
intinti gruhalakshmi 21 july 2022 full episode
Intinti Gruhalakshmi 21 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జులై 2022, గురువారం ఎపిసోడ్ 690 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్షణంలో పాప నీ ఒడిలో అంత ప్రశాంతంగా పడుకోవడానికి కారణం తులసి. పాప బతికి ఉండటానికి కారణం తులసి అని బాబాయి సామ్రాట్ తో చెబుతాడు. నువ్వు తనకు కిడ్నాపర్ అనే ముద్ర వేశావు. స్టేషన్ కు పంపించావు. ఇంటి మీద పడి రచ్చ రచ్చ చేశావు. ఇన్నాళ్లు నీతో గొడవ పడలేదు. నువ్వు పెట్టిన కష్టాలన్నీ మౌనంగా భరించింది. హనీకి యాక్సిడెంట్ అయినప్పుడు.. హాస్పిటల్ లో తనను జాయిన్ చేయించినప్పుడు పాపకు తల్లిగా రికార్డుల్లో రాయించింది. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో.. పరువు పోతుందేమో అని కూడా ఆలోచించలేదు. తను చేసిన త్యాగానికి వెల కట్టగలవా? కావాలని మన ఇంటి అడ్రస్ చెప్పకుండా హనీ ఊరంతా తిప్పించింది.
intinti gruhalakshmi 21 july 2022 full episode
ఈ మాట హనీనే స్వయంగా నాకు చెప్పింది అంటాడు బాబాయి. మరి.. హనీ నాకెందుకు చెప్పలేదు బాబాయి అంటాడు సామ్రాట్. దీంతో తను నీకు భయపడింది అంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు అంటాడు. దీంతో తను కోరుకున్నది ఇస్తాను. అడిగినంత డబ్బు ఇస్తాను అంటాడు సామ్రాట్. తులసి డబ్బు తీసుకోకపోతే అంటాడు బాబాయి. దీంతో తులసి డబ్బు మనిషి కాకపోవచ్చు కానీ.. మధ్య తరగతి కుటుంబాల గురించి నాకు తెలుసు.. అని చెప్పి హనీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్. మరోవైపు అంకిత దేని గురించో బాగా ఆలోచిస్తుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన తులసి.. పండగకు అభిని పిలుద్దామనుకుంటున్నాను. ఏం మాట్లాడవేంటి అని అడుగుతుంది తులసి.
దీంతో ఇందులో నేను మాట్లాడకపోవడానికి ఏం ఉంది ఆంటి. మీ అబ్బాయి.. మీ ఇల్లు.. మీ ఇష్టం అంటుంది అంకిత. మరి ఈ ఇంటితో నీకు, అభికి సంబంధం లేదా అంటుంది తులసి. దీంతో అభికి పిలువాల్సిన అవసరం లేదు ఆంటి. పిలిస్తేనే రావాల్సిన అవసరం లేదు. పిలవకున్నా రావాలి అంటుంది.
అయినా నేను వాడిని పిలిచేది నీకోసమే అంటుంది తులసి. అక్కర్లేదు అనే కదా అక్కడే ఉండిపోయాడు అంటుంది అంకిత. వాడు మొండివాడు.. వాడు మారడు. నువ్వే వాడిని మార్చుకోవాలి. వాడు గడప తొక్కేలా చేస్తాను. వాడు ఇక్కడే ఉండిపోయేలా చేసే బాధ్యత నీది అంటుంది తులసి.
దీంతో జరగని విషయం గురించి ఏం ఆలోచించినా వేస్ట్ ఆంటి అంటుంది. ప్రేమ్, శృతిని కూడా ఇక్కడికే వచ్చి ఉండమని పిలుద్దామనుకుంటున్నా అంటుంది. దీంతో వెంటనే ఆపని చేయండి అంటుంది. కట్ చేస్తే శృతి.. వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది. తన అత్తయ్య ఇంటికి వెళ్తుంది.
అర్ధరాత్రి పూట ప్రేమ్ ను వదిలేసి వచ్చావా అని వాళ్ల అత్తయ్య అడుగుతుంది. మొగుడు ఒక మాట అనగానే చెప్పాపెట్టకుండా బ్యాగు పట్టుకొని వచ్చావని ఆశ్చర్యపోతున్నాను అంటుంది. నా మీద నమ్మకం పోయింది అన్నాడు. నేను మోసం చేశాను అన్నాడు. నా కన్నీళ్లను నమ్మను అన్నాడు అంటుంది శృతి.
ఉదయం లేవగానే శృతి కనిపించదు ప్రేమ్ కు. ఎక్కడికి వెళ్లిందని చూస్తాడు. అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ లో తాను వెళ్లిపోతున్నట్టు చెబుతుంది శృతి. నన్ను అనుమానించావు.. అవమానించావు.. నన్ను దోషిని చేశావు.. అంటూ ప్రేమ్ ను ఉద్దేశించి రాస్తుంది శృతి.
ఇంతలో తులసి.. ప్రేమ్ కు ఫోన్ చేస్తుంది. బోనాల పండుగకు ఇంటికి రండి అని పిలుస్తుంది తులసి. మీరిద్దరూ ఇంటికి వచ్చేయండి. ఇక మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అంటుంది తులసి. దీంతో అలాగే అమ్మ.. ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాం అంటాడు ప్రేమ్.
కట్ చేస్తే సామ్రాట్ నుంచి తులసికి ఒక కవర్ వస్తుంది. అందులో ఏముందో అని చూస్తుంది తులసి. అందులో బ్లాంక్ చెక్ ఉంటుంది. దాన్ని చూసి తులసి షాక్ అవుతుంది. డబ్బుందని పొగరా? మనకు డబ్బు వాసన చూపిస్తే మనం పడిపోతామని ఆశ అని అంటాడు పరందామయ్య.
నువ్వు ఆ చెక్కు ఇప్పుడు తీసుకుంటావా అని అడుగుతుంది అనసూయ. తర్వాత సామ్రాట్ ఇంటికి వెళ్లి తన బ్లాంక్ చెక్ ను తనకు ఇచ్చేస్తుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.