Intinti Gruhalakshmi 24 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 537 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పండుగ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ పనులు చెబుతుంది తులసి. తను చేయకుండా అందరినీ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తుంది. తను లేకపోతే పిల్లలు తమ కాళ్ల మీద నిలబడాలని అనుకొని వాళ్లకు ఈ పనులు చెబుతుంది తులసి. దీంతో ప్రేమ్, అభి ఇద్దరూ ఇంట్లో ఉన్న బూజు మొత్తం దులుపుతారు. కాసేపు దులపగానే ఇద్దరికీ నడుము పట్టేస్తుంది. ఇంత పని అమ్మ ఒక్కతే ఎలా చేస్తుందో ఏమో అని అనుకుంటారు. ఇదంతా చూసిన తులసి అమ్మ ఒక్కతే ఎలా కష్టపడుతుందో ఏమో అని అనుకుంటారు.
మరోవైపు పిండి వంటలు చేసేందుకు శృతి, అంకిత రెడీ అవుతారు. తులసి కాళ్లకు దండం పెట్టుకొని పని ప్రారంభిస్తారు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇక నాకు ఏమైపోయినా పర్వాలేదు అని అనిపిస్తోంది.. అని అనుకుంటుంది తులసి. ఇన్నాళ్లు మీ నీడలా బతికాం. కానీ.. ఇప్పటి నుంచి మీరు మా నీడలా మారిపోయారు.. అని వెన్నెల అంటుంది. గ్యాస్ స్టవ్ కు పూజలు చేసి వెలిగించి పిండి వంటలు స్టార్ట్ చేస్తారు. పరందామయ్య, అనసూయ కూడా వాళ్లకు సాయం చేస్తుంటారు. అలాగే ఉదయం నుంచి కష్టపడి అంకిత, శృతి ఇద్దరూ వంటలు చేస్తారు. పిండి వంటలు చేస్తారు. వాళ్లను చూస్తూ ఉంటుంది తులసి. మరోవైపు నందు టెన్షన్ పడుతూ ఉంటాడు.
నందును చూసిన తులసి ఏమైంది ఈయనకు అనుకుంటుంది. భార్యగా ఉన్నన్నాళ్లు నన్ను ఎప్పుడూ సలహా అడగలేదు. ఇప్పుడేమో నా సలహాలు అడుగుతున్నాడు అని అనుకుంటుంది తులసి. మీకు విడాకులు ఇచ్చాక నాకు తెలివి పెరిగిందేమో అని అనుకున్నాను అంటుంది తులసి.
మీరు లాస్యను సీరియస్ గా తీసుకోండి. సమస్య అడిగే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకోండి. నేను చదువురాని మొద్దును. నా లేవల్ కు తగ్గ సమస్య అయితేనే అడగండి. నేనేదో కక్ష సాధించడానిక అడగం లేదు.. సమస్య ఏంటో అడగండి అంటుంది. దీంతో నా కేఫ్ కు సంబంధించిన విషయం అంటాడు.
ఇవి పండుగ రోజులు కదా. ఈ సమయంలో బిజినెస్ డల్ అవుతుంది. ఈ సందర్భంలో కస్టమర్లను ఆకర్షించి బిజినెస్ పెంచుకోవడం కోసం ఏం చేయాలి అని అడుగుతాడు నందు. దీంతో తులసి సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో తను ఒక ఐడియా చెబుతుంది. దీంతో సూపర్ అంటాడు నందు.
ఇంతకుముందు పండుగ వస్తుందంటే హుషారుగా ఎగిరి గంతేసేవాళ్లం. ఇప్పుడు పండుగ పేరు చెబితేనే పారిపోవాలనిపిస్తోంది అంటాడు అభి. ఇంతలో తులసి వచ్చి ఏంటి అలా కూర్చున్నారు అంటుంది తులసి. భోగి మంటలకు కావాల్సిన పాత వస్తువులు అన్నింటినీ గార్డెన్ లో పెట్టండి అంటుంది తులసి.
మరోవైపు ఉదయం 4 అవుతుంది. దివ్య నిద్రపోతూ ఉంటుంది. అభి, అంకిత వచ్చి దివ్యను లేపుతారు. ఆ తర్వాత ప్రేమ్, శృతి కూడా లేస్తారు. అందరూ కలిసి కిందికి వెళ్తారు. పిల్లలు ఇంకా రాలేదు ఏంటి అని అంటాడు పరందామయ్య. కిందికి వెళ్లగానే తులసి, అనసూయ, పరందామయ్య అందరూ ఉంటారు.
ఇక ఆలస్యం ఎందుకు భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అడుగుతుంది దివ్య. దీంతో ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి పంపించడం కోసం ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు అని చెబుతుంది తులసి. ఈరోజు నుంచి ఎవరి ఆధారం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటారని మొక్కుకొని భోగి మంటలు వెలిగించండి అని చెబుతుంది తులసి.
దీంతో భోగి మంటలను వెలిగిస్తారు. అమ్మా.. ఇక పండుగ పనులు పూర్తయ్యాయా అని అడుగుతారు. అప్పుడేనా.. ఇప్పుడే మొదలయ్యాయి. పూలను దండలుగా చేసి ఇంట్లోని గుమ్మాలకు అమర్చాలి అని చెబుతుంది తులసి. దీంతో అభి, ప్రేమ్ షాక్ అవుతారు.
ఉదయం అవుతుంది. లాస్య.. అందంగా రెడీ అవుతుంది. లాస్యను అలాగే చూస్తూ ఉండిపోతాడు నందు. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది లాస్య. అంత ముద్దొస్తున్నానా అంటుంది లాస్య. కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు అంటుంది లాస్య.
నేను గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు నా అందాన్న ఎప్పుడూ పొగుడుతుండేవాడివి. ఇప్పుడు మాత్రం మానేశావు అంటుంది లాస్య. రోజూ ఉదయమే లేచి ఇలా అందంగా ముస్తాబు అయ్యేది నాకోసం కాదు.. నీ కోసమే అంటుంది లాస్య. ఎప్పటికైనా నువ్వు నా అందాన్ని మెచ్చుకోకపోతావా అని అంటుంది.
దీంతో బాగున్నావు అని అంటాడు నందు. రోజూ బాగున్నానా… లేదా ఈరోజు మాత్రమే బాగున్నానా అని అడుగుతుంది. దీంతో రోజూ బాగుంటావు. ఈరోజు ఇంకా బాగున్నావు అంటాడు నందు. మరోవైపు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో పూలదండలు కడుతుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.