Intinti Gruhalakshmi 20 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జనవరి 2023, శుక్రవారం ఎపిసోడ్ 847 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పెషల్ క్లాస్ ఉంది వెళ్లాలి అని పార్టీ డ్రెస్ వేసుకొని తులసి దగ్గరికి వెళ్తుంది దివ్య. స్పెషల్ క్లాసా.. ఎప్పుడూ లేని స్పెషల్ క్లాస్ ఇప్పుడేంటి.. అయినా స్పెషల్ క్లాస్ కు ముందే చెబుతారు కదా. అయినా ఈ డ్రెస్ ఏంటి అని ప్రశ్నలు అడుగుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు దివ్యకు. వెంటనే లాస్య వచ్చి స్పెషల్ క్లాస్ అని చెబుతోంది కదా.. వెళ్తే ఏంటి సమస్య అని అంటుంది లాస్య. దీంతో సరే వెళ్లు అంటుంది తులసి. దీంతో థాంక్యూ లాస్య ఆంటి అని చెప్పి పార్టీకి వెళ్తుంది దివ్య.
వెంటనే పార్టీకి వెళ్తుంది దివ్య. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటుంది దివ్య. కూల్ డ్రింక్ తాగి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే.. తన ఫ్రెండ్స్ లో ఇద్దరు యువకులు తనకు మత్తు ట్యాబ్లెట్ వేసిన కూల్ డ్రింక్ ఇచ్చి తాగమంటారు. దీంతో ఆ డ్రింక్ ను తాగేస్తుంది దివ్య. మరోవైపు రాత్రి అయినా దివ్య ఇంకా రాలేదు ఏంటి అని దివ్యకు ఫోన్ చేస్తుంది లాస్య. దీంతో పార్టీలో ఉన్నాను. ఇంకో గంట పడుతుంది అని చెబుతుంది దివ్య. ఇంతలో దివ్య ఫ్రెండ్ వచ్చి నో ఫోన్స్ అంటూ ఫోన్ లాక్కొని టేబుల్ మీద పెట్టేస్తుంది.
మరోవైపు స్పెషల్ క్లాస్ కు వెళ్లిన దివ్య ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది తులసి. దివ్య ఇంకా రాలేదా అని అడుగుతుంది శృతి. దీంతో అవును అంటుంది. స్పెషల్ క్లాస్ కదా.. అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు అంటుంది.
లేట్ అవుతుందని ఫోన్ చేయలేదా ఆంటి అని అడుగుతుంది అంకిత. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కనీసం మెసేజ్ లు కూడా పెట్టడం లేదు అంటుంది తులసి. దీంతో నేను కాల్ చేస్తాను ఆంటి అంటుంది. ఫోన్ చేస్తుంది కానీ.. లిఫ్ట్ చేయదు.
రింగ్ అవుతున్నా ఆన్సర్ చేయడం లేదు అంటుంది అంకిత. దీంతో క్లాస్ లో ఉందేమో.. ఎలా ఎత్తుతుంది అంటుంది శృతి. దీంతో మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా అంటుంది తులసి. అక్కడ తన పొజిషన్ ఎలా ఉందో అంటుంది శృతి.
మరోవైపు దివ్యకు మత్తు ఎక్కుతూ ఉంటుంది. పార్టీ అయిపోయాక.. దివ్య క్యాబ్ బుక్ చేస్తూ ఉంటుంది. దివ్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు తన ఫ్రెండ్స్. దీంతో క్యాబ్ బుక్ చేస్తున్నా అంటుంది దివ్య.
ఈ సమయంలో క్యాబ్ సేఫ్ కాదు. కారులో వెళ్దాం పదా అంటారు. దీంతో వద్దులే అంటుంది దివ్య. మరోవైపు క్యాబ్ బుక్ కాదు దివ్యకు. మా కారులో బుక్ చేస్తాం పదా అంటారు తన ఫ్రెండ్స్. ఈ టైమ్ లో ఒక్కదానివి వెళ్లడం సేఫ్ కూడా కాదు అంటారు.
దీంతో సరే.. ఇంటి దాకా వద్దు. ఇంటికి కాస్త దూరంగా ఆపండి అంటుంది. దీంతో సరే అంటుంది. కారులో తనను ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. మరోవైపు ఇంట్లో వాళ్లంతా దివ్య కోసం ఎదురు చూస్తుంటారు.
ఎంత స్పెషల్ క్లాస్ అయినా ఇంత సేపు ఉండదు కదా అంటుంది అంకిత. దీంతో ఈరోజు ఎలాంటి స్పెషల్ క్లాస్ లేదట.. వాచ్ మెన్ కు ఫోన్ చేస్తే చెప్పాడు అంటాడు ప్రేమ్. మరోవైపు నందు ఎవరికో ఫోన్ చేస్తుంటాడు.
చిరాకులో ఉంటాడు. అప్పుడే లాస్య వస్తుంది. దివ్య ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ ఉందని చెప్పింది. గంటలో వస్తానని చెప్పింది. అమ్మ ఒప్పుకోదంటే.. స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పి పంపించాను అంటుంది.
దీంతో నిన్ను అంటూ తనను కొట్టబోతాడు. వెళ్లి తులసికి చెప్పుపో అంటాడు నందు. దీంతో నేను చెప్పను.. నువ్వే చెప్పు అని అంటుంది లాస్య. ఇంతలో నందు, లాస్య కిందికి దిగి.. తులసి దగ్గరికి వస్తారు.
నువ్వు నువ్వులా ఉండాలి. నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. వెనక్కి తగ్గడం వల్లనే ఈ తలనొప్పి అంటాడు నందు. తలనొప్పి ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది తులసి. దీంతో దివ్య స్పెషల్ క్లాస్ కు కాదు వెళ్లింది తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి అంటాడు నందు.
దీంతో మీకెలా తెలుసు. నాకెందుకు అబద్ధం చెప్పింది అని అడుగుతుంది తులసి. దీంతో లాస్య చెప్పింది అంటాడు నందు. అడిగితే పార్టీకి వెళ్లనివ్వు అని ఏడిస్తే అబద్ధం చెప్పు అని లాస్య ఎంకరేజ్ చేసింది అని నందు చెబుతాడు.
గంటలో వస్తానని చెప్పింది అందుకే ఓకే చెప్పాను అంటుంది లాస్య. దీంతో నోర్మూయ్.. నా పిల్లల విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరు అంటుంది తులసి. మరోవైపు రూట్ మార్చి కారును తీసుకెళ్తుంటారు.
పార్టీ ఎక్కడో చెప్పిందా అని అడుగుతారు. దీంతో పార్టీ లొకేషన్ పంపింది అని చెబుతుంది లాస్య. దీంతో ఆ లొకేషన్ కు వెళ్తారు ప్రేమ్, తులసి. ఇద్దరు కుర్రాళ్లు దివ్యను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని చెబుతాడు వాచ్ మెన్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.