Intinti Gruhalakshmi 17 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 17 అక్టోబర్ 2022, సోమవారం 765 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి కిచెన్ లో పని చేస్తుండగా వచ్చిన దివ్య.. మామ్ నీకు ఏదైనా పని చేయాలా అని అడుగుతుంది. ఏం వద్దులే.. నీ పని నువ్వు చూసుకో అంటుంది తులసి. ఈరోజు నీ కోడళ్లు నీకు పని చేయరు. ఎందుకంటే.. నిన్న నైటే వాళ్లను అలంకరించి లోపలికి పంపించావు కదా. వాళ్లు ఇంత త్వరగా నిద్ర లేస్తారా అని అడుగుతుంది దివ్య. అవును కదా.. అని అంటుంది తులసి. ఇక ఇవాళ నీకు నేనే దిక్కు అని చెబుతుంది దివ్య. ఇంతలో గుడ్ మార్నింగ్ ఆంటి అంటూ అక్కడికి వస్తుంది అంకిత. తనను చూసి దివ్య షాక్ అవుతుంది. అదేంటి అప్పుడే నిద్రలేచావా అని అడుగుతుంది దివ్య. మీరు ఇంత త్వరగా నిద్ర లేస్తే ఎలా.. అమ్మా నువ్వు ఒక పని చేయి. రాత్రి కాగానే వీళ్ల ఫోన్లను లాక్కో. లేదంటే వాళ్ల ఫోన్లను ముడుపు కట్టేసేయ్.. దెబ్బకు దారికొస్తారు అంటుంది దివ్య.
కట్ చేస్తే లాస్య.. అనసూయకు ఫోన్ చేస్తుంది. దేవుడు మా మీద పగబట్టాడు అంటుంది. మా బతుకేదో మేము బతుకుతున్నాం. పాత పగను మనసులో పెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడం ఏమైనా బాగుందా. మీ అబ్బాయి జాబ్ వదిలేశాడు అని చెబుతుంది లాస్య. ఈ వదిలేయడం పిచ్చి ఏంటి.. ఇంకా వదలదా? అని అంటుంది. దీంతో మీ కోడలుకు ఆఫీసులో ఉండటం నచ్చదు అనుకుంటా. సామ్రాట్ ను రెచ్చగొట్టి తులసి.. నందును తిట్టేలా చేసింది. దీంతో నందు ఉద్యోగానికి ఇక వెళ్లనని అంటున్నాడు అని అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని తులసి మీద అదీ ఇదీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లాస్య. ఆ తర్వాత ఎందుకు ఈ తులసి ఇలా చేస్తుంది అని అనుకుంటుంది అనసూయ.
ఇంతలో తులసి వచ్చి అత్తయ్య నేను బయటికి వెళ్లి వస్తా అంటుంది తులసి. దీంతో నాకెందుకు అమ్మా చెప్పడం అంటుంది అనసూయ. అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అంటుంది తులసి. ఎవరైనా చూస్తే కోడలును ఎంత అదుపులో పెట్టుకుందో అని అనుకోవాలా? అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లి చెట్లకు నీళ్లు పోస్తుంది అనసూయ.
ఇంతలో అభి అక్కడికి వస్తాడు. తులసి పూర్తిగా మారిపోయినట్టేనా. తులసి మీద ఆశలు వదులుకోవాల్సిందేనా అని అనుకుంటుంది అనసూయ. అభి వచ్చి నీతో మాట్లాడటానికి వచ్చాను అంటాడు అభి. దీంతో నేను ముసలిదాన్ని.. నాతో ఏముంటుందిరా మాట్లాడటం అంటుంది అనసూయ.
నువ్వు ఈ మధ్య ఎందుకు ఏదో కోల్పోయిన దానిలా ఉన్నావు అని అడుగుతాడు. ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా అంటాడు అభి. దీంతో ఈ ఇంటికి పెద్ద దిక్కు నేను కాదు తులసి.. అంటుంది. ఆఫీసులోనూ సామ్రాట్ నందును తిట్టేలా చేసిందట. దీంతో నందు ఉద్యోగం మానేశాడట అని చెబుతుంది.
దీంతో అభి బాధపడతాడు. ఈ విషయం నువ్వెందుకు అమ్మతో మాట్లాడవు అంటాడు. కానీ.. నేను చెబితే వినే పరిస్థితుల్లో లేదు. మీ తాతయ్య చెబితేనే వింటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే పరందామయ్యకు సామ్రాట్ కాల్ చేస్తాడు.
చెప్పు బాబు అంటాడు. మీ అరేంజ్ మెంట్స్ మీరు చేసేసుకోండి. మీరు చెప్పిన పని పూర్తి చేసేశాను అంటాడు సామ్రాట్. దీంతో చాలా థాంక్స్ బాబు అంటాడు పరందామయ్య. మీ లాంటి మనసు ఉన్న మామయ్య దొరకడం తులసి గారి అదృష్టం అంటాడు సామ్రాట్.
దీంతో కాదు బాబు దురదృష్టం. ప్రశాంతంగా ఉండవలసిన ఈ వయసులో జీవితంతో యుద్ధం చేస్తోంది. మీ పుణ్యమాని నాకు ఈరోజు నేను ఎంతో కొంత చేయగలుగుతున్నాను అని అంటాడు పరందామయ్య. ఆ తర్వాత బాబాయి వస్తాడు. ఆ రోజుకు ఎదురు చూస్తున్నాను అని అనుకుంటాడు సామ్రాట్.
ఎదురు చూస్తావు అంటూ హేళన చేస్తాడు. మొత్తం వినేశాను అంటాడు బాబాయి. నీ మనసులో మాట మాత్రం బయటపెట్టవా అంటాడు. దీంతో మనసులో మాట ఏంటి అంటాడు సామ్రాట్. పరందామయ్య గారి కంటే నువ్వు ఎక్కువగా మురిసిపోతున్నావు. దీని అర్థం ఏంటి అని అడుగుతాడు బాబాయి.
నీ మనసులో ఫీలింగ్స్ ఏంటో నీకే తెలియడం లేదు. కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఒప్పుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు బాబాయి. మరోవైపు ఆఫీసులో ఎక్కువ పని చేసి మంచి మార్కులు కొట్టేయాలని అనుకుంటుంది లాస్య. వెంటనే సామ్రాట్ క్యాబిన్ లోకి వెళ్తుంది.
నందు ఏడి.. నువ్వొచ్చి ఇవన్నీ నాకు చెబుతున్నావు. నందు ఎక్కడ అని అడుగుతాడు సామ్రాట్. దీంతో రాలేదు సార్ అంటుంది లాస్య. రాకపోవడం ఏంటి.. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా అంటాడు సామ్రాట్. జాబ్ మానేశాడు అంటుంది లాస్య.
దీంతో సామ్రాట్ టెన్షన్ పడతాడు. దీంతో నందు లేకపోతే నడవదు అనుకొని మళ్లీ నందును పిలుస్తాడు కావచ్చు అని అనుకుంటుంది లాస్య. కానీ.. నందు లాంటి వాళ్ల వళ్లే.. అందరి మీద నమ్మకం పోతోంది. జాబ్ కావాలన్నప్పుడు కాళ్లు పట్టుకుంటారు. ఇప్పుడేమో కనీసం చెప్పకుండానే మానేస్తారు అని అంటాడు.
కనీసం మర్యాద కోసమైనా నన్ను వచ్చి కలవాలని తెలియదా? ఆమాత్రం బాధ్యత లేదా అని అంటాడు సామ్రాట్. ఆ మాట నేను చెప్పాను సార్.. వినలేదు అంటుంది. నందు పనులు నేను చూసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంపెనీ రెప్యూటేషన్ నిలబెడతా అని చెప్పిన లాస్య బయటికి వెళ్లి కంపెనీ స్టాఫ్ తో సామ్రాట్, తులసి మధ్య సంబంధాన్ని అంటగడుతుంది.
ఇదంతా తులసి, సామ్రాట్ వింటారు. దీంతో కోపంతో సామ్రాట్ లాస్యపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.