Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!
Shadnagar Realtors Association Elections: షాద్‌నగర్ పట్టణంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఎన్నికల సందడి నెలకొంది. అధ్యక్ష పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించేలా ప్రచార కార్యక్రమాలు, అభ్యర్థుల హడావుడి, బ్యాలెట్ గుర్తుల కేటాయింపుతో పట్టణంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది…
Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!
అధ్యక్ష పీఠం కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీ
ఎన్నికల అధికారి పర్యవేక్షణలో అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పోటీదారులు తమ ప్యానెళ్ల తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సభ్యులను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రియల్టర్స్ వర్గాల్లో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది.
Also Read : Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!
రాజు గౌడ్ ప్యానెల్‌కు మద్దతు.. గెలిపించాలని పిలుపు
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, ఫ్యూచర్ సిటీ జిల్లా అధ్యక్షుడు రాజు గౌడ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్యానెల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తన ప్యానెల్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన రాజు గౌడ్, అసోసియేషన్ అభ్యున్నతి కోసం తమ ప్యానెల్‌ను బలపరిచి అభ్యర్థులను గెలిపించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటున్న నేపథ్యంలో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తుది ఫలితాల కోసం షాద్‌నగర్ రియల్టర్స్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.