Intinti Gruhalakshmi 16 Jan Today Episode : ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలని లాస్య పాట్లు.. అమెరికన్ ప్రాజెక్ట్ హెడ్ గా తులసి.. ఇంతలో తులసికి షాకింగ్ న్యూస్

Intinti Gruhalakshmi 16 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 843 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను అర్జెంట్ గా ఉత్తమ ఇల్లాలుగా మారిపోవాలి అని అంటుంది లాస్య. దీంతో ఏంటి అని అంటాడు నందు. ముందు నేను ఉత్తమ ఇల్లాలుగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. ఉదయం 5 గంటలకే లేవాలి అంటాడు. పొద్దున్నే లేచి ఇంటి ముందు ఊడ్చి.. ముగ్గు వేసి స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టడం ఉత్తమ ఇల్లాలి లక్షణం అంటాడు నందు. ఏడు గంటలకు లేచి ముగ్గు వేసుకోకూడదా? ఇల్లు ఊడవకూడదా? అంటుంది లాస్య. దీంతో ఏడు గంటలకల్లా అందరికీ కాఫీ ఇవ్వాలి. నువ్వు అప్పుడే లేస్తే.. అవన్నీ పనులు చేయాలి అంటాడు నందు.

intinti gruhalakshmi 16 january 2023 monday full episode

అందరికీ ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ముఖ్యంగా మా నాన్న, అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు సమయానికి మెడిసిన్ ఇవ్వాలి. ఇంట్లో వాళ్లకు ఏం కావాలో అది చేసి పెట్టాలి అంటాడు. దీంతో తులసిలా మారాలి అంటావు అంతే కదా అంటుంది లాస్య. దీంతో అంతేగా అంటూ చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. దీంతో మంచి చీర కట్టుకొని కొండు ఇలా మెడ మీద వేసుకోబోతుంది కానీ.. మరీ ఇంత ఉత్తమంగా అవసరం లేదు అని అనుకుంటుంది. చీర దగ్గరే చిరాకు పడితే ఎలా.. అర్జెంట్ గా తులసి క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేయాలి అని అనుకొని ముందు వాకింగ్ ట్రై చేస్తాను అనుకుంటుంది.

నడక కన్నా.. తులసిలా మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనుకొని మామయ్య గారు… అత్తయ్య గారు అంటూ మాట్లాడటం నేర్చుకుంటుంది. కట్ చేస్తే తులసి అందరి కోసం వంటలు వండుతుంది. అందరూ భోజనానికి రండి.. నేను వడ్డిస్తున్నాను అంటుంది తులసి.

దీంతో అందరికీ నేను కదా వడ్డించాల్సింది అని అనుకుంటుంది. అందరూ వచ్చి కూర్చొంటారు. దీంతో రా.. లాస్య నువ్వు కూడా కూర్చో. నేను వడ్డిస్తాను అంటుంది తులసి. దీంతో అది కాదు కానీ.. నువ్వు కూర్చో.. నేను వడ్డిస్తాను అని అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు.

నువ్వు కూర్చో అని తనను కూర్చోబెట్టి మరీ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది లాస్య. లాస్యను విచిత్రంగా చూస్తాడు నందు. అందరికీ వంట వడ్డిస్తూ ఉంటుంది లాస్య. దీంతో అందరూ తింటూ ఉంటారు. ప్రేమ్ వడ్డించేది మీ అమ్మే అనుకో.. అస్సలు మొహమాట పడకు అంటుంది.

మామయ్య గారు.. అత్తయ్య గారు.. ఇంకాస్త వడ్డించనా అంటుంది లాస్య. దీంతో చాలమ్మా అంటుంది. ఇంతలో నందు దగ్గరికి వెళ్తుంది. నందు.. నీకు సాంబారు వడ్డిస్తాను. పక్కన ఉన్న అన్నం కూడా కలుపుకో అంటుంది. ఇంతలో సాంబారు తన షర్ట్ మీద పడుతుంది. దీంతో అందరూ నవ్వుతారు.

Intinti Gruhalakshmi 16 Jan Today Episode : ఆఫీసులోనూ లాస్య చేసిన పనికి నవ్వుకున్న తులసి

ఎందుకు వచ్చేశావు నందు అంటుంది లాస్య. దీంతో నా మీద సాంబారు పోశావు కదా అంటూ వచ్చి కడుక్కుంటాడు. నేను ఉత్తమ ఇల్లాలు కాకుండా నువ్వే అడ్డుకునేలా ఉన్నావు. కుదురుగా ఉండొచ్చు కదా అంటుంది. దీంతో ముందు పనులు చేయడం నేర్చుకో. ఆ తర్వాత ఉత్తమ ఇల్లాలు అవుదువు గానీ అంటాడు నందు.

కట్ చేస్తే తులసి ఆఫీసుకు వెళ్తుంది. సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి బిజీగా పని చేస్తుంటారు. ఇంతలో తనకు ఏదో గుర్తొచ్చి నవ్వుతూ ఉంటుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. నన్ను చూసా నవ్వుతున్నారు అంటాడు సామ్రాట్. దీంతో మీరేమన్నా జోకరా? అంటుంది తులసి.

లాస్య మంచిదాన్ని అనిపించుకోవడం కోసం రాత్రి నంద గోపాల్ మీద సాంబారు పోసింది లాస్య అంటుంది. లాస్య.. తులసిలా బుద్ధిగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికి తన కోరిక తీరాలో అంటుంది తులసి. దీంతో మీ కోరిక అయితే తీరింది కదా అంటాడు సామ్రాట్.

అవును. మీ పుణ్యమాని సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నా అంటుంది తులసి. ఇప్పుడు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మా పిల్లలను సెటిల్ చేయాలి అని అంటుంది తులసి. దీంతో ఎవరి ప్రొఫెషన్ వాళ్లకు ఉంది కదా అంటాడు సామ్రాట్.

దీంతో ఉన్నాయి కానీ.. వాళ్లు ఇంకా సరిగ్గా సెటిల్ అవ్వలేదు అంటుంది తులసి. ఆ తర్వాత అత్తయ్య, మామయ్యలను మంచిగా చూసుకోవాలి. ఆ తర్వాత దివ్య పెళ్లి చేయాలి అని తన ముందు ఉన్న లక్ష్యాలను చెబుతుంది తులసి. నేను సంపాదించిన డబ్బుతోనే దివ్య పెళ్లి చేయాలి అని అంటుంది.

ఇంతలో అమెరికన్ ప్రాజెక్ట్ కు మీరే హెడ్ అంటాడు సామ్రాట్. లాభాల్లో 50, 50 అంటాడు. మీకు ఓకే కదా అంటే.. అస్సలు ఓకే కాదు అంటుంది తులసి. ఇప్పుడిప్పుడే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటుంది తులసి. దీంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈలోపు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్.

మరోవైపు అనసూయకు కాళ్ల నొప్పులు ఉండటంతో ఈ ఆయిల్ తో మర్దన చేద్దురు కానీ.. ఒక సారి రూమ్ లోకి వస్తారా అని పరందామయ్యను అడుగుతుంది. దీంతో నా పొట్ట కదలకుండా చేసే పనులు చెప్పు అంటాడు. తులసి ఎక్కడ ఉంది అని అడుగుతుంది.

దీంతో తులసి ఆఫీసుకు వెళ్లింది అంటాడు. ఇవన్నీ విన్న లాస్య వెంటనే వచ్చి నేను మర్దన చేస్తా అత్తయ్య అంటుంది లాస్య. దీంతో వద్దులే తల్లి నేను రాసుకుంటానులే అంటుంది కానీ.. లాస్య వినదు. వెంటనే కింద కూర్చొని అనసూయ కాళ్లు పట్టడం స్టార్ట్ చేస్తుంది.

వద్దన్నా వినకుండా తెలిసీ తెలియని మసాజ్ చేస్తుంది. దీంతో అనసూయకు చుక్కలు కనిపిస్తాయి. ఇవన్నీ అందరూ చూసి నవ్వుకుంటారు. మరోవైపు తులసి ఒక బుక్ స్టాల్ కు వెళ్తుంది. అక్కడ ఏం కావాలి అని అడుగుతాడు బుక్ షాప్ అతడు. దీంతో స్టూడెంట్స్ ఉన్నారని చెప్పదు.

తర్వాత తన కొడుకు కోసం ఇంగ్లీష్ నేర్చుకునే బుక్ కావాలి అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

54 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago