Home » Entertainment » Intinti Gruhalakshmi 19 July 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 19 July Today Episode : సామ్రాట్ కు షాకిచ్చిన తులసి.. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన హనీ.. తులసి వల్లే ఇదంతా జరిగిందని సామ్రాట్ షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: July 19, 2022, 9:45 am
Advertisement

Intinti Gruhalakshmi 19 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 688 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యకు దొరికిన చైన్ ను తీసుకొచ్చి తులసికి ఇస్తుంది. దీంతో వెంటనే ఆ చైన్ సామ్రాట్ కు ఇచ్చి వస్తా అని చెబుతుంది తులసి. దీంతో వద్దు అంటారు కానీ.. వినదు. ఆ చైన్ ఇవ్వడం కోసం వెళ్తుంది తులసి. మరోవైపు తులసి.. సామ్రాట్ ఇంటికి వస్తుంది. సామ్రాట్ తనను చూసి షాక్ అవుతాడు. ఆమెను లోపలికి పంపించు అంటాడు సామ్రాట్. తను లోపలికి వస్తుంది. నాకు కావాల్సింది నువ్వు రావడం కాదు. హనీ గొలుసు తెచ్చివ్వడం అంటాడు సామ్రాట్. దీంతో తన బ్యాగ్ లో నుంచి గొలుసు తీసి సామ్రాట్ కు ఇస్తుంది. అది భయం అంటే అలా ఉండాలి అంటాడు. దీంతో నేను భయపడి నీకు గొలుసు ఇవ్వడానికి రాలేదు అంటుంది. నాకు దొరికింది కాబట్టి తెచ్చి ఇచ్చాను అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 19 july 2022 full episode

దీంతో ఎక్కడ దొరికింది.. గార్డెన్ లో దొరికింది అంటావా అంటాడు సామ్రాట్. దీంతో అదే నిజం. నీకు మనుషులను బొత్తిగా నమ్మవు కావచ్చు అంటుంది. నాకు నిజంగా దొంగ బుద్ధే ఉంటే ఆ గొలుసు తెచ్చి ఇచ్చేదాన్నే కాదు. ఇప్పటికైనా మారండి. మనిషిలా ఉండండి.. అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తెలివిగా మాట్లాడి తప్పించుకుందామనుకుంటున్నావేమో.. ఈసారి రెడ్ హ్యాండెడ్ గా నిన్ను పట్టుకుంటా అని అనుకుంటాడు సామ్రాట్. మరోవైపు హనీ.. తులసి డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. దీంతో తన డ్రాయింగ్ ఆపేసి బుక్ ను పక్కన పెట్టేస్తుంది. నిన్ను పంజరంలో చిలకలా పెంచడానికి ఒక కారణం ఉంది అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత వేరే కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్.

Advertisement

మరోవైపు సంజన ఇంటికి వెళ్తుంది తులసి. కానీ.. పిల్లలు ఉండరు. ఎక్స్ కర్సన్ వెళ్లారని చెబుతుంది. ఈ మధ్య రావడం లేదేంటి.. అని అడుగుతుంది సంజన. కొంచెం పని ఉండి రావడం లేదు అంటుంది తులసి. ఆ తర్వాత నీ మ్యూజిక్ స్కూల్ ఏమైంది అని అడుగుతుంది సంజన. దీంతో ఇంకా ఏ స్కూల్ దొరకలేదు అని అంటుంది తులసి. దీంతో నాకు తెలిసిన డ్యాన్స్ స్కూల్ ఒకటి ఉంది. నేను వాళ్లతో మాట్లాడుతా అని వెంటనే ఫోన్ చేసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడుతుంది సంజన. దీంతో తులసి సంతోషిస్తుంది.

Intinti Gruhalakshmi 19 July Today Episode : మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో శృతిని చూసి ప్రేమ్ షాక్

మరోవైపు ప్రేమ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వస్తుంటాడు. ఇంతలోనే పేపర్ లో ప్రేమ్, శృతి ఫోటోను చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. అంటే నువ్వు ప్రేమ్ భార్యవా అని అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి శృతిని చూసి షాక్ అవుతాడు.

Advertisement

ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి ప్రేమ్, శృతి వెళ్లిపోతారు. కోపంతో పేపర్ ను చింపేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత డ్యాన్స్ స్కూల్ కు సంజనతో కలిసి వస్తుంది తులసి. అక్కడే ఉన్న హనీ..తులసిని చూసి హాయ్ తులసి ఆంటి అంటుంది. హనీ గొంతులా ఉందేంటి అని అనుకుంటుంది.

హనీని అక్కడ చూసి షాక్ అవుతుంది తులసి. పైకి రానా అని అంటుంది తులసి. దీంతో వద్దు వద్దు నేను వస్తున్నా. లిఫ్ట్ ఉంది అంటుంది. లిఫ్ట్ ఎక్కి అందులో ఇరుక్కుపోతుంది హనీ. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో లిఫ్ట్ లోనే ఇరుక్కుపోతుంది హనీ. దీంతో తులసి టెన్షన్ పడుతుంది.

ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. థర్డ్ క్లాస్ హనీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది అని అందరూ అంటుంటే టెన్షన్ పడతాడు. తులసిని అక్కడ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి