Guppedantha Manasu 16 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 661 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు రిషి, మరోవైపు వసుధార ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటారు. నుదిటి రాతలు ఎలా ఉన్నాయో ఏంటో.. మనం ఏం చేయగలం రిషి సార్ అని అనుకుంటుంది వసుధార. ఈ దూరం ఇంకా ఎన్నాళ్లు. మనం చేరుకునే రోజు.. త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను సార్ అని అనుకుంటుంది. దూరం ఇంత భారమా వసుధార. ఈ భారాన్ని భరించడం నా వల్ల కాదు. కావట్లేదు అని అనుకుంటాడు రిషి. మరోవైపు రిషి రింగ్, తాళిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రిషి లాప్ టాప్ ఓపెన్ చేసి ఏదో చూడబోయి మళ్లీ లాప్ టాప్ ను క్లోజ్ చేస్తాడు. అంతిమ నిర్ణయానికి సమయం వచ్చేసింది అని అనుకుంటాడు రిషి.
కట్ చేస్తే తెల్లవారుతుంది. వసుధార నిన్ను నువ్వు శిక్షించుకున్నావా? లేక నాకు శిక్ష వేశావా? అర్థం కావడం లేదు. ఇక నువ్వు నా ఇంటికి, నా జీవితంలోకి రావా అని అనుకుంటాడు రిషి. జగతి.. రిషిని చూస్తుంది. రిషి అని పిలుస్తుంది. నువ్వు పంపిన మెయిల్ చూశాను అంటుంది జగతి. కానీ.. రిషి ఏం మాట్లాడడు. దీంతో జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా దేవయాని వస్తుంది. రిషిని చూస్తుంది. జగతితో ఏం మాట్లాడుకుండా డైరెక్ట్ గా రిషి దగ్గరికి వెళ్తుంది. కాఫీలు ఇచ్చి రిషిని మంచి చేసుకోవాలని చూస్తుందా జగతి అని అనుకుంటుంది. నాన్నా రిషి ఏదో మాట్లాడాలన్నావు అంటుంది. దీంతో అవును పెద్దమ్మ. ఇప్పుడు మన కాలేజీ ఫ్యాకల్టీ ఇంటికి వస్తారు. వాళ్లతో మీరు మాట్లాడాలి అంటాడు రిషి. ఏం మాట్లాడాలి. వాళ్లు ఎందుకు మన ఇంటికి వస్తున్నారు రిషి. అంటే వచ్చాక మీకే తెలుస్తుంది పెద్దమ్మ అంటాడు రిషి.
కాలేజీలో రిషి, వసుధార గురించి మాట్లాడిన ఇద్దరు లెక్చరర్స్ రిషి ఇంటికి వస్తారు. దేవయాని వాళ్లకు క్లాస్ పీకుతుంది. రిషి, వసుదార గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారట. ఎదుటి వాళ్లు ఎలా ఫీల్ అవుతారో అని ఒక మాట అనే ముందు ఆలోచించాలి కదా అంటుంది దేవయాని.
ముందు వెనుక ఆలోచించాలి కదా అంటుంది దేవయాని. మీరు కాలేజీలో లెక్చరర్స్ గా పని చేస్తున్నప్పుడు ఆదర్శంగా ఉండాలి కదా. స్టూడెంట్స్ కు ఆదర్శంగా ఉండాలి. రిషి ప్లేస్ లో వేరే ఎవరు అయినా ఉంటే వెంటనే మీ ఉద్యోగం పీకేసేవారు అంటుంది దేవయాని.
దీంతో మాది పొరపాటు అయింది. ఈ సారికి వదిలేయండి అంటారు లెక్చరర్స్. వీళ్లను పిలిపించి అనడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. వసుధార ఇక్కడ లేదు కదా అని జగతి అంటుంది. దీంతో వసుధార ఇక్కడ లేకపోవచ్చు కానీ.. ఇంకో ఆడపిల్లకు అలా జరగకూడదు అని అంటాడు రిషి.
నేనే వీళ్లను పురమాయించి ఇప్పుడు ఇలా తిడుతుంటే ఇప్పుడు వీళ్లకు నా మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది కావచ్చు అని అనుకుంటుంది దేవయాని. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోతారు. కట్ చేస్తే వసుధార.. చక్రపాణికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. దీంతో ఆయన ఏడుస్తుంటాడు.
నాన్న ఎంటి నాన్న ఇది అని అంటుంది. దీంతో దేవుడు గొప్పవాడమ్మా. ఏడుపునకు అయినా సంతోషానికి అయినా ఒకటే కన్నీళ్లు ఇస్తాడు అంటాడు. వసుధార విషయంలో మనం ఒక నిర్ణయానికి రావాలి అంటాడు చక్రపాణి. దీంతో మనం కాదండి.. ఆ దేవుడే భవిష్యత్తు నిర్ణయించాలి అంటుంది సుమిత్ర.
చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్నిసార్లు తినిపించలేదు నాన్న అంటుంది వసుధార. నీ బ్యాగు పక్కన ఒక కవర్ ఉంటుంది తీసుకురా అంటాడు. ఇందులో టికెట్ ఉంది. నువ్వు వెళ్లు అమ్మ అంటాడు. ఎక్కడికి అంటే నీ వెలుగు ఎక్కడ ఉందో.. నీ భవిష్యత్తు ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లు అంటాడు చక్రపాణి.
రిషీంద్ర భూషణ్ దగ్గరికి వెళ్లు. మమ్మల్ని క్షమించు అమ్మ. నిన్ను పిలవాలనిపిస్తే పిలువు. మేము వచ్చి నాలుగు అక్షింతలు వేసి సంతోషిస్తాం. లేదు.. పెళ్లి చేసుకున్నాం నాన్న అని ఫోన్ చేసి చెప్పు. ఆరోజు సంతోషంగా నా కూతురుకు పెళ్లి అయింది అని గర్వంగా చెప్పుకుంటాను అంటాడు.
మట్టిలో మాణిక్యంలా ఈ ఊళ్లో పుట్టావు. నువ్వు ఎదుగుతానంటే అస్సలు ఎదగనీయలేదు. అయినా ధైర్యంగా వెళ్లి చదువులో గెలిచావు. ప్రేమలో గెలిచావు. వెళ్లమ్మా.. నీకోసం రిషి సార్ ఎదురు చూస్తుంటారు. వెళ్లమ్మా అంటాడు చక్రపాణి. మరోవైపు రిషి.. బ్యాగు పట్టుకొని రావడంతో అందరూ షాక్ అవుతారు.
వెళ్తున్నాను పెద్దమ్మ అంటాడు రిషి. వెళ్లడం ఏంటి రిషి అంటాడు మహీంద్రా. అందరినీ వదిలేసి వెళ్లడం కరెక్టా అంటుంది దేవయాని. దీంతో ఏ బంధం ఎన్నాళ్లో ఎవరికి తెలుసు చెప్పండి. కొన్నాళ్లు నేను అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నా అంటాడు రిషి.
ఏదో జరిగింది అంత మాత్రాన వెళ్లిపోవడం ఏంటి. పారిపోతున్నావా రిషి అంటాడు మహీంద్రా. దీంతో మనుషుల నుంచి పారిపోగలను కానీ.. నా మనసు నుంచి నేను ఎలా పారిపోగలను డాడ్ అంటాడు. ఎవరో మోసం చేశారని అంటుంది దేవయాని. దీంతో ఎవరో మోసం చేశారని పారిపోయేంత పిరికివాడిని కాదు అంటాడు రిషి.
నేను ఒక రకమైన నిస్తేజంలో ఉన్నాను. ఇది పోవాలంటే నన్ను నేను శిల్పంలా కొత్తగా చెక్కుకోవాలి అంటాడు రిషి. శిల్పిని నేనే అంటాడు. నువ్వు వెళ్తే కాలేజీని ఎవరు చూసుకుంటారు రిషి అంటే.. నా తర్వాత కాలేజీని జగతి మేడమ్ చూసుకుంటారు అంటాడు రిషి.
జగతినా అంటుంది దేవయాని. రిషి.. దానికి సంబంధించి మెయిల్ చేశాను అంటాడు రిషి. మరి మినిస్టర్ గారు ఊరుకుంటారా అంటే ఆయనకు కూడా మెయిల్ చేశాను. ఆయన ఓకే అన్నారు అంటాడు రిషి. వెళ్లడం అవసరమా అంటాడు మహీంద్రా.
నా గుండె బరువును నేను మోయలేకపోతున్నాను. నన్ను నేనే కొత్తగా చూసుకుంటున్నట్టు ఉంది అంటాడు. గౌతమ్ దగ్గరికి వెళ్తావా అంటే నేను ఎవరో తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాను అంటాడు రిషి. మళ్లీ కొత్తగా పుడతాను. తిరిగి వస్తాను అంటాడు రిషి.
ఎప్పుడొస్తావు.. అంటే ఏమో వస్తానో రానో నాకే తెలియదు అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.