Janaki Kalaganaledu 17 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 411 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఉంగరాన్ని చూసి జ్ఞానాంబ చాలా సంతోషిస్తుంది. ఆ ఉంగరం పోవడం వల్లనే ఇంట్లో సమస్యలు వచ్చాయని జ్ఞానాంబ అప్పట్లో బాధపడినట్టు గోవిందరాజు చెబుతాడు. అవునండి.. తులసి కోట కోసం మట్టి సర్దుతుండగా జారి మట్టిలో పడినట్టుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో మంచి మనసు ఉన్నవాళ్లు ఏ పని చేసినా మంచే జరుగుతుంది. ఇప్పుడు జానకి విషయంలో అదే జరిగింది అని అంటాడు గోవిందరాజు. దాని క్రెడిట్ అంతా నాది అని మనసులో అనుకుంటుంది మల్లిక. ఆ తర్వాత జానకిని పిలిచి ఈ తులసి కోటను నువ్వే సెట్ చేయి అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. అందరూ వెళ్లిపోయాక ఏంటి జానకి గారు ఇది మీరు ఎందుకు ఇలా మల్లికను వెనకేసుకొస్తున్నారు అంటాడు రామా.
దీంతో ఏమని చెప్పాలి చెప్పండి. మల్లిక ఇదంతా కావాలని చేసింది అంటే అత్తయ్య గారు ఊరుకుంటారా అంటుంది జానకి. అసలే కడుపుతో ఉంది. తను కడుపుతో ఉంది అని కూడా ఆలోచించకుండా మల్లిక విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎలా అని అంటుంది జానకి. ఆ తర్వాత మల్లిక దగ్గరికి వెళ్లి తనకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది జానకి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడ విష్ణు ఉన్నా కూడా అతడితో మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ ఆ ఉంగరాన్ని ధరించి సంతోషిస్తుంది.
ఇంతలో జానకి కాలేజీ ప్రిన్సిపల్ ఇంటికి వచ్చి జానకికి కొన్ని పుస్తకాలు ఇస్తుంది. నువ్వు మంచి ర్యాంక్ సాధించి మా ఇన్ స్టిట్యూట్ కు గొప్ప పేరు తీసుకొని రావాలి. సొసైటీకి నీలాంటి గొప్ప వ్యక్తి పోలీస్ అవడం చాలా ముఖ్యం. నువ్వు ర్యాంక్ సాధిస్తే నీతో పాటు మా ఇన్ స్టిట్యూట్ కు కూడా పేరు వస్తుంది.. అని చెప్పి వెళ్లిపోతుంది ప్రిన్సిపల్.
నువ్వు ఎలాగైనా సాధించాలి అని అంటుంది జ్ఞానాంబ. నువ్వు ఎలాగైనా సాధిస్తావమ్మా.. వెళ్లు వెళ్లి చదువుకో అంటాడు గోవిందరాజు. ఇదంతా విన్న మల్లిక.. నేను నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ ను కానివ్వను.. అని మనసులో అనుకుంటుంది మల్లిక. మరోవైపు జానకి చదువుకుంటూ ఉంటుంది.
జెస్సీ బట్టలు మడతపెడుతుండగా తనకు కడుపులో ఏదో అవుతుంది. కడుపులో నొప్పి వచ్చినట్టుగా అవుతుంది. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో అక్కా అంటూ గట్టిగా అరుస్తుంది. జానకి దగ్గరికి వస్తుంది. కడుపునొప్పిగా ఉంది అని అంటుంది. దీంతో ఒక్కనిమిషం నువ్వు కూర్చో.. హాస్పిటల్ కు వెళ్దాం అని చెప్పి రామాకు ఫోన్ చేస్తుంది జానకి.
రామా కొట్టులో ఉంటాడు. జెస్సీ కొంచెం తట్టుకో అంటుంది జానకి. రామా గారు జెస్సీకి కడుపులో నొప్పి ఉందట. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అంటుంది. దీంతో అవునా నేను వస్తున్నాను అంటాడు. దీంతో నేను జెస్సీని తీసుకొని హాస్పిటల్ కు వెళ్తున్నా.. మీరు అట్నుంచి అటే హాస్పిటల్ కు రండి అంటుంది జానకి.
దీంతో తనను హాస్పిటల్ కు తీసుకెళ్తుంది జానకి. అప్పుడే రామా కూడా వస్తాడు. జెస్సీని టెస్ట్ చేస్తుంది డాక్టర్. కడుపులో బిడ్డకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అటువంటప్పుడు పుట్టే బిడ్డ ఎలా పుడుతుందో చెప్పలేం అని జానకితో చెబుతుంది డాక్టర్.
బిడ్డ పుట్టాక ఆ ప్రాబ్లమ్ బట్టి ట్రీట్ మెంట్ ఇవ్వగలిగితే తను పెరుగుతున్న కొద్దీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటుంది. ఈ విషయం జెస్సీకి చెప్పకండి అంటుంది డాక్టర్. ఎవ్వరికీ తెలియనీయకండి అంటుంది. ముఖ్యంగా మా అత్తయ్య గారికి అంటుంది జానకి.
దీంతో సరే అంటుంది. ఏదైనా అర్జెంట్ అయితే నేనే మీ ఇంటికి వస్తాను అంటుంది డాక్టర్. ఉన్న సమస్యలు చాలవని ఇప్పుడు కొత్త సమస్య వచ్చి చేరింది అని అంటాడు రామా. జానకి, రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం తెలిస్తే జ్ఞానాంబ ఎలా బాధపడుతుందో అని టెన్షన్ పడతారు.
మనం ఎన్నాళ్లు ఈ విషయాన్ని దాచగలం. ఏదో ఒక రోజు ఈ విషయం గురించి తెలిస్తే అమ్మ ఎలా తట్టుకుంటుంది అని బాధపడతాడు రామా. ఈ విషయం ఇంట్లో వాళ్లతో పాటు జెస్సీకి కూడా తెలియకూడదు. ఎవ్వరికీ తెలియకుండానే ఈ విషయాన్ని మనం పరిష్కరించాలి రామా గారు అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.