jaswanth yadav villain Third odi match Ind vs SA
Team India : సౌతాఫ్రికా టూర్‌ని భారత్ దారుణంగా ముగించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా కనీసం వన్డే సిరీస్ అయిన గెలుస్తుందని అందరు ఊహించారు. కాని అందులోను దారుణంగా నిరాశపరిచారు. వన్డే సిరీస్ లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దక్షిణాఫ్రికా 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఓటమి టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఎందుకంటే ప్రస్తుత టీం చాలా బలమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సన్నద్ధమైంది. అయినప్పటికీ, భారత్ గెలవలేకపోయింది.
మూడో వన్డే లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్‌లో 283 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టులో దీపక్ చాహర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి అర్ధ సెంచరీలు చేసినప్పటికీ , గెలవలేకపోయారు .అయితే ఇండియా ఇంత దారుణంగా ఓడిపోవడానికి పలు కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా మూడో వన్డేలో ఓడిపోవడానికి జయంత్ యాదవ్ ఓ కారణంగా చెబుతున్నారు. అతను బ్యాట్, బాల్‌తో పూర్తిగా నిరాశపరిచాడు.దాదాపు 6 ఏళ్ల తర్వాత వన్డేల్లో అతనికి ఛాన్స్ ఇవ్వగా ఏ మాత్రం చరిష్మా చూపించలేకపోయాడు.
jaswanth yadav villain Third odi match Ind vs SA
రిషబ్ పంత్ రాంగ్ టైమ్‌లో చాలా బాధ్యతారహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోయాడు. శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ కూడా ఇలానే చేసి నిరాశ పరిచారు.ఇది కూడా భారత జట్టు ఓటమికి కారణంగా మారింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్సీని నిరూపించుకుంటాడు అనుకుంటే కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. విరాట్, రోహిత్‌లా ఆకట్టుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా ఎనర్జీ చాలా తక్కువగా కనిపించింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.