intinti gruhalakshmi 24 february 2022 full episode
Intinti Gruhalakshmi 24 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 564 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏమడిగినా.. ఏం చేసినా అది వాడి మంచి కోసమే. వాడు బాగుపడాలనే. సంవత్సరం తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుందో డాక్టర్ చెప్పలేను అన్నారు. ఏమైనా కావొచ్చు అన్నారు. ఆ భయంతోనే నేను పోయాక వాడి జీవితం దారి తప్పకూడదని వాడితో మొండిగా ప్రవర్తించాను. ఎవరు నన్ను ఏమనుకున్నా తల్లిగా నా బాధ్యత నెరవేర్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఆ ఎస్ఐ నిన్ను నా ముందు నిలబెట్టేలా చేస్తాను అని అనుకుంటుంది తులసి. ఉదయం కాగానే. అత్తయ్య, మామయ్య నేను బయటికి వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు.. నాకోసం ఎదురు చూడకండి.. అంటుంది తులసి.
intinti gruhalakshmi 24 february 2022 full episode
ఇంతలో నందు అక్కడికి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు మళ్లీ పోలీస్ స్టేషన్ కేనా అంటాడు నందు. దీంతో మీకు నిన్ననే చెప్పాను. అడిగే అధికారం కానీ.. చెప్పే హక్కు కానీ నాకు లేదు.. అంటుంది తులసి. ఒక్క పద్ధతి ప్లాన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ అభి ఇష్యూను కాంప్లికేట్ చేస్తోంది తులసి. పోనీ.. మాట్లాడి నచ్చజెప్పుదామని చూస్తే నా మాట వినడం లేదు అంటాడు నందు. నేను ఇఫ్పటికే హయ్యర్ అఫిషియల్స్ తో మాట్లాడా.. ఎస్ఐతో మాట్లాడుతా అన్నారు. ఇదే సమయంలో నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఎస్ఐతో మళ్లీ గొడవ పెట్టుకుంటావా.. అప్పుడు ఆ ఎస్ఐ మరింత రెచ్చిపోతాడు అంటాడు నందు. కొడుకంటే నీకే కాదు.. నాకూ ప్రేమ ఉంది. అభి నాకు కూడా కొడుకే అని ఆమెకు గుర్తు చేయండి అంటాడు నందు.
దీంతో నందు ప్రయత్నాన్ని నందును చేయనిద్దాం.. ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అందరూ తులసిని నచ్చజెప్పుతారు. అభి విషయంలో మీరు దూరంగా ఉండండి ఆంటి అని అంకిత అంటుంది. ఇది నా పసుపు కుంకుమలకు సంబంధించిన అంశం ఆంటి అంటుంది అంకిత.
అభిని కాపాడే బాధ్యత ఇక నీదే. తులసి ఎక్కడికీ వెళ్లదు అంటాడు పరందామయ్య. దీంతో నిజంగా మీ కొడుకు మీద ఇంత నమ్మకం ఉందా అని అడుగుతుంది తులసి. దీంతో నాకు మాత్రం ఆయన మీద ఏ మాత్రం నమ్మకం లేదు అంటుంది తులసి. ఆయన బాధితురాలిని కాబట్టి.. ఆయనకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి అంటుంది తులసి.
వేదమంత్రాల సాక్షిగా నా మెడలో మూడు ముళ్లు వేస్తూ మీరు ఏ ప్రమాణం చేశారు గుర్తు తెచ్చుకోండి. నాతో జీవిత ప్రయాణం మొదలు పెట్టి ఆ తర్వాత ఏం చేశారు. మిమ్మల్ని నమ్మి నేను మీతో కలిసి వచ్చాను కానీ.. నన్ను మాత్రం మీరు గాలికి వదిలేశారు.. మీ అమ్మానాన్న మిమ్మల్ని నమ్మినా నేను నమ్మను అంటుంది తులసి.
ఇలాంటి మనిషిని నమ్మి అభిని కాపాడే బాధ్యత ఆయనకు నేను ఇవ్వను.. అంటుంది తులసి. దీంతో ఆంటి.. అభి మీకు కొడుకే కావచ్చు.. నాకు భర్త కూడా. నా బాధ కూడా పట్టించుకోండి.. అంటుంది తులసి. నందు కూడా అదే అంటాడు.
సరే ఆంటి మీ స్ట్రాటజీ ఏంటి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏం చేయబోతున్నారు.. చెప్పండి. మేము కూడా వస్తాం. మీకు సాయం చేస్తాం అంటారు అందరూ. దీంతో ఇంకేం చెబుతుంది మామయ్య గారు. మళ్లీ వెళ్లి ఆ ఎస్ఐ కాళ్లు పట్టుకుంటుంది. అంతకు మించి ఇంకేం చేయగలదు అంటుంది లాస్య.
ఎవ్వరి మాట వినదల్చుకోలేదు. నా దారిలో నేను వెళ్తాను. నా కన్న కొడుకును నేను కాపాడుకుంటాను.. అంటుంది తులసి. దీంతో తులసి మూర్ఖత్వంగా మాట్లాడకు అంటాడు నందు. నా ప్రయత్నాల్లో మీ కొడుకును ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి.. ఆయన ప్రయత్నాల్లో నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
దీంతో అందరికీ ఏం చేయాలో అర్థం కాదు. నందు.. తులసి ఆవేశంగా వెళ్లింది కానీ.. అభిని కాపాడే విషయంలో నీ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టు అంటుంది లాస్య. కట్ చేస్తే ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడడు. అక్కడ ఒక టెంట్ వేసి ఉంటుంది.
స్టేషన్ ముందు ఆ టెంట్ ఏంటి అని అడుగుతాడు పోలీస్. ఇంతలో తులసి అక్కడ బోర్డులను పెడుతూ ఉంటుంది. అరెస్ట్ చేసిన నా కొడుకుని చూపించండి.. అంటూ బోర్డులు పెడుతుంది తులసి. చేతిలో ఒక ప్లకార్డ్ పట్టుకొని అక్కడ కూర్చొని దీక్ష చేస్తూ ఉంటుంది తులసి.
దీంతో కోపంతో ఎస్ఐ తన దగ్గరికి వస్తాడు. నీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటా అని అంటాడు ఎస్ఐ. నా మీద యుద్ధం చేస్తున్నావా అంటాడు. నా బిడ్డను రక్షించుకోవడానికి పెనుగులాడుతున్నాను. ఇది నీ మీద యుద్ధం కాదు. దగాపడ్డ ఒక తల్లి చేస్తున్న న్యాయపోరాటం ఇది.. అంటుంది తులసి.
ఎందుకు సార్ మా లాంటి బలహీనమైన ప్రాణాలతో ఆడుకుంటారు అంటుంది తులసి. నా కుటుంబం పరువు పక్కన పెట్టి ఒక అమ్మగా బిడ్డ కోసం రోడ్డు మీద పడ్డాను. ఈ గొడవ నాకు మంచిది కాదు.. మీకు మంచిది కాదు అంటుంది తులసి. ఏంటి బెదిరిస్తున్నావా అంటాడు పోలీస్.
నా షర్ట్ పట్టుకొని అప్పుడు నీ కొడుకు నా ఈగోను టచ్ చేశాడు. ఇప్పుడు నా స్టేషన్ ముందు నువ్వు టెంట్ వేసి రచ్చ రచ్చ చేస్తున్నావు అంటాడు పోలీస్. సరే.. ఈ మేడమ్ ను ప్రశాంతంగా దీక్ష చేసుకోనివ్వండి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి.. అర్థం అయిందా అని చెబుతాడు పోలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.