Business idea : కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన గీతా సలీష్‌కు తన పద మూడేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా… అరుదైన జన్యు సంబంధ సమస్య అయిన రెటినిటిస్ పిగ్మెంటోసా సోకిందని తెలిపారు. అప్పటి నుంచి ఆమెకు మెళ్లి మెళ్లిగా కంటి చూపు మందగిస్తూ వచ్చింది. గీత పది హేనేళ్లకు చేరుకునే లోపు పూర్తిగా కంటి చూపు పోయి అంధురాలైంది. కానీ ఆమె కుంగి పోలేదు. తన లక్ష్యాన్ని వదులు కోలేదు. చిన్నప్పటి నుంచే బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిర పడాలని కలల కన్న గీత… అందు కోసం ఎంత గానో కృషి చేసింది. బ్రెయిలీ లిపి నేర్చుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె మెడికల్ రిప్రజెంటేటివ్, డిస్ట్రిబ్యూటర్ అయిన సలీష్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలతోనే సంవత్సరాలు గడిచిపోయాయి.
కానీ తాను మాత్రం సొంతంగా ఏదైనా చేయాలనుకుంది. కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో… ఆన్ లైన్ లో ఆహారం విక్రయించాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అందుకు ఒప్పుకున్న ఆయన సహకారంతో ఇంట్లోనే నెయ్యి, ఊరగాయలు, పసుపుతో వంటకాలు చేసి ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించుకుంది. 2020లో తన భర్త సలీష్ కుమార్ తో కలిసి గీతాస్ హోమ్ టు హోమ్ ని ప్రారంభించింది. అయితే గీత ప్రత్యేకమైన ఓ వంటకాన్ని తయారు చేసింది. ప్రసవం తర్వాత స్త్రీలు గట్టిపడేందుకు ఉపయోగపడే పసుపు, ఖర్జూరం, బాదం, కొబ్బరి పాలు, బెల్లంతో ఓ వినూత్న వంటకాన్ని తయారు చేసింది. దానికి కర్కుమీల్ అనే పేరు పెట్టి.. ఆన్ లైన్ వేదికగా అమ్మకం ప్రారంభించింది. ఈ వంటకం రుచి బాగుండటం… హెల్తీ కూడా కావడంతో చాలా మంది దీనిని కొనేందుకు ఆసక్తి కనబర్చారు.
అయితే 500 గ్రాముల విలువ చేసే ఈ కరుకుమీన్ ధర 600 రూపాయలు. అయితే దీనిని చిన్న పిల‌్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చట. అంతే కాదు పొడి రూపంలో, నేరుగా తినొచ్చేలాగా కూడా ఉంటుంది. పొడి అయితే పాలల్లో కలుపుకొని తాగాలి. దేశ వ్యాప్తంగా ఈ కర్కుమీల్ కు గిరాకీ ఎక్కువ. అయితే ఈ వ్యాపారం ద్వారా నెలకు 50 వేల రూపాయలను సంపాదిస్తోంది గీత. “నేను నా స్వంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. దృష్టి లోపం నన్ను ఎప్పుడూ ఆపలేదు. నా భర్త మరియు నా పిల్లలు ఎల్లప్పుడూ నాకు సహకరించారు. అన్ని వేళలా నాకు మద్దతు ఇచ్చారు ” అని గీత చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం గీత, ఆమె భర్త సలీష్ లు త్రిస్సూర్‌లో ఒక చిన్న రెస్టారెంట్‌ను నడిపేవారు. దాని వ
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.