పోలీస్ దగ్గర ఉన్న గన్ ను లాక్కొని సామ్రాట్ తులసి తలకు గురి పెడతాడు. హనీని కిడ్నాప్ చేస్తావా? హవ్ డేర్ యు. చంపేస్తా. ఎవరు వస్తారో చూస్తాను అంటాడు సామ్రాట్. దీంతో పాపకు యాక్సిడెంట్ అయింది అని చెబుతుంది తులసి. ఎలా యాక్సిడెంట్ అయింది అని అడుగుతాడు సామ్రాట్.
తను చెప్పే సమాధానాలు నమ్మక.. తనను కూడా అరెస్ట్ చేయిస్తాడు సామ్రాట్. ఇంతలో పోలీస్ స్టేషన్ కు వస్తాడు ప్రేమ్. మరోవైపు తన వల్ల తులసి ఇబ్బంది పడుతోందని లాస్యతో అంటాడు నందు. తులసికి ఫోన్ చేస్తాను అంటాడు నందు. కానీ.. లాస్య వద్దని వారిస్తుంది.
నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు మిమ్మల్ని లాకప్ లో పెట్టడం ఏంటి అంటాడు ప్రేమ్. దీంతో తొందరపడకు అంటుంది తులసి. మరోవైపు హనీ నిద్రపోతూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చి కూర్చొంటాడు సామ్రాట్. నిన్ను దూరం చేసుకుంటానేమో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అనుకుంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.