
intinti gruhalakshmi 22 november 2021 episode highlights
Intinti Gruhalakshmi 22 Nov Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 22 నవంబర్, 2021, సోమవారం 483 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య.. తన కొడుకును తీసుకొచ్చి నందును డాడీ అని పిలవాలని చెప్పిన విషయం తెలిసిందే. లాస్య.. తన కొడుకును.. తీసుకొచ్చి.. నందును డాడీ అని పిలవాలని చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నందు కూడా చిరాకు పడుతాడు.
intinti gruhalakshmi 22 november 2021 episode highlights
దీంతో లాస్యకు కోపం వస్తుంది. మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నప్పుడు లక్కీ నిన్ను డాడీ అని పిలిస్తే నీకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతుంది లాస్య. అది కాదు లాస్య.. ఇప్పుడే డాడీ అని ఎందుకు.. ముందు అంకుల్ అని పిలవమను.. తర్వాత డాడీ అని పిలవచ్చు అంటాడు నందు. లక్కీ డాడీ అని పిలిచేసరికి.. నందు.. లక్కీని బెదిరిస్తాడు. దీంతో లక్కీ భయపడతాడు. నేను ఇక్కడ ఉండనమ్మా.. హాస్టల్ కు వెళ్లిపోతా అంటాడు లక్కీ. కానీ.. ఏం కాదు.. నందుయే నీ డాడీ.. నువ్వేం భయపడకు అని సర్దిచెబుతుంది లాస్య.
మరోవైపు.. తులసిని అనసూయ నిలదీస్తుంది. నందు అలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు.. అంటుంది. మేము కలవడం అసాధ్యం అత్తయ్య. మా దారులు వేరు. మేము ఇక ఎప్పటికీ కలవలేం అని చెబుతుంది తులసి. కానీ.. ఇంట్లో వాళ్లంతా లాస్య.. నందును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటారు.
ఇంట్లో వాళ్లంతా లాస్యతో మాట్లాడకూడదని అనుకుంటారు. లక్కీ గురించి నందు, లాస్య గొడవ పడుతుంటే మీరెందుకు జోక్యం చేసుకున్నారని శృతి, ప్రేమ్.. తులసిని అడుగుతారు. వాళ్ల గొడవలేదో వాళ్లు పడతారు కదా. మీకెందుకు మధ్యలో అంటూ వాళ్లు అంటారు.
మరోవైపు లక్కీ.. లాస్య మాట కన్నా.. తులసి మాటే ఎక్కువగా వినడం లాస్య తట్టుకోలేకపోతుంది. లాస్యతో పాలు కావాలని లక్కీ చెబుతాడు. తను తెచ్చి ఇచ్చే లోపే తులసి తెచ్చి ఇస్తుంది. థాంక్స్ ఆంటి అంటాడు లక్కీ. లాస్య.. తులసి తెచ్చిన పాలు లక్కీ తాగడం చూసి తట్టుకోలేకపోతుంది.
లక్కీ ఏం చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు. వాడు పాలు కావాలని నన్ను అడిగాడు. నేను తెచ్చి ఇచ్చేలోపే వాడిని మచ్చిక చేసుకోవాలని చూస్తున్నావా? అని తులసిని బెదిరిస్తుంది లాస్య. వీడు ఆకలితో బాధపడుతుంటే చూడలేక ఇచ్చాను అంటుంది తులసి.
అంటే నేను కొడుకంటే ప్రేమలేని తల్లినని నిరూపించడానికే ఇలా చేస్తున్నావా? అని అంటుంది లాస్య. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. ఏమైంది లాస్య అని అడుగుతాడు. నన్ను బ్యాడ్ చేసి లక్కీని తులసి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తోంది అంటుంది లాస్య.
లక్కీ జోలికి రావద్దని లాస్య చెబుతోంది కదా. ఎందుకు తన మాటలు పట్టించుకోవు అని నందు.. తులసిపై సీరియస్ అవుతాడు. దీంతో వీడికి డాడీ అని మిమ్మల్ని పరిచయం చేసింది కదా. మరి మీరెందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నిస్తుంది తులసి. లాస్య మాటలు మీరు వినరు కానీ.. నేను వినాలా? అని ప్రశ్నిస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.