Intinti Gruhalakshmi 18 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 18 అక్టోబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1078 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య.. రౌడీలకు ఫోన్ చేసి ముసలివాళ్ల ప్రాణాలు తీసేయండి అని చెబుతుంది. దీంతో సడెన్ గా ఇంకో ఆవిడ వచ్చింది అంటే… దాని దురదృష్టం. దాన్ని కూడా వేసేయండి. త్వరగా పని ముగించేయండి అని చెబుతుంది లాస్య. దీంతో వెంటనే రౌడీలు పరందామయ్య, అనసూయను చంపేందుకు కత్తి పట్టుకొని వస్తుంటారు. మరోవైపు ఇంట్లో దొంగలు పడ్డారని రాములమ్మకు చెప్పి ముగ్గురు కలిసి దొంగలను వెతుకుతూ ఉంటారు. మరోవైపు కారులో ఇంటికి బయలుదేరుతారు తులసి, నందు, హనీ. ఇంటికి వెళ్లేందుకు ఇంకెంత సమయం పడుతుంది అని అడుగుతుంది తులసి. నువ్వు ఎందుకు అంత ఆరాటపడుతున్నావు. అర్జెంట్ గా ఇంటికి వెళ్లాలని రెస్టారెంట్ లో గొడవ పడ్డావు. ఏమైంది అసలు.. ఎందుకలా. నాతో చెప్పకూడదా? లేక చెప్పకూడనిదా? అంటాడు నందు. దీంతో తెలుసుకొని చేయగలిగింది ఏం లేదు. అది మా ఫ్రెండ్ సమస్య. మీకు సంబంధం లేనిది అంటుంది తులసి.
మరోవైపు టార్చిలైట్ వెలుగులో వెతుకుతూ ఉంటారు. ఇంతలో మిల్క్ అంటూ పాలబ్బాయి వస్తాడు. ఈ టైమ్ లో పాలు ఏంటి బాబు.. మేము ఆర్డర్ చేయలేదు కదా అంటే.. తులసి మేడమ్ ఆర్డర్ చేశారు అంటారు. ఇంతలో ఫ్రూట్స్ అంటారు. ఎవరు ఆర్డర్ చేశారు అంటే తులసి మేడమ్ ఆర్డర్ చేశారు అంటారు. ఇంతలో రైస్ బ్యాగ్ అంటూ మరో వ్యక్తి వస్తాడు. ఇంతలో కంది పప్పు అని ఒకరు, ఎగ్స్ అని ఇంకొకరు వస్తారు. ఓవైపు వాళ్లను చంపాలని చూస్తుంటే వీళ్లంతా వచ్చారు ఏంటి.. వెళ్లిపోదాం అని అక్కడి నుంచి దొంగలు పారిపోతారు. ఇంతలో తులసి వస్తుంది. అత్తయ్య, మామయ్య ఎలా ఉన్నారు.. అని అడుగుతుంది. వంటింట్లో దొంగలు ఉన్నారమ్మ అని చెబుతుంది రాములమ్మ. దీంతో లోపలికి వెళ్తుంది. ఎవరూ లేరు మామయ్య అంటుంది. బయట ఉన్న వాళ్లను చూసి బయట ఆ ఆర్డర్ వాళ్లు ఏంటి అని నందు అడుగుతాడు. దీంతో నేనే ఆర్డర్ చేశాను అని వాళ్లందరికీ డబ్బులు ఇచ్చి పంపిస్తుంది.
అసలు ఈ టైమ్ లో ఇవన్నీ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏంటి.. అంటే, సమయానికి సరుకులు లేవు కదా. అందుకే ప్రమాదం తప్పింది అంటుంది. ఇంతలో మళ్లీ లాస్య ఫోన్ చేస్తుంది తులసికి. రెండు ప్రాణాలను కాపాడుకున్నావు. కంగ్రాచ్యులేషన్స్. ఎంత కాలం ఇలా. హనీని తిరిగి అప్పగించేంత వరకు రోజూ ఇలాంటి గండాలు ఎదురవుతూనే ఉంటాయి. నాకు తిక్కలేసిన రోజున గుట్టుచప్పుడు కాకుండా లేపేస్తా.. అది ఏ రోజో నాకే తెలియదు అంటుంది లాస్య.
కొద్దిగా అయినా మానవత్వంతో ఆలోచించు. మనిషిగా ప్రవర్తించు అంటుంది తులసి. వణకు మొదలైందా? లాస్య అంటే ఏంటో తెలిసి వచ్చిందా అంటుంది లాస్య. దీంతో చేసిందే దుర్మార్గం. దాన్నే గర్వంగా చెప్పుకుంటున్నావా అంటుంది తులసి.
ఈ సమాజంలో బతకగలిగేవాళ్లు నీ లాంటి వాళ్లు కాదు.. నా లాంటి వాళ్లు అంటుంది లాస్య. దీంతో అవును సమాజానికి కావాల్సింది మంచివాళ్లు మాత్రమే కాదు.. చెడ్డవాళ్లు కూడా అంటుంది తులసి. నువ్వు ఎంతలా వెంటపడ్డా తులసి నీ మాట వినదు. తల వంచదు. నా ప్రాణాలను అడ్డు వేసి అయినా నా వాళ్లను కాపాడుకుంటాను అంటుంది తులసి. లాస్యను ఎలా ఆపాలి.. ఎలా అడ్డుపడాలి అని ఆలోచిస్తుంది తులసి.
మరోవైపు మీతో మాట్లాడాలి అని దివ్య.. జాను తండ్రిని అడుగుతుంది. జానుకు పెళ్లి ఈడు వచ్చింది. ధ్యాస పెళ్లి మీదికి మళ్లింది.. అని అంటుంది. దీంతో నీకు చెప్పిందా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. దీంతో ఆడపిల్లలు అందరూ అన్నీ చెప్పరు. కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకోవాలి అని చెబుతుంది.
నేను సలహా ఇవ్వడానికి రాలేదు. ఏకంగా సంబంధమే తీసుకొచ్చాను. తీసుకోండి.. అని అబ్బాయి ఫోటో చూపిస్తుంది దివ్య. సంబంధం చూడమని మేము చెప్పామా అంటుంది జాను తల్లి. జానుకు తన బావ అంటే ఎంత ఇష్టమో.. నాకు జాను అంటే అంత ఇష్టం అంటుంది.
ఇంతలో జానను వచ్చి అబ్బాయిల ఫోటోలను చింపేస్తుంది. దివ్య మొహం మీద కొడుతుంది. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పొచ్చు కదా అంటే.. నాకు నచ్చనిది ఫోటోలోని అబ్బాయి కాదు. నీ పద్ధతి. ఎవరిని అడిగి నువ్వు సంబంధం తీసుకొచ్చావు అంటే.. సంబంధం తీసుకొచ్చింది దివ్య కాదు నేను అంటాడు విక్రమ్.
నాకు తెలిసిన వాళ్ల సంబంధం. కుర్రోడు మంచోడు. మంచి ఫ్యామిలీ. ఈ సంబంధం సెట్ అయితే జాను సుఖపడుతుంది అంటాడు విక్రమ్. దీంతో ఇప్పుడు నా సుఖానికి వచ్చిన సమస్య ఏం లేదు. నా మొగుడిని నేను చూసుకోగలను అంటుంది జాను.
ఆ తర్వాత తులసి ఇంట్లో సేఫ్టీ కోసం సీసీకెమెరాలు ఫిక్స్ చేయిస్తుంది. ఇప్పుడు ఎందుకు అని అడుగుతాడు నందు. దీంతో అవసరాలు చెప్పిరావు కదా అంటుంది తులసి. సీసీ కెమెరాలు ఎందుకు ఫిక్స్ చేయిస్తోంది తులసి అని నందుకు డౌట్ వస్తుంది.
మరోవైపు జానుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయిస్తారు విక్రమ్, దివ్య. కానీ.. ఆ సంబంధాన్ని కావాలని జాను చెడగొడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.