Intinti Gruhalakshmi 17 March Today Episode : దివ్య ఫుడ్ వేస్ట్ చేయడంతో తులసి సీరియస్.. దివ్యను కొట్టడంతో అందరూ షాక్.. ప్రేమ్ కు మరో ఎదురుదెబ్బ

Intinti Gruhalakshmi 17 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 582 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేనేజర్.. లోన్ కోసం ఆఫీసర్ ను తీసుకొస్తాడు. తులసి.. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసిన బ్యాంక్ మేనేజర్.. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ మీద లోన్ ఉంది కదా అంటాడు మేనేజర్. మాకు అడిషనల్ లోన్ కావాలి అంటాడు మేనేజర్. దీంతో కుదరదు అంటాడు. వీళ్లు అలాగే అంటారు మేడమ్ తర్వాత.. మనం పర్సనల్ గా మాట్లాడితే వాళ్లే లోన్ ఇస్తారు.. అంటాడు మేనేజర్. కాకపోతే మనం కొన్ని డాక్యుమెంట్ల విషయంలో తప్పుడుగా వెళ్లాల్సి వస్తుంది అంటాడు. అలా అయితే వద్దు లెండి అంటుంది తులసి.

intinti gruhalakshmi 17 march 2022 full episode

మరోవైపు దివ్య కోసం నందు కేఫ్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. డెలివరీ బాయ్ వెళ్లి ఆర్డర్ చెబుతాడు. దానికి అయ్యే డబ్బు 8000 మీరే కడతారని లాస్య మేడమ్ చెప్పింది అంటాడు డెలివరీ బాయ్. దీంతో నందుకు చిరాకు వస్తుంది. సరే.. అని చెప్పి ఆ డబ్బు తానే కట్టి ఆర్డర్ పంపిస్తాడు. లాస్య మీద నందుకు చిరాకు వేస్తుంది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా లాస్య ఇలా చేసిందేంటి అని బాధపడతాడు నందు. లాస్యకు వంట రాకపోవడం వల్ల నాకు 8000 బొక్క అనుకుంటాడు.

మరోవైపు తులసి మరో బ్యాంక్ మేనేజర్ తో లోన్ విషయమై మాట్లాడుతుంది. ఆయన కూడా కుదరదు అన్నట్టుగానే మాట్లాడుతాడు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. మరోవైపు ప్రేమ్.. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అవకాశం కోసం వెళ్తాడు.

ఓ మ్యూజిక్ డైరెక్టర్ ను కలుస్తాడు. పాటలు రాస్తాను.. గిటార్ వాయిస్తాను అంటాడు. పాటలు పాడుతాను అంటాడు ప్రేమ్. దీంతో ఆఫీసులో ఆ పని ఈ పని అన్నీ చేయి.. ఆ తర్వాత చూద్దాం అంటాడు. ఆ పని ఈ పని అంటే.. ఆఫీస్ బాయ్ గానా అంటాడు ప్రేమ్. లేదయ్యా.. డైరెక్ట్ గా నీకు మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తారు అంటూ హేళన చేస్తాడు.

దీంతో ఆత్మాభిమానం చంపుకొని నేను ఈ పని చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. ఇంటికి తులసి తిరిగి వస్తుంది. దివ్య, తన ఫ్రెండ్స్ ఫుడ్ వేస్ట్ చేయడానికి చూస్తుంది. అప్పుడే నందు కూడా వస్తాడు. అందరూ అక్కడికి వస్తారు.

Intinti Gruhalakshmi 17 March Today Episode : దివ్య ఫుడ్ వేస్ట్ చేయడం చూసి తులసి, నందు షాక్

ఏంటి ఇదంతా అంటుంది. కనిపిస్తలేదా.. మా ఫ్రెండ్స్ వచ్చారు. పుడ్ తిన్నాం. ఎక్కువైంది వదిలేశాం అని చెబుతుంది దివ్య. ఎందుకు ఇంత ఆర్డర్ చేశారు. తినకుండా వేస్ట్ చేశారు అని అడుగుతుంది. ఏదో కాస్త ఫుడ్ మిగిలిపోతే దాన్ని ఇంత ఇష్యూ చేయాలా అని అడుగుతుంది లాస్య.

పిల్లలకు మంచి చెడ్డలు తెలియనప్పుడు పెద్దవాళ్లు దగ్గరుండి నేర్పించాలి.. అంతే కానీ.. సపోర్ట్ చేయడం కాదు అంటుంది తులసి. దీంతో అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి మామ్ అంటుంది దివ్య. కావాలని మామ్ నన్ను ఇన్ సల్ట్ చేస్తుంది అంటుంది దివ్య.

ఏదో ఒక కారణంతో నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తోంది. కాదని చెప్పు అమ్మ అని నిలదీస్తుంది తులసి. ఎందుకు నువ్వు గింజుకుంటున్నావు. నీ డబ్బులు కాదు కదా. నేను మా డాడీ డబ్బులతో తెచ్చుకున్నాను. అర్థం అయిందా అని అంటుంది దివ్య.

దీంతో దివ్య చెంప చెళ్లుమనిపిస్తుంది. అంత పొగరు పెరిగిపోయిందా నీకు. నీ డబ్బులు, నా డబ్బుల, డాడీ డబ్బులు అంటూ వేరు చేసి మాట్లాడుతావా. ఇంకోసారి నీ నోట్లో నుంచి అటువంటి మాట రావాలి.. పళ్లు రాలగొడుతాను అంటుంది తులసి.

ఏంటి నందు ఇది.. నీ కూతురును కొడుతుంటే నువ్వు మాట్లాడవా అని అడుగుతుంది లాస్య. ఏంటి డాడీ ఇది.. మొన్న ప్రేమ్ అన్నయ్యను కొట్టింది. ఈరోజు నన్ను కొట్టింది. మేమేమన్నా చిన్నపిల్లలమా అంటుంది దివ్య. ఐ హేట్ యూ మామ్. నువ్వు అసలు నాకు నచ్చలేదు.. ఐ హేట్ యూ అంటుంది దివ్య.

గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య. దివ్యను కొట్టకుండా ఉండాల్సింది అంటుంది నందు. దివ్య ఫుడ్ వేస్ట్ చేయడం తప్పే.. దానికి నువ్వు అలా వైల్డ్ గా రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు అంటాడు నందు. ఇంట్లో ఎవ్వరూ నీకు ఎదురు తిరగకూడదా అని ప్రశ్నిస్తుంది లాస్య.

మామ్.. ఇదిగో నీ డబ్బులు అని తీసుకొచ్చి.. తన దగ్గర ఉన్న డబ్బులను అక్కడ విసిరేస్తుంది. చాలా.. ఇంకా కావాలా అని అడుగుతుంది దివ్య. నా ఫుడ్ కోసం డాడీ ఖర్చు పెట్టిన డబ్బులు. నా గురించి ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటుంది దివ్య.

మీ డబ్బులు ఖర్చు పెట్టించినందుకే కదా.. మీరు నాకు సపోర్ట్ చేయలేదు. ఇక నుంచి నాకు ఎవ్వరూ ఏదీ చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర డబ్బులు ఉంటేనే ఇక్కడ అన్నం తింటాను. లేకపోతే తినను.. పస్తులు ఉంటాను.. అలాగే చచ్చిపోతాను అంటూ ఆవేశంలో అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య.

కట్ చేస్తే.. బాబురావు.. ఆవేశంగా పరిగెత్తుకుంటూ వచ్చి శృతి ఇంటికి వెళ్తాడు. తన భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరేయ్ బాబు ఎక్కడ దాక్కున్నావురా బయటికిరా అంటుంది. నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా నువ్వే బయటికి వస్తావా.. లేక జుట్టు పట్టుకొని తీసుకురానా అంటుంది.

ఇంతలో శృతి అతడిని బయటికి తీసుకొని వస్తుంది. బయటికి తీసుకురాగానే చితక్కొట్టేస్తుంది బాబురావును. ఆంటి ఆగండి.. అని ఆపుతుంది శృతి. కానీ.. ఆమె వినదు. అప్పుడే ప్రేమ్ వస్తాడు. తనను ఆపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ.. తను ఆగదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

41 minutes ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

2 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

10 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

12 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

15 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

16 hours ago